లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
Published Wed, Sep 18 2013 4:35 PM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
బుధవారం నాటి మార్కెట్ లో ఊగిసలాటాడిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు చివరికి లాభాలతో ముగిసాయి. ఆరంభంలో నష్టాలతో ఆరంభమైన సెన్సెక్స్ నిఫ్టీలు నిన్నటి ముగింపుకు వృద్ధిని సాధించాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 19962 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 5909 వద్ద క్లోజైంది.
ఇక అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల ప్రభావంతో బ్యాంకులు, ఎగుమతిదారులు కరెన్సీని అమ్మకాలు జరపడంతో ఆరంభంలో రూపాయి క్షీణించింది. ఆరంభంలో నమోదు చేసుకున్న నష్టాలను నుంచి కోలుకుంది. రూపాయి ప్రస్తుతం 8 పైసల వృద్ధిని సాధించి 63.29 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇండెక్స్ ఆధారిత కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ 4 శాతానికి పైగా, గ్రాసీం, ఎన్ టీపీసీ, టాటా పవర్, ఐడీఎఫ్ సీలు మూడు శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. భెల్, హీరో మోటోకార్ప్, సెసాగోవా, కెయిర్న్ ఇండియా, ఎన్ ఎమ్ డీసీలు నష్టాల్లో ముగిసాయి.
Advertisement