గరిష్టస్థాయికి సెన్సెక్స్, రూ. 61 ఎగువన రూపాయి
గరిష్టస్థాయికి సెన్సెక్స్, రూ. 61 ఎగువన రూపాయి
Published Wed, Apr 23 2014 10:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM
గ్లోబల్ మార్కెట్లలో సానుకూలత, కాపిటల్ గూడ్స్, ఐటీ, హెల్త్ కేర్, ఆటో సెక్టార్లలో నిధుల ప్రవాహం ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ లు రికార్డు గరిష్టస్థాయిని నమోదు చేసుకున్నాయి. ఏప్రిల్ మాసం డెరెవేటివ్ కాంట్రాక్టులకు చివరి రోజున 116 పాయింట్ల లాభంతో 22875 పాయింట్ల, నిఫ్టీ 46 వృద్దితో 6861 పాయింట్ల జీవితకాలపు గరిష్టస్థాయిని నమోదు చేసుకుంది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సన్ పార్మా, కొటాక్ మహేంద్ర, భెల్, భారతీ ఎయిర్ టెల్, లార్సెన్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకోగా, డీఎల్ఎఫ్, హెచ్ సీఎల్, ఎన్ టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ బ్యాంక్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.
అంతర్జాతీయ ద్రవ్యమార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి 30 పైసలు పతనమై 61 రూపాయిల పైన ట్రేడ్ అవుతోంది.
Advertisement
Advertisement