ఏడో రోజు కూడా లాభాల్లోనే
స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా ఏడో రోజు కూడా లాభాలతో ముగిసాయి. ఆగస్టు నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజున సెన్సెక్స్ 78 పాయింట్ల లాభంతో 26638 పాయింట్ల, నిఫ్టీ 18 పాయింట్ల వృద్ధితో 7954 పాయింట్ల వద్ద ముగిసాయి. ప్రధాన సూచీలు జీవితకాలపు గరిష్ట స్థాయి వద్ద ముగియడం విశేషం.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో భెల్ అత్యధికంగా 5 శాతం లాభపడగా, బీపీసీఎల్, ఐడీఎఫ్ సీ, గెయిల్, ఓఎన్ జీసీ లు స్వలంగా లాభపడ్డాయి. జిందాల్ స్టీల్ సుమారు 5 శాతం నష్టపోగా, డీఎల్ఎఫ్ 3 శాతం, టాటా పవర్, టాటాస్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.