సెన్సెక్స్ 117 పాయింట్ల లాభం
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం లాభాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 26560 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల వృద్దితో 7936 వద్ద ముగిసాయి.
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 26,599-26,492 పాయింట్ల మధ్య, నిఫ్టీ 7,946-7,916 పాయింట్ల మధ్య కదలాడింది. 630 కోట్ల రూపాయల జరిమానా సుప్రీంకోర్టు విధించడంతో డీఎల్ఎఫ్ 4.57 శాతం నష్టపోయింది.
ఇంట్రాడే ట్రేడింగ్ లో జిందాల్ స్టీల్, హెచ్ సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఓఎన్ జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో ముగిసాయి. భెల్, సెసా స్టెరిలైట్, ఐడీఎఫ్ సీ, కొటాక్ మహీంద్ర కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.