స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ స్పందన, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ అంశాల ప్రభావంతో భారత స్తాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ క్రితం ముగింపుకు 98 పాయింట్లు కో్ల్పోయి 26752 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు క్షీణించి 7991 వద్ద ముగిసాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో జిందాల్ స్టీల్, డీఎల్ఎఫ్ సుమారు 8 శాతం, హెచ్ యూఎల్ 5 శాతం, కెయిర్న్ ఇండియా 4 శాతం, టాటా మోటార్స్ 2.32 శాతం నష్టపోయాయి. బీహెచ్ఈఎల్ అత్యధికంగా 5 శాతం, కొటాక్ మహీంద్ర, ఇండస్ ఇండియా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అంబూజా సిమెంట్స్ స్వల్పంగా లాభపడ్డాయి.