భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం, మెటల్, ఆటోమోబైల్, బ్యాంకు రంగాలకు చెందిన కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. శుక్రవారం నాటి మార్కెట్ లో సెన్సెక్స్ 339 పాయింట్ల నష్టంతో 26297 పాయింట్ల వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు క్షీణించి 7859 వద్ద ముగిసాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఇన్ఫోసిస్ అత్యధికంగా 6.63 శాతం, హెచ్ సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, భెల్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.
జిందాల్ స్టీల్, టాటా మోటార్స్, ఎన్ ఎమ్ డీసీ కంపెనీల షేర్లు 5 శాతానికి పైగా, హిండాల్కో, సెసా గోవా సుమారు 5 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.