Infysos
-
సూచీలకు అండగా ఐటీ షేర్ల ర్యాలీ
పరిమిత శ్రేణి మార్కెట్లో మంగళవారం ఐటీ షేర్లు రాణిస్తున్నాయి. ఐటీ షేర్ల ర్యాలీ సూచీల పతనాన్ని అడ్డుకుంటుంది. డాలర్ మారకంలో రూపాయి బలహీనత ఇందుకు కారణవుతోంది. ఎన్ఎస్ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2శాతానికి పైగా లాభపడి 15801 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. పారెక్స్ మార్కెట్లో నేడు రూపాయి విలువ నిన్నటి ముగింపు(74.64)తో పోలిస్తే ఒక దశలో 18పైసలు బలహీపడింది. రూపాయి బలహీనతో డాలర్ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీలకు కలిసొచ్చే అంశమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు భారీగా కాంట్రాక్టులు దక్కించుకోవచ్చనే ఐటీ నిపుణుల అంచనాలు ఈరంగ షేర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఫలితంగా నేడు మార్కెట్ ప్రారంభంలోనే ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఉదయం 10గంటలకు ఇండెక్స్ మునుపటి ముగింపు(15464.95)తో పోలిస్తే 2శాతం లాభంతో 15,787 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రంగానికి చెందిన ఎన్ఐఐటీ టెక్ షేరు 8.50శాతం పెరిగింది. ఇన్ఫోసిస్ 3శాతం లాభపడింది. నౌకరీ, మైండ్ ట్రీ, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఎల్అండ్టీ ఇండియా, ఎంఫసీస్ షేర్లు 1శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. -
భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం, మెటల్, ఆటోమోబైల్, బ్యాంకు రంగాలకు చెందిన కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. శుక్రవారం నాటి మార్కెట్ లో సెన్సెక్స్ 339 పాయింట్ల నష్టంతో 26297 పాయింట్ల వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు క్షీణించి 7859 వద్ద ముగిసాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఇన్ఫోసిస్ అత్యధికంగా 6.63 శాతం, హెచ్ సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, భెల్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. జిందాల్ స్టీల్, టాటా మోటార్స్, ఎన్ ఎమ్ డీసీ కంపెనీల షేర్లు 5 శాతానికి పైగా, హిండాల్కో, సెసా గోవా సుమారు 5 శాతం నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.