28 వేల మార్కును తాకిన సెన్సెక్స్!
28 వేల మార్కును తాకిన సెన్సెక్స్!
Published Wed, Nov 5 2014 10:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
భారత స్టాక్ మార్కెట్ లో ప్రధాన సూచీలు మరో నూతన గరిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. తొలిసారి సెన్సెక్స్ 28 వేల మార్కును, నిఫ్టీ 8363 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకాయి. విదేశీ మదుపుదారుల నిధుల ప్రవాహం కొనసాగడం, కార్పోరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల సానుకూలంగా ఉండటమనే అంశాలు మార్కెట్ బుల్ ర్యాలీకి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 27907 పాయింట్ల వద్ద ఆరంభమై 28006 పాయింట్ల గరిష్టాన్ని నమోదు చేసుకోగా, నిఫ్టీ 8351 వద్ద ఆరంభమై 8363 పాయింట్ల గరిష్టాన్ని నమోదు చేసుకున్నాయి. క్రితం ముగింపుకు సెన్సెక్స్ 98 పాయింట్ల వృద్ధితో 27856 వద్ద, నిఫ్టీ 29 పాయింట్ల లాభంతో 8354 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
బీపీసీఎల్, ఎస్ బీఐ, యాక్సీస్ బ్యాంక్, జీ ఎంటర్ టైన్ మెంట్, సన్ ఫార్మా కంపెనీలు లాభాల్ని, కెయిర్న్ ఇండియా, సెసా గోవా, ఎన్ ఎమ్ డీసీ, కోల్ ఇండియా, జిందాల్ స్టీల్ కంపెనీలు నష్ట్రాల్ని నమోదు చేసుకున్నాయి.
Follow @sakshinewsAdvertisement