మరో నూతన గరిష్టస్థాయికి సెన్సెక్స్!
ముంబై: బ్యాంకింగ్, హెల్త్ కేర్, కాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నూతన గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. సోమవారం నాటి మధ్యాహ్నం ట్రేడింగ్ సమయానికి సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 27200 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల వృద్దితో 8140 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 27,248 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఏషియన్ పెయింట్స్ అత్యధికంగా 4.43 శాతం, గ్రాసీం, అంబుజా సిమెంట్స్, హిండాల్కో, జిందాల్ స్టీల్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. పవర్ గ్రిడ్ కార్పోరేషన్, యునైటెడ్ స్పిరిట్స్, కోటాక్ మహీంద్ర, మారుతి సుజుకీ, ఎం అండ్ ఎం నష్టాల్లో కొనసాగుతున్నాయి.