నష్టాల నుంచి తీరుకున్న సెన్సెక్స్!
హైదరాబాద్: ఆయిల్, గ్యాస్ కాపిటల్ గూడ్స్ రంగాల కంపెనీల షేర్లలో అమ్మకాలు జరగడంతో ఓ దశలో భారీ నష్టాలకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు చివరకు లాభాలతో ముగిసాయి. ఓ దశలో సెన్సెక్స్ 177 పాయింట్ల నష్టానికి లోనైంది.
మధ్యాహ్నం సమయానికి జోరందుకున్న సెన్సెక్స్... మార్కెట్ ముగింపు సమాయానికి 86 పాయింట్ల లాభంతో 26384 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల వృద్దితో 7884 వద్ద ముగిసింది.
టాటా పవర్, ఎన్ ఎమ్ డీసీ, పీఎన్ బీ, టాటా స్టీల్, యాక్సీస్ బ్యాంక్ కంపెనీలు 2 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్ అత్యధికంగా 3.77 శాతం, ఎంఅండ్ఎం, సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ కంపెనీల షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి.