లాభాలతో సెన్సెక్స్ ప్రారంభం!
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రధాన సూచీల్లో సెన్సెక్స్ 27943 పాయింట్ల, నిఫ్టీ 8348 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ఆరంభంలో నమోదు చేసుకున్న లాభాలను నిలబెట్టుకోలేక వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి.
డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, జిందాల్ స్టీల్, జీ ఎంటర్ టైన్ మెంట్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ కంపెనీలు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
డీఎల్ఎఫ్, ఎం అండ్ ఎం, గెయిల్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.