నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్!
ముంబై: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నేటి ట్రేడింగ్ లో 27316 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. 27202 పాయింట్ల కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 94 పాయింట్ల నష్టంతో 27225 పాయింట్ల వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు క్షీణించి 8138 వద్ద ట్రేడ్ అవుతోంది.
సిప్లా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోల్ ఇండియా, జిందాల్ స్టీల్, టాటా పవర్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్ర, డీఎల్ఎఫ్, హెచ్ సీఎల్ టెక్, ఇన్పోసిస్, విప్రో కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.