స్వల్ప నష్టాల్లో ప్రధాన సూచీలు
ముంబై: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 68 పాయింట్లు క్షీణించి 27940, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 8357 వద్ద ముగిసాయి. హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, లుపిన్, టెక్ మహీంద్ర కంపెనీల షేర్లు లాభాలతో ముగిసాయి.
బీపీసీఎల్, కెయిర్న్ ఇండియా, ఎన్ ఎమ్ డీసీ, సెసాగోవా స్టెరిలైట్, టాటా పవర్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా యూరప్ మార్కెట్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి.