325 పాయింట్లతో సెన్సెక్స్ రికార్డు హై! | Sensex, Nifty touch new record highs | Sakshi
Sakshi News home page

325 పాయింట్లతో సెన్సెక్స్ రికార్డు హై!

Published Wed, Jul 2 2014 3:58 PM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

325 పాయింట్లతో సెన్సెక్స్ రికార్డు హై!

325 పాయింట్లతో సెన్సెక్స్ రికార్డు హై!

భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాయి.

బ్యాంకింగ్, మెటల్, ఆటో మొబైల్, కాపిటల్ గూడ్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరందుకోవడం, బడ్జెట్ పై సానుకూలాంశాలు ఉండవచ్చనే అంచనాలతో  భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాయి. 
 
 బుధవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,660 పాయింట్ల వద్ద ఆరంభమై, ఓ దశలో 25,864 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. చివరకు నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి 25841 పాయింట్ల వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు వృద్దితో 7725 వద్ద ముగిశాయి.
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సెసా స్టెరిలైట్ అత్యధికంగా 4.69 శాతం, ఎన్ టీపీసీ 3.33, యునైటెడ్ స్పిరిట్ 2.76, భెల్ 2.75, హెచ్ డీఎఫ్ సీ 2.41 శాతం లాభపడ్డాయి. హెచ్ సీఎల్ టెక్, పీఎన్ బీ, గెయిల్, టెక్ మహీంద్ర, ఇన్పోసిస్ స్వల్పంగా నష్టపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement