ఉదయం లాభాలు చివరికి ఆవిరి!
భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఆరంభంలో సాధించిన భారీ లాభాలు చివరికి ఆవిరయ్యాయి.
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఆరంభంలో సాధించిన భారీ లాభాలు చివరికి ఆవిరయ్యాయి. ప్రధాన సూచీలు ఓ దశలో భారీ లాభాలతో నమోదు చేసుకున్నాయి. మార్కెట్ ముగింపులో ప్రధాన సూచీలలలో సెన్సెక్స్ 23 పాయింట్ల స్వల్ప లాభంతో 24716 పాయింట్ల వద్ద, నిప్టీ 8 పాయింట్ల నష్టంతో 7359 వద్ద ముగిసాయి.
ఓదశలో ఇంట్రాడే ట్రేడిగ్ లో సెన్సెక్స్ 25175 పాయింట్ల, నిఫ్టీ 7504 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదు చేసుకున్నాయి.
విదేశీ మదుపుదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపడంతో సెన్సెక్స్ మరోసారి 25 వేల మార్కును అధిగమించింది. అయితే రియాల్టీ, విద్యుత్, కాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో నష్టాల్లోకి జారుకుంది.
ఎం అండ్ ఎం, సెసా గోవా, హెచ్ సీఎల్ టెక్, విప్రో, టాటా పవర్ లు లాభాలను నమోదు చేసుకున్నాయి. డీఎల్ఎఫ్, భెల్, ఐడీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా పవర్ లు 4 శాతానికి పైగా నష్టపోయాయి.