బ్యాంకింగ్, కాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్ రంగాల షేర్ల కొనుగోళ్లతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
లాభాలతో సెన్సెక్స్ ప్రారంభం!
Published Wed, Jul 16 2014 10:48 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM
ముంబై: బ్యాంకింగ్, కాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్ రంగాల షేర్ల కొనుగోళ్లతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
ప్రధాన సూచీ సెన్సెక్స్ 25322 పాయింట్ల ఆరంభమై.. 25377 పాయింట్ల గరిష్ట స్థాయిని, 25,284 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 7550 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఐడీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్, డీఎల్ ఎఫ్, హిండాల్కో, ఎస్ బీఐ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్ డీఎఫ్ సీ, గెయిల్, సెసా స్టెర్ లైట్, కోల్ ఇండియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేర్లలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.
Advertisement
Advertisement