నష్టాల్లో సెన్సెక్స్ , నిఫ్టీ!
బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సోమవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. క్రితం ముగింపుకు సెన్సెక్స్ 121 పాయింట్ల నష్టంతో 26673 పాయింట్ల వద్ద, నిఫ్టీ 45 పతనంతో 8076 పాయింట్ల వద్ద మధ్యాహ్నం సమయానికి ట్రేడ్ అవుతున్నాయి.
టాటా మోటార్స్, ఓఎన్ జీసీ, హీరో మోటోకార్ప్, బీపీసీఎల్, ఐటీసీ కంపెనీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, సిప్లా, టాటా స్టీల్, కొటాక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ 2 శాతానికి పైగా నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.