లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ!
హైదరాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ మెరుగైన ఫలితాల ప్రభావం, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. క్రితం ముగింపుకు సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 25769 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల వృద్దితో ట్రేడ్ అవుతున్నాయి.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో రియలన్స్, హెచ్ డీఎఫ్ సీ, గ్రాసీం, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏసీసీ లు లాభాలతో కొనసాగుతున్నాయి. హిండాల్కో, ఇన్ఫోసిస్, డీఎల్ఎఫ్, గెయిల్, టాటా పవర్ కంపెనీలు నష్టాల్లో నమోదు చేసుకున్నాయి.