నష్టాలతో కొనసాగుతున్న సెన్సెక్స్!
ముంబై: గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత, హెల్త్ కేర్, మెటల్, ఆటో రంగాల కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 89 పాయింట్ల నష్టంతో 26978, నిఫ్టీ 20 పాయింట్లు క్షీణించి 8075 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఐడీఎఫ్ సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ, పీఎన్ బీ కంపెనీలు స్వల్ప లాభాల్లో కొనసాగుతుండగా, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఓఎన్ జీసీ, ఎన్ ఎమ్ డీసీ, లుపిన్ కంపెనీలు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.