ఏకంగా 14వేల కోట్లు కుమ్మరించారు
సంస్కరణలకు నూతనంగా ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వం ఊతమిస్తుందనే వార్తలకు విదేశీ సంస్థాగత మదపుదారులు సానుకూలంగా స్పందించారు.
న్యూఢిల్లీ: సంస్కరణలకు నూతనంగా ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వం ఊతమిస్తుందనే వార్తలకు విదేశీ సంస్థాగత మదపుదారులు సానుకూలంగా స్పందించారు. మే నెలలో ఏకంగా 14 వేల కోట్ల రూపాయల నిధులను భారతీయ స్టాక్ మార్కెట్ లో విదేశీ మదుపుదారులు పెట్టుబడి పెట్టారు. ఈక్వీటీ మార్కెట్ లో 84,777 కోట్ల రూపాయల మేరకు కొనుగోళ్లు చేశారని, 70,553 కోట్ల విలువైన షేర్లను అమ్మకాలు జరిపారని సెబీ వెల్లడించింది.
మార్కెట్ లోకి నిధుల ప్రవాహం నికరంగా 14224 కోట్ల రూపాయలని సెబీ తెలిపింది. అదే మాదిరిగా 12037 కోట్లు డెబిట్ మార్కెట్ లోకి విదేశీ పెట్టుబడిదారులు నిధులను మళ్లించినట్టు సమాచారం. విదేశీ పెట్టుబడిదారుల నిధుల ప్రవాహంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీల్లో సెన్సెక్స్ 10 శాతం వృద్దిని సాధించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మే 6 తేదిన సెన్సెక్స్ 25 వేల మార్కును దాటిన సంగతి తెలిసిందే.