సెన్సెక్స్, నిఫ్టీల సరికొత్త రికార్డు!
సెన్సెక్స్, నిఫ్టీల సరికొత్త రికార్డు!
Published Thu, Mar 27 2014 6:02 PM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
బ్యాకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల కంపెనీ షేర్లను కోనుగోలు చేయడానికి విదేశీ సంస్థాగత మదపుదారులు ఉత్సాహం చూపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా నాలుగవ రోజు లాభాలతో ముగిసాయి. గత కొద్ది రోజులుగా రికార్డులను నమోదు చేసున్న సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో 22214 పాయింట్ల వద్ద ముగిసి మరో సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది.
మరో ప్రధాన సూచీ నిఫ్టీ కూడా 40 పాయింట్ల లాభంతో 6641 వద్ద నూతన గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. సెబీ వెల్లడించిన డేటా ప్రకారం 171.26 మిలియన్ డాలర్ల మేరకు ఎఫ్ఐఐలు కొనుగోళ్లు జరిపారు.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా ఐడీఎఫ్ సీ 5.21 శాతం లాభపడగా, భారతీ ఎయిర్ టెల్, ఎస్ బీఐ, పీఎన్ బీ, అల్ట్రాటెక్ సిమెంట్ 3 శాతానికి పైగా లాభపడ్డాయి.
రాన్ బాక్సీ, డాక్టర్ రెడ్డీస్, గ్రాసీం, టాటా మోటార్స్, సెసా గోవా స్వల్ప నష్టాలతో ముగిసాయి.
Advertisement