ట్విటర్ వీడియో ఆధారంగా దృశ్యాలు
చెన్నై: తమిళనాడులోని ఓ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. సీనియర్లు ర్యాగింగ్ పేరిట జూనియర్లను శారీరకంగా వేధించారు. ఇందుకు సంబంధించిందిగా చెబుతున్న ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో సీనియర్లు దారుణానికి తెగ పడ్డారు. జూనియర్ స్టూడెంట్స్‌ను కేవలం అండర్ వేర్‌పై నిలబెట్టి.. క్యాంపస్‌లోనే దారుణమైన పనులు చేయించారు. అర్థనగ్నంగా క్యాంపస్ రోడ్లపై రౌండ్లు వేయించడంతో పాటు బురదలో బస్కీలు, పుషప్స్ తీయించడం, వాటర్ పైపులతో నీళ్లను చల్లడం లాంటివి చేశారు. చేతికి దొరికిన వస్తువులను వాళ్ల మీదకు విసిరేశారు.
మరోవైపు జూనియర్లను అర్థనగ్నంగానే ఒకరినొకరు కౌగిలించుకోవమని చెప్పడం, ప్రైవేట్ పార్ట్‌లపై కొట్టడం లాంటివి చేశాడు ఓ సీనియర్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. కేసు నమోదు అయ్యింది.
సీఎంసీ వెల్లూరు యాజమాన్యం.. ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, ఓ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు సీనియర్లపై వేటు పడినట్లు తెలుస్తోంది. వెల్లూరు ఎస్పీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ర్యాగింగ్ వీడియో నిజమైందేనా? నకిలీదా? తేల్చే పనిలో ఉన్నట్లు తెలిపారు.
Christian Medical College in Vellore has suspended seven senior medical students for ragging after videos of first-year MBBS students being beaten up, stripped & tortured went viral on social media.#TamilNadu #Vellore #CMC #CMCVellore #CMCRagging #MBBS #Ragging #ViralVideo pic.twitter.com/m5jkjMyUNf
— Hate Detector 🔍 (@HateDetectors) November 9, 2022
ఇదీ చదవండి: కరగాట్టంలో ఇక అశ్లీలత ఉండకూడదు!
Comments
Please login to add a commentAdd a comment