physical abuse
-
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్న హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ త్వరలోనే భారత్‌కు తిరిగి రానున్నారు. ఈనెల 31న సిట్ ముందు విచారణకు హాజరు కానున్నట్లు స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.‘నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు హాజరవుతాను. విచారణకు సహకరిస్తాను. నాపై నమోదైనవి తప్పుడు కేసులు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.’ అని సోమవారం పేర్కొన్నారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ కుట్రగా రేవణ్ణ పేర్కొన్నాడు. తాను మానసిక ఒత్తిడి, ఒంటరిగా ఉన్నట్లు చెప్పాడు. తన ఆచూకీ వివరాలు చెప్పనందుకు జేడీఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు కూడా చెప్పారు.‘విదేశాల్లో నేను ఎక్కడ ఉన్నానో సరైన సమాచారం అందించనందుకు నా కుటుంబ సభ్యులకు, మా కుమారన్న (కుమారస్వామి],పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు ముగిసినప్పుడు, నాపై ఎటువంటి కేసు లేదు. సిట్ ఏర్పాటు చేయలేదు. నేను వెళ్లిన రెండు, మూడు రోజుల తర్వాత యూట్యూబ్‌లో నాపై ఈ ఆరోపణలను చూశాను. అలాగే ఏడు రోజుల సమయం కావాలని నా లాయర్ ద్వారా సిట్‌కి లేఖ రాశాను.’ అని పేర్కొన్నారు.కాగా మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడైన ప్రజ్వల్ రేవణ్ణ(36) మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనేక మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియో బయటకు రావడంతో ప్రజ్వల్ ఏప్రిల్ 26న దేశం విడిచి వెళ్లిపోయారు.కాగా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు హాసన్ జిల్లా హొళె నరసీపుర పోలీస్ స్టేషన్లో ప్రజ్వల్‌తోపాటు ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. రేవణ్ణ రాసలీలలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. అనంతరం అతనిపై బ్లూ కార్నర్ నోటీసు' కూడా జారీ అయ్యింది.తన మనవడిని భారతదేశానికి తిరిగి రావాలని, పోలీసులకు లొంగిపోవాలని లేదా అతని ఆగ్రహాన్ని ఎదుర్కోవాలని కోరుతూ హెచ్డి దేవెగౌడ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అతని ప్రకటన రావడం గమనార్హం. అంతేగాక ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
‘వావీ వరసలు లేని.. నారాయణ.. నారాయణ’
ఢిల్లీ: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణ వేధింపుల పర్వంపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పందించారు. వావీ వరసలు లేకుండా సొంత కుటుంబసభ్యులనే కాదు.. ప్రజల్ని, చివరికి తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్నమైనర్ బాలికలను కూడా ఇలానే వేధిస్తున్నారని ట్విటర్ వేదికగా నారాయణపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు...నారాయణ! నారాయణ! నారాయణ! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. వావీ వరసలు లేకుండా సొంత కుటుంబసభ్యులనే కాదు ప్రజల్ని, చివరికి తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్నమైనర్ బాలికలను కూడా ఇలానే వేధిస్తున్నారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు...నారాయణ!… — Vijayasai Reddy V (@VSReddy_MP) July 29, 2023 పెద్ద మనిషి ముసుగులో పొంగూరు నారాయణ చేస్తున్న తేడా పనుల్ని ఆయన మరదలు ప్రియా వీడియో సాక్షిగా బయటపెట్టిన సంగతి తెలిసిందే. నారాయణ తనను తీవ్రంగా హింసిస్తున్నారని, అర్ధరాత్రి పూట టార్చర్ పెడుతున్నారంటూ ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ప్రియా కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో భార్య ఉండగానే తాను అన్నం తీసుకురాలేదని నారాయణ కొట్టారని.. తనను టార్చర్ చేసేవారని ఆమె ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియా.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ‘డేగ.. ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్లు..’ నారాయణ మరదలి ఆవేదన -
సంచలన తీర్పు.. ఆ తండ్రికి మూడు యావజ్జీవ ఖైదుల శిక్ష
మలప్పురం: వావీవరుసలు లేకుండా ప్రవర్తించే మృగాల పట్ల కఠినంగా వ్యవహారించాల్సిన అవసరం ఉంటుందని కేరళలోని ఓ స్థానిక కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కన్నతండ్రి ముసుగుతో దారుణానికి పాల్పడ్డ ఓవ్యక్తికి ఏకంగా మూడు యావజ్జీవ ఖైదుల శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. కేరళ మంజేరీ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు 2021లో జరిగిన ఓ ఘోరానికి గానూ తాజాగా శిక్ష ఖరారు చేసింది. కన్నకూతురిపైనే మృగవాంఛ తీర్చుకున్న ఓ వ్యక్తికి మూడు జీవిత ఖైదుల శిక్ష విధిస్తూ.. జీవితాంతం అతను జైల్లోనే మగ్గాలని తేల్చి చెప్పింది. పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఈ శిక్షలు ఖరారు చేస్తున్నట్లు న్యాయమూర్తి రాజేష్ కే వెల్లడించారు. అంతేకాదు నిందితుడికి ఆరున్నర లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారాయన. మార్చి 2021లో తొలిసారిగా బాలికపై లైంగిక దాడి జరిగింది. కరోనా సమయంకావడంతో ఆమె ఆన్లైన్లో క్లాసులు వింటోంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన ఆమె తండ్రి.. కూతురిని లాక్కెళ్లి బెడ్రూమ్లో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే.. తల్లిని చంపేస్తానని బెదిరించాడు. అలా ఆరు నెలలపాటు సొంత కూతురిపైనే అతను పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆమె గర్భవతి అనే షాకింగ్ విషయం తేలింది. దీంతో కన్నతండ్రే ఆ పాపానికి ఒడిగట్టాడని వాపోయింది బాధితురాలు. వెంటనే వాలిక్కడవు పోలీసులను ఆశ్రయించిన ఆ తల్లి.. భర్తపై ఫిర్యాదు చేసి కటకటాల వెనక్కి నెట్టింది. వైద్య పరీక్షల్లో(డీఎన్ఏ అనలైసిస్) ఆ వ్యక్తే లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. ఆలస్యం జరగకుండా ఉండేందుకు.. ఫాస్ట్ ట్రాక్ ద్వారా కోర్టు ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందడం గమనార్హం. -
సల్మాన్ ఖాన్ సిగరెట్లతో కాల్చి వేధించేవాడు : హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌పై అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్,హీరోయిన్ సోమీ అలీ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. అతన్ని లైంగిక ఉన్మాదిగా అభివర్ణించిన సోమీ తనను సిగరెట్లతో కాల్చుతూ హింసించాడని ఆరోపించింది. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన సల్మాన్‌ఖాన్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు కానీ చాలామంది హీరోయిన్స్‌తో ఎఫైర్స్ నడిపాడు. వాటిలో సోమీ అలీ కూడా ఒకరు. పాకిస్తాన్లో పుట్టిన సోమీ అమెరికాలో స్థిరపడింది. 1993లో అవతార్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైంది. ఈ క్రమంలో సల్మాన్‌తో స్నేహం ప్రేమగా మారింది. అప్పట్లో వీరి రిలేషన్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉండేది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. కానీ కొన్నాళ్లకే సల్మాన్-సోనీ అలీ బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీని వదిలి అమెరికా వెళ్లిపోయింది. దీనికి సల్మానే కారణం అనూ రూమర్స్ కూడా వినిపించాయి. తాజాగా ఆమె సల్మాన్ తో డేటింగ్లో ఉన్నప్పటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 'సల్మాన్ ఒక ఉమెన్ బీటర్. పిరికిపంద, సిగరేట్‌తో కాల్చడం, శారీరక వేధింపులకు గురిచేయడం అతడి నైజం' అంటూ సోనీ అలీ తాజాగా తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చింది. తర్వాత కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. కానీ అంతలోనే సోమీ అలీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
బాబోయ్.. ఇదేం ర్యాగింగ్!
చెన్నై: తమిళనాడులోని ఓ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. సీనియర్లు ర్యాగింగ్ పేరిట జూనియర్లను శారీరకంగా వేధించారు. ఇందుకు సంబంధించిందిగా చెబుతున్న ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో సీనియర్లు దారుణానికి తెగ పడ్డారు. జూనియర్ స్టూడెంట్స్‌ను కేవలం అండర్ వేర్‌పై నిలబెట్టి.. క్యాంపస్‌లోనే దారుణమైన పనులు చేయించారు. అర్థనగ్నంగా క్యాంపస్ రోడ్లపై రౌండ్లు వేయించడంతో పాటు బురదలో బస్కీలు, పుషప్స్ తీయించడం, వాటర్ పైపులతో నీళ్లను చల్లడం లాంటివి చేశారు. చేతికి దొరికిన వస్తువులను వాళ్ల మీదకు విసిరేశారు. మరోవైపు జూనియర్లను అర్థనగ్నంగానే ఒకరినొకరు కౌగిలించుకోవమని చెప్పడం, ప్రైవేట్ పార్ట్‌లపై కొట్టడం లాంటివి చేశాడు ఓ సీనియర్. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. కేసు నమోదు అయ్యింది. సీఎంసీ వెల్లూరు యాజమాన్యం.. ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, ఓ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు సీనియర్లపై వేటు పడినట్లు తెలుస్తోంది. వెల్లూరు ఎస్పీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ర్యాగింగ్ వీడియో నిజమైందేనా? నకిలీదా? తేల్చే పనిలో ఉన్నట్లు తెలిపారు. Christian Medical College in Vellore has suspended seven senior medical students for ragging after videos of first-year MBBS students being beaten up, stripped & tortured went viral on social media.#TamilNadu #Vellore #CMC #CMCVellore #CMCRagging #MBBS #Ragging #ViralVideo pic.twitter.com/m5jkjMyUNf — Hate Detector 🔍 (@HateDetectors) November 9, 2022 ఇదీ చదవండి: కరగాట్టంలో ఇక అశ్లీలత ఉండకూడదు! -
రేప్ కేసు రద్దు.. మాజీ భర్తకు వెరైటీ శిక్ష
ఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో మాజీ భర్తపై కోర్టుకెక్కింది ఓ మహిళ. అయితే.. చివరికి ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చి కేసు వాపసు తీసుకునే యత్నం చేశారు. మరి తమ విలువైన సమయాన్ని వృథా చేస్తే న్యాయస్థానం ఊరుకుంటుందా? అందుకే విచిత్రమైన ఓ శిక్ష విధించింది. నోయిడా, మయూర్ విహార్‌లో బర్గర్ సింగ్, వాట్ ఏ బర్గర్ పేరుతో సదరు వ్యక్తికి రెండు బర్గర్ రెస్టారెంట్లు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో బాధితురాలితో విడిపోయి.. మరో వివాహం చేసుకున్నాడతను. అయితే.. వైవాహిక బంధంలో తన భర్త శారీరకంగా, మానసికంగా తనను హింసించాడంటూ 2020లో ఆమె కోర్టును ఆశ్రయించింది. రెండేళ్లపాటు కోర్టులో కేసు విచారణ కొనసాగగా.. జులై4వ తేదీన న్యూఢిల్లీ సాకేత్ కోర్టులో మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో ఆ మాజీ భార్య అతనిపై ఎఫ్ఐఆర్ రద్దుకు అంగీకారం తెలిపింది. అయితే.. ఈ పరిణామంపై జస్టిస్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, కోర్టుల విలువైన సమాయాన్ని వృథా చేశారు. ఈ వ్యవధిలో ఎన్నో కీలక అంశాలను చర్చించే వాళ్లం. కాబట్టి, పిటిషనర్ కచ్చితంగా సంఘానికి పనికొచ్చే ఏదైనా ఒక పని చేయాల్సిందే అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు.. అతనిపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటే అనాథలకు బర్గర్ అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెండు అనాథశ్రమాలను ఎంచుకుని వంద మంది దాకా అనాథలకు బర్గర్ అందించాలని ఆ వ్యక్తిని ఆదేశించింది కోర్టు. పైగా శుభ్రమైన వాతావరణంలో ఆ బర్గర్లు తయారు చేయాలని, పోలీసులు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. అంతేకాదు.. మాజీ భార్య సమయాన్ని సైతం వృధా చేసినందుకుగానూ రూ.4.5 లక్షలు పరిహారంగా చెల్లించాలని, అనాథలకు బర్గర్లు పంచే రోజునే అది చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. -
సహజీవనం చేసి.. రేప్ కేసులు పెడితే ఎలా?
న్యూఢిల్లీ: తమంతట తాముగా ఇష్టపూర్వక సహజీవనం చేసి.. అవి బెడిసి కొట్టడం, విభేధాల కారణంగా అత్యాచారం ఫిర్యాదులు చేయడం సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఓ కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ద్విసభ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి.. తనంతట తానే ఇష్టపూర్వకంగా అవతలి వ్యక్తితో సహజీవనం చేసింది. పైగా 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె అతనితో బంధంలోకి అడుగు పెట్టింది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు లైంగికంగా లోబర్చుకున్నాడని, దాడికి పాల్పడ్డాడని చెబుతోంది. ఇష్టపూర్వకంగానే ఆమె అతనితో బంధం కొనసాగించినట్లు ఒప్పుకుంది. కాబట్టి.. అత్యాచారం కింద ఐపీసీ 376(2)(n) ప్రకారం అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కారణం కాదు అని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దేశంలో ఇలాంటి కేసులు చాలానే న్యాయస్థానాల ముందుకు వస్తున్నాయి. పూర్తి ఇష్టంతోనే పరస్పర అంగీకారంతోనే వాళ్లు కలిసి ఉంటున్నారు. వివాహంతో సంబంధం లేకుండా పిల్లల్ని కంటున్నారు. తీరా గొడవలు జరిగితే చాలూ.. ఇలా అత్యాచారం, లైంగిక దాడులంటూ న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. సరైన పద్ధతి కాదు అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చుతూ.. నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. బెయిల్ మంజూరు అయినప్పటికీ దర్యాప్తు మాత్రం యథాతథంగా కొనసాగాలని సుప్రీం బెంచ్, రాజస్థాన్ పోలీసులకు సూచించింది. -
ఘోరం: చెట్టుకు మైనర్ల ఉరి.. హత్యాచారం!
గువాహటి: అస్సాంలో ఘోరం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్లు చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే వాళ్లను అత్యాచారం చేసి ఆపై చంపేశారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అక్కడి మీడియాలో ఎక్కువ ఫోకస్ కావడంతో ఆదివారం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. కోక్రాజ్హర్ జిల్లా అభయకుటి గ్రామం శివారులోని అడవుల్లో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. వరుసకు చుట్టాలయ్యే ఆ ఇద్దరు అమ్మాయిలు.. ఒకరి వయసు 16, మరొకరి వయసు 14. ఇద్దరూ పొలం పనులకు వెళ్లారని, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆ ఇద్దరూ కనిపించకుండా పోయారని బంధవులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య కోణంలోనూ దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించి.. నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. బాధితుల్లో ఒకరు అనాథ కాగా, మరొక తల్లి రోదనలతో అభయకుటిలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ ఘటనలో అనుమానం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు కోక్రాజ్హర్ పోలీసులు చెప్తున్నారు. చదవండి: శారీరక సుఖం కోసం పోయి.. -
సవతి కూతురి పట్ల ఇంత దారుణమా?
ఏడాదిన్నపాటు వేధించిన సవతి తల్లికి 25 ఏళ్ల జైలుశిక్ష వాషింగ్టన్: సవతి కూతురి పట్ల ఏమాత్రం కనికరం చూపకుండా అమానుషంగా హింసించిందో ఓ మహాతల్లి. అభంశుభం తెలియని 12 ఏళ్ల బాలికకు ఏడాదిన్నరపాటు అన్నం, నీళ్లు ఇవ్వకుండా ఆకలితో మాడ్చివేసింది. అంతేకాకుండా చిన్నారిని చితకబాది.. ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. ఆమె ప్రాణాలు ప్రమాదంలో పడేలా చేసింది. భారత సంసతికి చెందిన ఆ సవతి తల్లి పాపం పండింది. అమెరికా కోర్టు ఆమెకు ఏకంగా 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తన సవతి కూతురు మాయా రతన్‌ను తీవ్రంగా చిత్రవధ చేసిన కేసులో షీతల్ రాతన్ను అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. 2014లో షీతల్ చిన్నారి మణికట్టును దారుణంగా కట్‌చేసి.. చిత్రహింసలు పెట్టిందని, దీనివల్ల ఆస్పత్రి పాలైన చిన్నారి దేహంపై ఇప్పటికీ సవతి తల్లి కొట్టిన దెబ్బల గుర్తులు అలాగే ఉన్నాయని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ బ్రౌన్ పేర్కొన్నారు. అమానుషమైన చిత్రహింసలతో చిన్నారి మాయ ప్రాణాలను సవతి తల్లి ప్రమాదంలో పడేసిందని, ఎవ్వరూ కూడా చిన్నారుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించకూడదని, ఏ చిన్నారికి ఇలాంటి అవస్థ రాకూడని జడ్జి తీర్పు వెలువరిస్తూ పేర్కొన్నారు.