
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌పై అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్,హీరోయిన్ సోమీ అలీ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. అతన్ని లైంగిక ఉన్మాదిగా అభివర్ణించిన సోమీ తనను సిగరెట్లతో కాల్చుతూ హింసించాడని ఆరోపించింది. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన సల్మాన్‌ఖాన్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు కానీ చాలామంది హీరోయిన్స్‌తో ఎఫైర్స్ నడిపాడు. వాటిలో సోమీ అలీ కూడా ఒకరు.
పాకిస్తాన్‌లో పుట్టిన సోమీ అమెరికాలో స్థిరపడింది. 1993లో అవతార్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైంది. ఈ క్రమంలో సల్మాన్‌తో స్నేహం ప్రేమగా మారింది. అప్పట్లో వీరి రిలేషన్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉండేది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. కానీ కొన్నాళ్లకే సల్మాన్-సోనీ అలీ బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీని వదిలి అమెరికా వెళ్లిపోయింది. దీనికి సల్మానే కారణం అనూ రూమర్స్ కూడా వినిపించాయి.
తాజాగా ఆమె సల్మాన్ తో డేటింగ్‌లో ఉన్నప్పటి చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 'సల్మాన్ ఒక ఉమెన్ బీటర్. పిరికిపంద, సిగరేట్‌తో కాల్చడం, శారీరక వేధింపులకు గురిచేయడం అతడి నైజం' అంటూ సోనీ అలీ తాజాగా తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చింది. తర్వాత కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. కానీ అంతలోనే సోమీ అలీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment