
గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే..
ఢిల్లీ: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణ వేధింపుల పర్వంపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పందించారు. వావీ వరసలు లేకుండా సొంత కుటుంబసభ్యులనే కాదు.. ప్రజల్ని, చివరికి తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్నమైనర్ బాలికలను కూడా ఇలానే వేధిస్తున్నారని ట్విటర్ వేదికగా నారాయణపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు...నారాయణ! నారాయణ! నారాయణ! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
వావీ వరసలు లేకుండా సొంత కుటుంబసభ్యులనే కాదు ప్రజల్ని, చివరికి తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్నమైనర్ బాలికలను కూడా ఇలానే వేధిస్తున్నారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు...నారాయణ!…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 29, 2023
పెద్ద మనిషి ముసుగులో పొంగూరు నారాయణ చేస్తున్న తేడా పనుల్ని ఆయన మరదలు ప్రియా వీడియో సాక్షిగా బయటపెట్టిన సంగతి తెలిసిందే. నారాయణ తనను తీవ్రంగా హింసిస్తున్నారని, అర్ధరాత్రి పూట టార్చర్ పెడుతున్నారంటూ ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ప్రియా కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో భార్య ఉండగానే తాను అన్నం తీసుకురాలేదని నారాయణ కొట్టారని.. తనను టార్చర్ చేసేవారని ఆమె ఆరోపించారు.
గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన ప్రియా.. తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి: ‘డేగ.. ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్లు..’ నారాయణ మరదలి ఆవేదన