సిమెంట్ రంగ దిగ్గజం అంబుజా సిమెంట్ ఫలితాలు ఎనలిస్టులను నిరాశపర్చాయి. నికర లాభాలు పెరిగినా అమ్మకాలు క్షీణించాయి. ఈ ఆర్థికసంవత్సరం మూడవ త్రైమాసికంలో స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభాలు నికర లాభం 79 శాతం వృద్ది చెంది రూ. 277 కోట్లను సాధించింది. జూలై-సెప్టెంబర్ క్యూ3 లో అమ్మకాలు 4 శాతం క్షీణించడంతో ఆదాయం రూ. 2031 కోట్లగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో 2,112 కోట్ల ఆదాయాన్ని సాధించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 2 శాతం తగ్గి రూ. 303 కోట్లకు పరిమితంకాగా, ఇబిటా మార్జిన్లు 14.7 శాతం నుంచి 14.9 శాతానికి స్వల్పంగా పెరిగింది. ఇతర ఆదాయం రూ. 74 కోట్ల నుంచి రూ. 223 కోట్లకు ఎగసింది. సిమెంట్ ఇబిటా టన్నుకి రూ. 616 నుంచి రూ. 620కు పెరిగినట్లు కంపెనీ తెలియజేసింది. సిమెంట్ అమ్మకాల పరిమాణం 6.6 శాతం క్షీణతతో 4.5 మిలియన్ టన్నులకు పరిమితమైనట్లు వివరించింది. దీంతో అంబుజా సిమెంట్ షేరు 1.75 శాతం ఎగిసినా చివరికి స్వల్ప నష్టాలతో ముగిసింది.
కాగా 2.8 శాతం వాల్యూమ్స్ పెరిగినా భారీ వర్షాలకారణంగా సిమెంటు అమ్మకాలు 6.6 శాతం తగ్గి 4.5 మిలియన్ టన్నులుగా నమోదైనట్టు అంబుజా సిమెంట్స్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది.మంచి వర్షపాతం కారణంగా ఆదాయం పెరిగే అవకాశం ఉందని కంపెనీ ప్రకటించింది. హౌసింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంపై ప్రభుత్వం దృష్టి తమకుసానుకూలంగా మారుతుందని చెప్పింది.
నిరాశపర్చిన అంబుజా సిమెంట్స్
Published Thu, Nov 3 2016 4:17 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM
Advertisement
Advertisement