Ambuja Cements
-
రేవంత్.. నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ముందా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా రామన్నపేటలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు.రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం నేడు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్యనల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్. , మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, లను హౌజ్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్యలు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం నియంతృత్వం కాక మరేంటి?. వీరితో పాటు ప్రజాసంఘాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలను ముందస్తు అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం రేవంత్ సర్కారు అణచివేత విధానాలకు నిదర్శనం.ఇంతటి నిర్బంధ పరిస్థితులను సృష్టించి నిర్వహించే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు విలువ ఉండదు. ఇదీ ముమ్మాటికీ అదానీ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ సాగిస్తున్న అరాచక పర్వం. అక్రమంగా నిర్బంధించిన బీఆర్ఎస్ నాయకులతోపాటు ప్రజాసంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అప్పుడే గుండె పగిలిన రైతుల ఆవేదన, చుట్టుపక్కల ప్రజల ఆక్రందన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. నియంతృత్వ విధానాలతో ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే మరణశాసనం రాస్తారు. జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్యనల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర…— KTR (@KTRBRS) October 23, 2024 -
మరో సిమెంట్ కంపెనీపై అదానీ కన్ను!
న్యూఢిల్లీ: హైడెల్బర్గ్ సిమెంట్ ఇండియాపై అదానీ గ్రూప్ కన్నేసింది. జర్మన్ దిగ్గజం హైడెల్బర్గ్ మెటీరియల్స్ దేశీ అనుబంధ సంస్థ హైడెల్బర్గ్ సిమెంట్ కొనుగోలుకు అదానీ గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో హైడెల్బర్గ్ సిమెంట్ ఇండియా షేరు తొలుత ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 18 శాతం దూసుకెళ్లింది. రూ.258 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. చివరికి 4 శాతం లాభంతో రూ.227 వద్ద ముగిసింది.చర్చలు సఫలమైతే హైడెల్బర్గ్ ఇండియాను బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ దిగ్గజం అంబుజా సిమెంట్స్ సొంతం చేసుకునే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,000 కోట్లు) విలువలో డీల్ కుదరవచ్చని అంచనా వేశాయి. అయితే అంబుజా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ.591 వద్ద ముగిసింది.ఇదీ చదవండి: పేరుకుపోతున్న వాహన నిల్వలు2006లోనే భారత్‌లోకి..హైడెల్బర్గ్ సిమెంట్ ఏజీ 2006లో భారత్‌లోకి ప్రవేశించింది. మైసూర్ సిమెంట్, కొచ్చిన్ సిమెంట్, ఇండోరమా సిమెంట్‌తో ఏర్పాటైన జాయింట్ వెంటర్లను కొనుగోలు చేయడం ద్వారా కార్యకలాపాలు ప్రారంభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ, విస్తరణల తర్వాత 5.5 మిలియన్ టన్నులకు స్థాపిత సిమెంట్ సామర్థ్యాన్ని చేర్చుకుంది. 2016లో ఐటల్ సిమెంట్ కొనుగోలుతో కార్యకలాపాలు రెట్టింపునకు పెంచుకుంది. ప్రస్తుతం నాలుగు సమీకృత సిమెంట్ తయారీ, గ్రైండింగ్ యూనిట్లను కలిగి ఉంది. దాంతో స్థాపిత సామర్థ్యం 14 మిలియన్ టన్నులకు ఎగసింది. మైసెమ్, జువారీ బ్రాండ్లతో 12 రాష్ట్రాల్లో విస్తరించింది. అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత చాలా కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే హైడెల్బర్గ్ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నారనేలా వార్తలు వస్తున్నాయి. -
‘తెలుగురాష్ట్రాలకు చెందిన సంస్థ అప్పు మేమే తీరుస్తాం’
తెలుగురాష్ట్రాలకు చెందిన పెన్నా సిమెంట్‌కు ఉన్న రూ.3,000 కోట్ల అప్పును తామే తీరుస్తామని అదానీ గ్రూపు ఆధ్వర్యంలోని అంబుజా సిమెంట్స్ తెలిపింది. ఇటీవల పెన్నా సిమెంట్‌ను రూ.10,422 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు అంబుజా ప్రకటించింది. దాంతో కంపెనీ ఇతర సంస్థలకు బకాయిపడిన రుణాలను సైతం తీరుస్తామని అంబుజా సిమెంట్స్ హామీ ఇచ్చింది.పెన్నా సిమెంట్స్‌లోని 100 శాతం వాటాను అదానీ గ్రూప్‌లో భాగంగా ఉన్న అంబుజా సిమెంట్స్ రూ.10,422 కోట్లుకు కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. మరో 3-4 నెలల్లో ఈ డీల్ పూర్తవుతుందని, ఆ తర్వాత పెన్నాకు ఉన్న రుణాన్ని చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంబుజా వద్ద ఇప్పటికే రూ.15,676 కోట్ల మిగులు నిల్వలున్నాయి. పెన్నా అప్పులను ఈ మిగులు నుంచి చెల్లించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పెన్నా రుణంపై వడ్డీ వ్యయాలను తగ్గించడంతో పాటు, క్రెడిట్ రేటింగ్‌ను ‘బీబీబీ’ నుంచి ‘ఏఏఏ’గా మార్చేందుకు ఇది సహాయపడుతుందని అంబుజా అంచనావేస్తుంది.సిమెంట్‌తో పాటు క్లింకర్, గ్రైండింగ్, ప్యాకేజింగ్, విద్యుత్ రంగాల్లో అదానీ గ్రూప్ విస్తరించింది. ప్రస్తుతం పెన్నా సిమెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌లో ఉన్న అయిదు సిమెంట్ యూనిట్లతో కలిపి ఏడాదికి 14 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెన్నా సిమెంట్ కొనుగోలుతో అదానీ గ్రూపు దేశవ్యాప్త సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరింది.ఇదీ చదవండి: టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!ఈ ఒప్పందం ద్వారా దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం రెండు శాతంగా ఉన్న మార్కెట్ వాటా 8 శాతానికి చేరుకుంటుందని, ఇదే సమయంలో శ్రీలంకలో పెన్నా సిమెంట్‌కు ఉన్న స్థానిక అనుబంధ కంపెనీ ద్వారా ఆ దేశంలో కూడా అడుగు పెట్టే అవకాశం కలుగుతుందని అదానీ గ్రూపు ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
అంబుజా చేతికి పెన్నా సిమెంట్
సాక్షి, అమరావతి/హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన పెన్నా సిమెంటును అంబుజా సిమెంట్ కొనుగోలు చేసింది. అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్, పి. ప్రతాప్ రెడ్డి కుటుంబానికి చెందిన పెన్నా సిమెంట్ 100 శాతం వాటాను రూ.10,422 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియచేసింది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. సిమెంట్‌తో పాటు క్లింకర్, గ్రైండింగ్, ప్యాకేజింగ్, విద్యుత్ రంగాల్లో విస్తరించింది. ప్రస్తుతం పెన్నా సిమెంట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌లో ఉన్న అయిదు సిమెంట్ యూనిట్లతో కలిపి ఏడాదికి 14 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెన్నా సిమెంట్ కొనుగోలుతో అదానీ గ్రూపు దేశవ్యాప్త సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరింది. ఈ ఒప్పందం ద్వారా దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం రెండు శాతంగా ఉన్న మార్కెట్ వాటా 8 శాతానికి చేరుకుంటుందని, ఇదే సమయంలో శ్రీలంకలో పెన్నా సిమెంట్‌కు ఉన్న స్థానిక అనుబంధ కంపెనీ ద్వారా ఆ దేశంలో కూడా అడుగు పెట్టే అవకాశం కలుగుతుందని అదానీ గ్రూపు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ అనుమతులు అన్నీ పూర్తి చేసుకొని మూడు నుంచి 4 నెలల్లో ఈ అక్విజిషన్ ప్రక్రియ పూర్తవుతుందని అంబుజా సిమెంట్ సీఈవో అజయ్ కపూర్ తెలిపారు. అలాగే పెన్నా సిమెంట్‌కు ఉన్న సున్నపురాయి గనులు కూడా అదానీ గ్రూపునకు కలిసి వస్తాయన్నారు.తాడిపత్రితో ప్రారంభంపి.ప్రతాప్ రెడ్డి కుటుంబం 1994లో అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద తలారి చెరువులో ఏడాదికి 0.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో తొలి సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేసి వేగంగా విస్తరించింది. ప్రస్తుతం తాడిపత్రి యూనిట్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 1.8 మిలియన్ టన్నులకు చేరడమే కాకుండా అక్కడ 1.3 మిలియన్ టన్నుల క్లింకర్ యూనిట్‌నుకూడా ఏర్పాటు చేశారు. అదే జిల్లా బోయరెడ్డి పల్లి వద్ద మరో రెండు మిలియన్ టన్నుల సిమెంట్, 4 మిలియన్ టన్నుల క్లింకర్, 25 మెగావాట్ల వేస్ట్ హీట్ రికవరీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తాండూరు వద్ద రెండు మిలియన్ టన్నుల సిమెంట్ ప్లాంటు, 1.5 మిలియన్ టన్నుల క్లింకర్, నల్గొండ జిల్లా గణే‹Ùపహడ్ వద్ద 1.2 ఎంటీ సిమెంట్, 1 ఎంటీ క్లింకర్, 7 డబ్ల్యూహెచ్ వేస్ట్ హీట్ రికవరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాజస్థాన్‌లో జోథ్‌పూర్‌లో నిర్మిస్తున్న 2 ఎంటీ, కృష్ణపట్నం వద్ద నిర్మిస్తున్న మరో 2 ఎంటీ యూనిట్లు మరో ఆరు నుంచి ఏడాదిలోగా అందుబాటులోకి రానున్నాయి. నల్గొండ జిల్లా గణేష్ పçహాడ్ వద్ద 77 మెగావాట్ల విద్యుత్ యూనిట్‌ను పెన్నా సిమెంట్ కలిగి ఉంది. ఈ ఒప్పందంతో కోల్‌కతా, గోపాల్పూర్, కరైకల్, కొచ్చి, కొలంబోలోని బల్క్ సిమెంట్ టెరి్మనల్స్ ద్వారా అదానీ సీ ట్రాన్స్‌పోర్టేషన్ లాజిస్టిక్ సామర్థ్యం పెరుగుతుందని కపూర్ చెప్పారు. -
అదానీ గ్రూప్ చేతికి సంఘీ ఇండస్ట్రీస్
న్యూఢిల్లీ: సంఘీ ఇండస్ట్రీస్ (ఎస్ఐఎల్) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అదానీ గ్రూప్‌లో భాగమైన అంబుజా సిమెంట్స్ (ఏసీఎల్) వెల్లడించింది. షేరు ఒక్కింటికి రూ. 121.90 చొప్పున సవరించిన ధర మేరకు కొనుగోలు చేసినట్లు వివరించింది. గతంలో ఎస్ఐఎల్లో పబ్లిక్ షేర్హోల్డర్లకు ఉన్న 26 శాతం వాటాల కోసం కంపెనీ రూ. 114.22 రేటును ఆఫర్ చేసింది. ఎస్ఐఎల్ విలువను రూ. 5,185 కోట్లుగా లెక్కగట్టి దక్కించుకున్నట్లు ఏసీఎల్ తెలిపింది. సంఘీ ఇండస్ట్రీస్‌లో తమకు నియంత్రణాధికారాలతో 54.51 శాతం వాటాలు లభించినట్లు వివరించింది. దేశీ సిమెంటు పరిశ్రమలో తమ స్థానాన్ని పటిష్టపర్చుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపార విభాగం సీఈవో అజయ్ కపూర్ తెలిపారు. 74.6 ఎంటీపీఏకి ఉత్పత్తి సామర్థ్యాలు ఎస్‌ఐఎల్‌కు గుజరాత్‌లోని సంఘీపురంలో 2,700 హెక్టార్లలో క్లింకర్, సిమెంటు సమగ్ర తయారీ యూనిట్ ఉంది. ఇందులో 6.6 ఎంటీపీఏ క్లింకర్ ఉత్పత్తికి రెండు బట్టీలు, 6.1 ఎంటీపీఏ సిమెంటు గ్రైండింగ్ యూనిట్, 13 మెగావాట్ల క్యాప్టివ్ విద్యుదుత్పత్తి ప్లాంటు మొదలైనవి ఇందులో ఉన్నాయి. ఈ కొనుగోలుతో ఏసీఎల్ ఉత్పత్తి సామర్థ్యం వార్షికంగా 68.5 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ) నుంచి 74.6 ఎంటీపీఏకి చేరుతుందని పేర్కొంది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ తదితర పశ్చిమ తీర ప్రాంత మార్కెట్లలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే 30 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యాలను అదనంగా పెంచుకోనున్నట్లు వివరించింది. -
ఓరియంట్ సిమెంట్‌ను కొనబోతున్న అదానీ!
సిమెంటు రంగంలో అగ్రగామి సంస్థగా ఎదిగేందుకు అదానీ గ్రూప్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల పలు కంపెనీలను సొంతం చేసుకుంది. అదే జోరులో..ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఓరియంట్ సిమెంట్ ప్రమోటరు సి.కె.బిర్లా కంపెనీలో తన వాటా అమ్మేందుకు అదానీ గ్రూపు ఛైర్మన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అంబుజా, సంఘీ, ఏసీసీ వంటి ప్రధాన సిమెంటు కంపెనీలను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైతే అదానీ గ్రూపునకు ప్రయోజనం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఏసీసీ కార్యకలాపాలకు ఓరియంట్ సిమెంట్ ప్లాంట్లు ఉపయోగపడతాయని అంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్స్ లిమిటెడ్ స్టాక్ కొన్ని రోజులుగా పాజిటివ్‌లో ట్రేడవుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకు చాలా సిమెంట్ అవసరం అవుతుంది. రోడ్లు, రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు, ఇళ్లను వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. కానీ సిమెంట్ తలసరి వినియోగం చైనాలో 1,600 కిలోగ్రాములు, భారత్ 250 కిలోగ్రాములుగా ఉంది. -
అంబుజా చేతికి సంఘీ సిమెంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అంబుజా సిమెంట్స్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన సంఘీ ఇండస్ట్రీస్‌లో 56.74 శాతం వాటా కొనుగోలు చేసింది. సంఘీ ప్రమోటర్లు అయిన రవి సంఘీ, కుటుంబం నుంచి ఈ వాటా దక్కించుకుంది. ఇందుకోసం అంబుజా సిమెంట్స్ రూ.1,674 కోట్లు వెచి్చస్తోంది. మరో 26 శాతం వాటా కోసం అంబుజా సిమెంట్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. 6.71 కోట్ల ఈక్విటీ షేర్లకుగాను 13.8 శాతం ప్రీమియంతో ఒక్కొక్కటి రూ.114.22 చొప్పున రూ.767 కోట్లను ఖర్చు చేయనుంది. ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయితే సంఘీ ఇండస్ట్రీస్‌లో అంబుజా సిమెంట్స్‌కు 82.74 శాతం వాటా దక్కుతుంది. ఈ డీల్‌లో భాగంగా సంఘీ ఇండస్ట్రీస్‌ను రూ.5,000 కోట్లుగా విలువ కట్టారు. 3–4 నెలల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. సంఘీ ఇండస్ట్రీస్ కొనుగోలుతో అంబుజా సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7.36 కోట్ల టన్నులకు చేరనుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపు.. సంఘీ సిమెంట్స్‌కు గుజరాత్‌లోని కచ్ వద్ద ఉన్న సంఘీపురంలో 61 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక తయారీ సామర్థ్యం గల సిమెంట్ ప్లాంటుతోపాటు 66 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో క్లింకర్ ప్లాంట్ ఉంది. ‘సంఘీ ఇండస్ట్రీస్‌తో చేతులు కలపడం ద్వారా అంబుజా తన మార్కెట్ ఉనికిని విస్తరించడానికి, ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి.. నిర్మాణ సామగ్రి రంగంలో అగ్రగామిగా తన స్థానాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. సంఘీ ఇండస్ట్రీస్‌కు ఉన్న 100 కోట్ల టన్నుల సున్నపురాయి నిల్వలతో అంబుజా సిమెంట్స్ వచ్చే రెండేళ్లలో సంఘీపురంలో సిమెంట్ సామర్థ్యాన్ని 1.5 కోట్ల టన్నులకు చేర్చనుంది. అదానీ గ్రూప్ 2028 నాటికి 14 కోట్ల మెట్రిక్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉంది’ అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ సందర్భంగా తెలిపారు. పెద్ద నౌకలకు వీలుగా.. 8,000 డెడ్ వెయిట్ టన్నేజ్ సామర్థ్యం గల పెద్ద నౌకలు వచ్చేందుకు వీలుగా అక్కడే ఉన్న పోర్టును విస్తరించడానికి పెట్టుబడి చేయనున్నట్టు అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్ సీఈవో కరణ్ అదానీ వెల్లడించారు. దేశంలో అతి తక్కువ ఖర్చుతో క్లింకర్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటుగా సంఘీ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని చెప్పారు. గురువారం అంబుజా షేరు ధర 2.87% పెరిగి రూ.474.20 వద్ద, సంఘీ ఇండస్ట్రీస్ షేరు ధర 4.99% ఎగసి రూ.105.76 వద్ద స్థిరపడింది. -
అదానీ షేర్ల తనఖా రుణాల చెల్లింపు
న్యూఢిల్లీ: షేర్ల తనఖా ద్వారా తీసుకున్న 215 కోట్ల డాలర్ల(రూ. 17,630 కోట్లు) రుణాలను తిరిగి చెల్లించినట్లు ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. ఈ నెలాఖరుకు గడువు ఉన్నప్పటికీ ముందుగానే చెల్లించినట్లు తెలియజేసింది. ఈ బాటలో సంస్థ ఇప్పటికే 90.2 కోట్ల డాలర్లు(రూ. 7,374 కోట్లు) చెల్లించింది. వెరసి మొత్తం రూ. 17,630 కోట్ల రుణాలను క్లియర్ చేసినట్లు అదానీ గ్రూప్ వివరించింది. అంతేకాకుండా అంబుజా సిమెంట్ కొనుగోలుకి తీసుకున్న మరో 50 కోట్ల డాలర్ల(రూ. 4,100 కోట్లు) రుణాలను సైతం చెల్లించినట్లు వెల్లడించింది. ఇటీవలే గ్రూప్‌లోని నాలుగు లిస్టెడ్ కంపెనీలలో స్వల్ప వాటాల విక్రయం ద్వారా రూ. 15,446 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. జీక్యూజీ పార్ట్నర్స్ ఈ వాటాలను కొనుగోలు చేసింది. షేర్ల తీరిలా అదానీ గ్రూప్ షేర్లు సోమవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఎన్డీటీవీ, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, అదానీ విల్మర్, పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ఎంటర్ప్రైజెస్ 5–1 శాతం క్షీణించాయి. అయితే అదానీ పవర్, ట్రాన్స్మిషన్, గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం చొప్పున జంప్ చేశాయి. -
అంబుజాలో అదానీ 4.5 శాతం వాటాల విక్రయం
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకోవడంపై అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా అంబుజా సిమెంట్స్‌లో 4.5 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు 450 మిలియన్ డాలర్లుగా (దా దాపు రూ.3,380) ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఆర్థిక సంస్థలను కూడా సంప్రదించినట్లు పేర్కొన్నాయి. గతేడాది కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్‌లో అదానీకి 63 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం అదానీ గ్రూప్ రుణ భారం దాదాపు 24 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో గ్రూప్ కంపెనీల షేర్లు ఇటీవల భారీగా పతనమైన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ కొన్ని క్రమంగా కోలుకుంటున్నాయి. -
అంబుజా సిమెంట్ కొనుగోలు, అదానీకి భారీ షాక్!
న్యూఢిల్లీ: సంస్థాగత ఇన్వెస్టర్ల సలహా సంస్థ ఐఐఏఎస్ తాజాగా అదానీ కుటుంబం చేపట్టిన పెట్టుబడుల సమీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు చేయవలసిందిగా అంబుజా సిమెంట్స్ వాటాదారులకు సూచించింది. వారంట్ల జారీ ద్వారా రూ. 20,000 కోట్ల సమీకరణకు అంబుజా సిమెంట్స్ సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా స్వతంత్ర డైరెక్టర్లుగా అమీత్ దేశాయ్, పుర్వీ షేథ్ ఎంపికను సైతం వ్యతిరేకించవలసిందిగా ఐఐఏఎస్ సిఫారసు చేసింది. ఏసీసీలో 50.05 శాతం వాటాను కలిగి ఉన్న అంబుజా సిమెంట్స్ శనివారం(8న) అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహిస్తోంది. మొత్తం 12 ప్రతిపాదనలపై వాటాదారుల అనుమతిని కోరనుంది. వీటిలో ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా 47.74 కోట్ల వారంట్ల జారీ ప్రతిపాదన సైతం ఉంది. షేరుకి దాదాపు రూ. 419 ధరలో అదానీ గ్రూప్ సంస్థ హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు వారంట్ల కేటాయింపు ద్వారా రూ. 20,001 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. బోర్డులో గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, కుమారుడు కరణ్ అదానీసహా ఇద్దరు డైరెక్టర్లు, మరో నలుగురు స్వతంత్ర డైరెక్టర్ల ఎంపికకు అనుమతులను కోరనుంది. కారణాలివీ.. అదానీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఐఐఏఎస్ ఇందుకు పలు కారణాలను పేర్కొంది. వారంట్లను మార్పిడి చేశాక ఈక్విటీ 19.4 శాతంమేర విస్తరించనుంది. ఇది అత్యధికంకాగా.. ప్రమోటర్ల వాటా ప్రస్తుత 63.1 శాతం నుంచి 70.3 శాతానికి పెరగనుంది. అంతేకాకుండా వారంట్ల ఇష్యూ ధర ప్రస్తుత రూ. 500తో పోలిస్తే 16 శాతంపైగా తక్కువ(డిస్కౌంట్). హోల్సిమ్ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన ధర కంటే 8.8 శాతం ప్రీమియం. అంబుజా సిమెంట్స్ ఇప్పటికే రూ. 3,840 కోట్ల నగదు, తత్సమాన నిల్వలు కలిగి ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే ఇవి రూ. 8,500 కోట్లు. ఎన్ఎస్ఈలో అంబుజా సిమెంట్స్ షేరు 3.7 శాతం జంప్‌చేసి రూ. 526 వద్ద ముగిసింది. చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా -
అంబుజా, ఏసీసీ వాటాను తనఖాలో ఉంచిన అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ ఇటీవల సొంతం చేసుకున్న అంబుజా సిమెంట్స్, ఏసీసీలలో వాటాను తనఖాలో ఉంచింది. మొత్తం 13 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 1,04,000 కోట్లు) విలువైన వాటాను తనఖా పెట్టింది. డాయిష్ బ్యాంక్ ఏజీ హాంకాంగ్ బ్రాంచీ వద్ద అంబుజా సిమెంట్స్‌లో 63.15 శాతం వాటాతోపాటు.. ఏసీసీలోని 56.7 శాతం వాటా(అంబుజా ద్వారా 50 శాతం వాటా)ను కుదువ పెట్టినట్లు అదానీ గ్రూప్ తాజాగా వెల్లడించింది. కొద్ది రోజులక్రితమే ఈ వాటాలను 6.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజా చర్య కొంతమంది రుణదాతలు, ఫైనాన్స్ భాగస్వాములకు లబ్ది చేకూర్చగలదని అదానీ గ్రూప్ ఈ సందర్భంగా పేర్కొంది. రానున్న ఐదేళ్లలో సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని రెట్టింపునకు పెంచుకునే ప్రణాళికలు వెల్లడించిన నేపథ్యంలో తాజా చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. వార్షిక సిమెంట్ సామర్థ్యాన్ని 14 కోట్ల టన్నులకు చేర్చే ప్రణాళికల్లో ఉన్నట్లు గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ రెండు రోజులక్రితం వాటాదారులకు వెల్లడించారు. తద్వారా దేశీయంగా అత్యంత లాభదాయక కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు తెలియజేశారు. అత్యుత్తమ ఆర్థిక పురోగతి, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వ కట్టుబాటు వంటి అంశాలు సిమెంటుకు భారీ డిమాండును సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో మార్జిన్లు అత్యధి క స్థాయిలో మెరుగుపడనున్నట్లు అంచనా వేశారు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో అంబుజా సిమెంట్స్ షేరు 6 శాతం పతనమై రూ. 539 వద్ద ముగిసింది. ఏసీసీ సైతం 7 శాతం తిరోగమించి రూ. 2,535 వద్ద స్థిరపడింది. చదవండి: పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్ జెట్.. 3 నెలల పాటు -
అదానీ కీలక నిర్ణయం: కరణ్ అదానీ చేతికి ఏసీసీ పగ్గాలు
న్యూఢిల్లీ: స్విస్ సిమెంట్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన ఇండియా బిజినెస్‌ల కొనుగోలును పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. తద్వారా ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ గ్రూప్ దేశీయంగా రెండో అతిపెద్ద సిమెంట్ దిగ్గజంగా ఆవిర్భవించింది. కాగా అదానీ పెద్దకుమారుడు కరణ్‌కు ఏసీసీ బాధ్యతలు అప్పగించినట్లు గ్రూప్ తాజాగా పేర్కొంది. 6.5 బిలియన్ డాలర్లకు హోల్సిమ్ నుంచి సొంతం చేసుకున్న తదుపరి ఏసీసీ, అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్లను పూర్తి చేసినట్లు తెలిపింది. అదానీ గ్రూప్ టేకోవర్ పూర్తయిన వెంటనే రెండు కంపెనీల బోర్డు డైరెక్టర్లు రాజీనామాలు చేసినట్లు వెల్లడించింది. (Gautam Adani: దూకుడు మామూలుగా లేదుగా! ఏకంగా బెజోస్‌కే ఎసరు) గౌతమ్ అదానీ అధ్యక్షతన గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ అంబుజా సిమెంట్స్‌కు అధ్యక్షత వహించ నున్నారు. ప్రస్తుతం పోర్టు బిజినెస్‌లు చూస్తున్న కరణ్ అదానీ ఏసీసీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అంబుజా బోర్డులో, ఇంధన దిగ్గజం షెల్ ఇండియా మాజీ హెడ్ నితిన్ శుక్లా ఏసీసీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంబుజా సీఈవోగా అజయ్ కుమార్, ఏసీసీ సీఈవోగా శ్రీధర్ బాలకృష్ణన్ వ్యవహరించనున్నారు. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ఇదీ చదవండి: Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్ కమింగ్ సూన్ -
అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లకు స్పందన అంతంతే
న్యూఢిల్లీ: సిమెంట్ రంగ దిగ్గజాలు ఏసీసీ, అంబుజా వాటాదారులకు అదానీ గ్రూప్ ప్రకటించిన ఓపెన్ ఆఫర్లలో నామమాత్ర స్పందనే కనిపించింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ బిజినెస్ కొనుగోలులో భాగంగా అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లను చేపట్టింది. పబ్లిక్ నుంచి 26 శాతం అదనపు వాటా కొనుగోలుకి ప్రకటించిన ఓపెన్ ఆఫర్లు వారాంతాన(9న) ముగిశాయి. సిమెంట్ దిగ్గజాలు వెల్లడించిన వివరా ల ప్రకారం 4.89 కోట్ల షేర్లకుగాను ఏసీసీ వాటాదారుల నుంచి 40.51 లక్షల షేర్లు మాత్రమే లభించాయి. ఇక అంబుజా సిమెంట్స్ విషయంలో మరింత తీసికట్టుగా కేవలం 6.97 లక్షల షేర్లు టెండర్ అయ్యాయి. కంపెనీ 51.63 కోట్ల షేర్ల కోసం ఆఫర్ ఇచ్చింది. రెండు కంపెనీల ఓపెన్ ఆఫర్లు ఆగస్ట్ 26న ప్రారంభమయ్యాయి. ఏసీసీ షేరుకి రూ. 2,300, అంబుజాకు రూ. 385 చొప్పున అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. హోల్సిమ్ దేశీ సిమెంట్ బిజినెస్‌ను సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ 10.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 84,000 కోట్లు)డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఓపెన్ ఆఫర్లు విజయవంతమైతే రూ.31,000కోట్లు వెచ్చించవలసి వచ్చేది. వారాంతాన ఏసీసీ షేరు ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే బీఎస్ఈలో 3 శాతం అధికంగా రూ. 2,365 వద్ద ముగిసింది. అంబుజా సిమెంట్స్ ఆఫర్ ధరకంటే 18 శాతం ప్రీమియంతో రూ. 454 వద్ద స్థిరపడింది. -
అదానీ దూకుడు: రూ. 31 వేల కోట్ల ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. తద్వారా స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ అనుబంధ సంస్థల్లో 26 శాతం చొప్పున వాటాలను కొనుగోలు చేయనుంది. ఇందుకు మొత్తం రూ. 31,000 కోట్లు వెచ్చించనుంది. ఈ ఏడాది మే నెలలో హోల్సిమ్ లిమిటెడ్ దేశీ బిజినెస్‌ల కొనుగోలుకి అదానీ గ్రూప్ 10.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 84,000 కోట్లు) విలువైన డీల్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు గత వారం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందింది. సెప్టెంబర్ 9 వరకూ అంబుజా సిమెంట్స్ వాటాదారులకు షేరుకి రూ. 385, ఏసీసీ వాటాదారులకు షేరుకి రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ శుక్రవారం(26న) ప్రారంభమై 2022 సెప్టెంబర్ 9న ముగియనుంది. వెరసి అంబుజా సిమెంట్స్‌కు చెందిన 51.63 కోట్ల షేర్లు(26 శాతం వాటా) అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 19,880 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో ఏసీసీకి చెందిన 4.89 కోట్ల షేర్ల కోసం రూ. 11,260 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. డీల్‌లో భాగంగా అంబుజా సిమెంట్స్‌లో 63.19 శాతం వాటాతోపాటు ఏసీసీలో 54.53% వాటాను అదానీ సొంతం చేసుకోనుంది. ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో అంబుజా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం బలపడి రూ. 403 వద్ద ముగిసింది. ఇక ఏసీసీ నామమాత్ర లాభంతో రూ. 2,286 వద్ద ముగిసింది. -
ఏసీసీ, అంబుజాకు ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ వచ్చే వారం సిమెంట్ రంగ దిగ్గజాల వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించే అవకాశముంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ లిస్టెడ్ కంపెనీలు అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లో యాజమాన్య వాటా కొనుగోలుకి మే నెలలోనే అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా రెండు సిమెంట్ దిగ్గజాల వాటాదారుల నుంచి మరో 26 శాతం చొప్పున వాటాలు సొంతం చేసుకునేందుకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. ఇందుకు రూ. 31,000 కోట్లు వెచ్చించే వీలుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ రూ. 50,181 కోట్ల విలువైన డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 10.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఆఫర్ ధరలు ఇలా.. ఓపెన్ ఆఫర్ నిర్వాహక సంస్థల తాజా సమాచారం ప్రకారం ఏసీసీ, అంబుజా సిమెంట్ వాటాదారులకు అదానీ గ్రూప్ సంస్థ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ నెల 26 నుంచి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. సెప్టెంబర్ 9న ముగియనున్న ఆఫర్లో భాగంగా ఏసీసీ వాటాదారులకు షేరుకి రూ. 2,300, అంబుజా సిమెంట్ వాటాదారులకు షేరుకి రూ. 385 చొప్పున కొనుగోలు చేయనుంది. వెరసి అంబుజా సిమెంట్స్‌కు చెందిన 51.63 కోట్ల షేర్ల కొనుగోలుకి రూ. 19,880 కోట్లవరకూ వెచ్చించనుంది. ఇక ఏసీసీకు చెందిన 4.89 కోట్ల షేర్లను సొంతం చేసుకునేందుకు రూ. 11,260 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. అనుబంధ సంస్థల ద్వారా అంబుజాలో 63.19 శాతం, ఏసీసీలో 54.53 శాతం చొప్పున హోల్సిమ్ వాటాలు కలిగి ఉంది. రెండు సంస్థల ప్రస్తుత స్థాపిత సామర్థ్యం వార్షికంగా 7 కోట్ల టన్నులు. దేశవ్యాప్తంగా 23 సిమెంట్ ప్లాంట్లు, 14 గ్రైండింగ్ స్టేషన్లు, 80 రెడీమిక్స్ యూనిట్లను కలిగి ఉన్నాయి. -
అంబుజా, ఏసీసీకి ఓపెన్ ఆఫర్లు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా రెండు లిస్టెడ్ సిమెంట్ కంపెనీలకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లో 26 శాతం చొప్పున వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ ఆఫర్ ఇచ్చింది. ఈ రెండు సంస్థలలో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనున్న నేపథ్యంలో సెబీ నిబంధనల ప్రకారం సాధారణ వాటాదారుల నుంచి మరో 26 శాతం చొప్పున వాటా కొనుగోలుకి సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 385 ధర ప్రకటించగా.. ఏసీసీకి రూ. 2,300 ధరతో ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీ సిమెంట్ దిగ్గజాలలో మెజారిటీ వాటా కొనుగోలుకి హోల్సిమ్ ఇండియాతో సుమారు రూ. 81,300 కోట్ల(10.5 బిలియన్ డాలర్లు) విలువైన(ఓపెన్ ఆఫర్‌తో కలిపి) ఒప్పందాన్ని అదానీ గ్రూప్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మారిషస్ సంస్థ ద్వారా మారిషస్ అనుబంధ(ఆఫ్‌షోర్) సంస్థ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అదానీ గ్రూప్ అంబుజా, ఏసీసీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీనిలో భాగంగా అంబుజా సిమెంట్స్‌లో 26 శాతం వాటాకు సమానమైన 51.63 షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 19,880 కోట్లు వెచ్చించనుంది. ఇదే విధంగా ఏసీసీ వాటాదారుల నుంచి 26 శాతం వాటాకు సమానమైన 4.89 కోట్ల షేర్లను సొంతం చేసుకోనుంది. ఇందుకు మరో రూ. 11,260 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. కాగా.. అంబుజా, ఏసీసీలో మెజారిటీ వాటా కొనుగోలుకి హోల్సిమ్ ఇండియాతో నికరంగా అదానీ గ్రూప్ రూ. 50,181 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం అంబుజా, ఏసీసీ వార్షికంగా 70 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో అంబుజా సిమెంట్స్ షేరు 2.3% బలపడి రూ. 367.4 వద్ద నిలవగా.. ఏసీసీ 4% జంప్‌చేసి రూ. 2,193 వద్ద ముగిసింది. -
అదానీ చేతికి హోల్సిమ్ ఇండియా
న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు, దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా సిమెంట్ రంగంలో భారీ డీల్‌కు తెరతీసింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ లిమిటెడ్‌కు దేశీ అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లను కొనుగోలు చేయనుంది. ఇందుకు ప్రత్యేక ఒప్పందం కుదిరినట్లు రెండు గ్రూప్‌లు ప్రకటించాయి. వెరసి సిమెంట్ దిగ్గజాలు అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇందుకు పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్లతో కలిపి రూ. 80,000 కోట్లు(10.5 బిలియన్ డాలర్లు) వరకూ వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రూప్ వెల్లడించింది. కీలకమైన పోర్టులు, పవర్ ప్లాంట్లు, కోల్ మైన్స్ నిర్వహించే అదానీ గ్రూప్ గత కొన్నేళ్లుగా విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీవైపు దృష్టిసారించింది. ఈ బాటలో సిమెంట్ రంగంలోనూ గతేడాది ప్రవేశించింది. అదానీ సిమెంటేషన్ పేరుతో రెండు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. తాజా డీల్ ద్వారా అదానీ గ్రూప్ దేశీయంగా సిమెంట్ రంగంలో రెండో పెద్ద కంపెనీగా ఆవిర్భవించనుంది. కాగా.. సిమెంట్ తయారీకి ప్రపంచ దిగ్గజంగా నిలుస్తున్న హోల్సిమ్ దేశీ సిమెంట్ బిజినెస్నుంచి వైదొలగనున్నట్లు గత నెలలో ప్రకటించింది. తదుపరి ఆదిత్య బిర్లా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లతోపాటు.. అల్ట్రాటెక్ తదితర దిగ్గజాలతో చర్చలు నిర్వహిస్తూ వచ్చింది. డీల్ వివరాలివీ.. ► 17 ఏళ్ల క్రితం దేశీ కార్యకలాపాలు ప్రారంభించిన హోల్సిమ్ ఇండియా అంబుజా సిమెంట్స్‌లో 63.19% వాటా ఉంది. అంబుజాకు మరో లిస్టెడ్ దిగ్గజం ఏసీసీలో మెజారిటీ(50.05%) వాటా ఉంది. ఏసీసీలో హోల్సిమ్ మరో 4.48% వాటాను కలిగి ఉంది. ఈ వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ► అంబుజా సిమెంట్‌కు ఒక్కో షేరుకి రూ. 385, ఏసీసీ లిమిటెడ్‌కు రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్ చెల్లించనుంది. ► సెబీ నిబంధనల ప్రకారం రెండు సంస్థల సాధారణ వాటాదారులకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది. ► అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌ల ప్రస్తుత సంయుక్త సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 70 మిలియన్ టన్నులు. ప్రత్యర్ధి సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ వార్షికంగా 119.95 మిలియన్ టన్నుల గ్రే సిమెంట్ సామర్థ్యంతో టాప్ ర్యాంకులో నిలుస్తోంది. దిగ్గజాల తీరిదీ ► ఏసీసీ 17 తయారీ యూనిట్లు, 9 సొంత అవసరాల( క్యాప్టివ్) విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 56,000 మంది డీలర్లు, రిటైలర్లతో నెట్‌వర్క్‌ను విస్తరించింది. ► అంబుజా సిమెంట్స్ మొత్తం 31 మిలియన్ టన్నుల సామర్థ్యంగల 6 సమీకృత తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 8 సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లు సైతం ఏర్పాటు చేసింది. ► 2015లో ఫ్రాన్స్ దిగ్గజం లఫార్జ్తో హోల్సిమ్ విలీనమైంది. లఫార్జ్హోల్సిమ్గా ఆవిర్భవిం చింది. ఏసీసీలో హోల్సిమ్ ఇండియాకుగల 24 శాతం వాటాను అంబుజా 2016 జూన్‌లో కొనుగోలు చేసింది. దీంతో ఏసీసీలో అంబుజా వాటా 50.05 శాతానికి చేరింది. క్వింటిలియన్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా 49 శాతం వాటా కొనుగోలు డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్(క్యూబీఎంఎల్)లో 49 శాతం వాటా ను సొంతం చేసుకోనున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. ఇందుకు గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ద్వారా క్యూబీఎంఎల్, క్వింటిలియన్ మీడియా లిమిటెడ్(క్యూఎంఎల్)తో వాటాదారులు, వాటా కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వాటా కొనుగోలుకి క్వింట్ డిజిటల్ మీడియా(క్యూడీఎంఎల్)తో సైతం ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. రాఘవ్ బల్ కంపెనీ క్యూబీఎంఎల్‌లో మైనారిటీ వాటా కొనుగోలు ద్వారా మీడియా బిజినెస్‌లోకి ప్రవేశించనున్నట్లు ఈ ఏడాది మార్చిలోనే అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. క్యూబీఎంఎల్.. బ్లూమ్బెర్గ్క్వింట్ పేరుతో బిజినెస్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తోంది. డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ కోసమే అదానీ గ్రూప్‌తో డీల్‌ను కుదుర్చుకున్నట్లు క్యూడీఎంఎల్ తెలిపింది. కాగా, డీల్ విలువ తెలియలేదు., మార్గదర్శనం దేశీయంగా మా బిజినెస్‌లను అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. తద్వారా దేశీయంగా తదుపరి దశ వృద్ధికి గ్రూప్ నాయకత్వం వహించగలదు. – జాన్ జెనిష్, సీఈవో, హోల్సిమ్ లిమిటెడ్ వృద్ధిపై విశ్వాసం సిమెంట్ రంగంలో విస్తరించే ప్రణాళికలు దేశ వృద్ధి అవకాశాలపట్ల మాకున్న విశ్వాసానికి నిదర్శనం. ప్రపంచంలోనే భారత్ డిమాండు ఆధారిత ప్రధాన ఆర్థిక వ్యవస్థకాగా.. పలు దశాబ్దాలుగా సిమెంట్ తయారీలో రెండో ర్యాంకులో నిలుస్తోంది. – గౌతమ్ అదానీ, చైర్మన్, అదానీ గ్రూప్. -
హోల్సిమ్ ఇండియా కొనుగోలు రేసులోకి బిర్లా
ముంబై/న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూపు సైతం స్విస్ కంపెనీ హోల్సిమ్కు చెందిన అంబుజా సిమెంట్, ఏసీసీ ఆస్తుల కొనుగోలు రేసులోకి అడుగు పెట్టింది. బిర్లా అధికారికంగా బిడ్ వేసిందని, గ్రూపు కంపెనీ అల్ట్రాటెక్ ద్వారా కొనుగోలు చేయనున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. సీసీఐ అనుమతి పొందుతామన్న నమ్మకం తమకు ఉందని, కొన్ని కంపెనీల ఆస్తులను వేరు చేయడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశాయి. అల్ట్రాటెక్‌కు దేశ సిమెంట్ రంగంలో గణనీయమైన వాటా ఉండడం తెలిసిందే. పోటీ సంస్థలైన ఏసీసీ, అంబుజా సిమెంట్ ఆస్తులు కూడా అల్ట్రాటెక్ చేతికి వెళితే గుత్తాధిపత్యానికి దారితీస్తుందా? లేదా అన్నది సీసీఐ సమీక్షించే అవకాశం నేపథ్యంలో ఇలా తెలిపాయి. ఇప్పటికే జీఎస్డబ్ల్యూ గ్రూపు, అదానీ గ్రూపు సైతం హోల్సిమ్కు చెందిన అంబుజా సిమెంట్, ఏసీసీ ఆస్తుల పట్ల ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. స్టీల్ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ కూడా ఆసక్తిగా ఉందని, రేసులోకి చేరొచ్చని విశ్వసనీయ వర్గాలు తె లిపాయి. ] చదవండి: ఉక్రెయిన్ సంక్షోభం.. ఎగుమతుల్లో ఇండియా రికార్డ్! -
ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ...భారత్‌కు గుడ్‌బై..!
ప్రపంచంలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ హోల్సిమ్ గ్రూప్ (హోల్డర్‌ఇండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్- Holcim Group) భారత్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. కంపెనీ గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా..భారత్ నుంచి తమ వ్యాపారాలకు స్వస్తి పలుకుతూ కోర్ మార్కెట్లపై హోల్సిమ్ గ్రూప్ దృష్టి సారించనున్నట్లు పలు నివేదికలు తెలుపుతున్నాయి. గత పదిహేడుళ్లుగా హోల్సిమ్ గ్రూప్ భారత్ మార్కెట్లలో తమ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇక హోల్సిమ్ గ్రూప్‌కు చెందిన రెండు లిస్టెడ్ కంపెనీలోని వాటాలను కూడా విక్రయించేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ గ్రూప్..అంబుజా సిమెంట్, ఎసీసీ సిమెంట్ కంపెనీల్లో వాటాలను కల్గి ఉంది. అంబుజా సిమెంట్స్‌లో 63.19 శాతం, ఎసీసీ కంపెనీలో 4.48 శాతం వాటాలను హోల్సిమ్ గ్రూప్ కల్గి ఉంది. హోల్సిమ్ గ్రూప్ తీసుకున్న నిర్ణయంతో సిమెంట్ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఆయా రంగ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ఇరు కంపెనీల వాటాలను అదానీ గ్రూప్స్, జెఎస్‌డబ్య్లూ సిమెంట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటాల విక్రయంతో రుణ భారం తగ్గించుకోవాలని హోల్సిమ్ గ్రూప్ చూస్తోంది. అలాగే కొనుగోళ్ల ద్వారా పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫైడ్ చేసుకోవాలని భావిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో హోల్సిమ్ గ్రూప్ తన బ్రెజిలియన్ యూనిట్‌ను సుమారు ఒక బిలియన్ డాలర్లకు విక్రయించింది. ఇక భారత్‌లో పాటుగా జింబాబ్వేలోని వ్యాపారాలను కూడా విక్రయించేందుకు సిద్దమైన్నట్లు సమాచారం. కారణం అదే..! హోల్సిమ్ గ్రూప్ ఆయా దేశాల నుంచి నిష్క్రమించేందుకు సిద్దమవుతోంది. స్పెషాలిటీ బిల్డింగ్ సొల్యూషన్స్, హై ఎండ్ ఎనర్జీ ఎఫిసియెంట్ రెనోవేషన్స్ వంటి విభాగాలపై హోల్సిమ్ గ్రూప్ ఫోకస్ చేయనుంది. ‘స్ట్రాటజీ 2025 ఆక్సల్రెటింగ్ గ్రీన్ గ్రోత్ ప్రోగాం’లో భాగంగా ఆయా దేశాల నుంచి నిష్క్రమించేందుకు హోల్సిమ్ గ్రూప్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా కంపెనీ డిసెంబర్ 2021లో మలర్కీ రూఫింగ్ ఉత్పత్తులను, 2021 ప్రారంభంలో ఫైర్‌స్టోన్ బిల్డింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. చదవండి: విలీన బాటలో దిగ్గజ ఐటీ కంపెనీలు? -
అంబుజా సిమెంట్ ఆకర్షణీయ ఫలితాలు
న్యూఢిల్లీ: అంబుజా సిమెంట్ సెప్టెంబర్ క్వార్టర్‌కు సంబంధించి ఆకర్షణీయ ఫలితాలను వెల్లడించింది. నికర లాభం 12.73 శాతం వృద్ధితో రూ.396 కోట్లు, ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.6,097 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.351 కోట్లు, ఆదాయం రూ.5,451 కోట్లుగా ఉన్నాయి. మొత్తం వ్యయాలు కూడా 12 శాతం పెరిగి రూ.5,540 కోట్లకు చేరాయి. జనవరి–డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరంగా అంబుజా సిమెంట్స్ పాటిస్తోంది. రిటైల్ వినియోగదారులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, సేవలు, కీలక మార్కెట్లపై దృష్టి పెట్టడం ద్వారా నికర విక్రయాల్లో 10.4 శాతం వృద్ధిని నమోదు చేశామని అంబుజా సిమెంట్ ఎండీ, సీఈవో అజయ్‌కపూర్ తెలిపారు. ఇంధన ధరల పెరుగుదల, రూపాయి అస్థిరతల ప్రభావాన్ని వ్యయాల నియంత్రణతో అధిగమించినట్టు చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ 5.46 మిలియన్ టన్నుల సిమెంట్‌ను విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 5.02 మిలియన్ టన్నులుగా ఉంది. జీడీపీ వృద్ధిపై దృష్టి పెట్టడం, ప్రభుత్వం చేపట్టిన ఇన్ఫ్రా ప్రాజెక్టులు, అందరికీ ఇళ్లు, అందుబాటు ధరల్లో ఇళ్ల కార్యక్రమాలతో సిమెంట్‌కు మంచి డిమాండ్ నెలకొందని కపూర్ చెప్పారు. ఇది కొనసాగుతుందని, ముందు ముందు మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. -
అంబుజా సిమెంట్స్ లాభం రూ.514 కోట్లు
ముంబై: అంబుజా సిమెంట్స్ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) జనవరి–మార్చి క్వార్టర్లో 30 శాతం వృద్ధితో రూ.514 కోట్లకు పెరిగింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల వల్ల ఈ స్థాయి నికర లాభం సాధించినట్లు కంపెనీ ఎమ్డీ, సీఈఓ అజయ్ కపూర్ చెప్పారు. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.397 కోట్ల నికర లాభాన్ని సాధించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన సిమెంట్ దిగ్గజం లఫార్జే హోల్సిమ్కు చెందిన ఈ కంపెనీ జనవరి– డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,608 కోట్ల నుంచి 1 శాతం తగ్గి రూ.6,546 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.6,099 కోట్ల నుంచి 5% తగ్గి రూ.5,790 కోట్లకు పరిమితమయ్యాయి. ఇబిటా 29 శాతం ఎగసింది. 6.22 మి. టన్నుల సిమెంట్ అమ్మకాలు... స్టాండ్ అలోన్ పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరం జనవరి– మార్చి క్వార్టర్లో రూ.247 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 20 శాతం వృద్ధితో రూ.272 కోట్లకు పెరిగింది. నికర అమ్మకాలు రూ.2,530 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.2,763 కోట్లకు చేరాయి. ప్రీమియమ్ బ్రాండ్లు– కాంపోసెమ్, రూఫ్ స్పెషల్ అమ్మకాలు బాగుండటం, రియలైజేషన్లు మెరుగుపడటం వంటి కారణాల వల్ల నికర అమ్మకాలు 9 శాతం పెరిగాయి. సిమెంట్ అమ్మకాలు 6.02 మిలియన్ టన్నుల నుంచి 6.22 మిలియన్ టన్నులకు పెరిగాయి. బీఎస్ఈలో అంబుజా సిమెంట్స్ షేర్ 1.4 శాతం నష్టంతో రూ.237 వద్ద ముగిసింది. -
ఏసీసీ-అంబుజా మెర్జర్‌కు బ్రేక్: షేర్ల పతనం
సాక్షి, ముంబై: సిమెంట్ రంగ దిగ్గజ కంపెనీలు ఏసీసీ, అంబుజా మధ్య విలీనాకి చెక్ పడిందన్న వార్తలతో మంగళవారం నాటి మార్కెట్లో ఈ రెండు షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా అంబుజా 4శాతం, ఏసీసీ2 శాతం నష్టపోయాయి. విలీనం చర్చలను నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఇరు కంపెనీలూ స్టాక్ ఎక్స్చేంజెస్‌కు అందించిన సమాచారంలో వెల్లడించాయి. సంస్థ ప్రత్యేక కమిటీ, బోర్డు డైరెక్టర్లు రెండింటి ద్వారా జరిపిన సమగ్ర పరిశీలన ఆధారంగా ప్రస్తుతం ఈ విలీనం అమలులో కొన్ని పరిమితులు ఉన్నాయని అభిప్రాయపడినట్టు ఏసీసీ తెలిపింది. కానీ భారతదేశం రెండవ అతిపెద్ద సిమెంటు తయారీ సంస్థను సృష్టించాలనేదే తమ "అంతిమ లక్ష్యం" మని ఏసీసీ, అంబూజా పేర్కొన్నాయి. మైనింగ్ ఆస్తుల బదిలీకి సమస్యలు ఎదురుకావడంతో ప్రస్తుతానికి ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్ విలీనానికి తెరపడినట్లు తెలుస్తోంది. 18-20 రాష్ట్రాలలో మైనింగ్ ఆస్తుల హక్కుల బదిలీకి సంబంధించి సమస్యలు ఎదురుకావచ్చని విలీన కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే రెండు కంపెనీలూ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి పరస్పరం సహకరించుకోనున్నట్లు పరిశ్రమవర్గాల సమాచారం. కాగా సిమెంట్ రంగంలో ఇటీవల కీలక విలీనాలకు అడుగులు పడుతున్నాయి. గతేడాది మే నెలలో ఏసీపీ, అంబుజా విలీనానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో బినాని సిమెంట్‌ను విలీనం చేసుకునేందుకు అల్ట్రా టెక్ సిమెంట్ ప్రయత్నిస్తోంది. -
అంబుజా సిమెంట్స్ లాభం 77% అప్
న్యూఢిల్లీ: అంబుజా సిమెంట్స్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక కాలంలో 77 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ. 271 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్‌కు రూ.478 కోట్లకు పెరిగిందని అంబుజా సిమెంట్స్ తెలిపింది. స్విట్జర్లాండ్ సిమెంట్ దిగ్గజం, లఫార్జే హోల్సిమ్కు చెందిన అంబుజా సిమెంట్స్ కంపెనీ జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తోంది. క్లింకర్ ఉత్పత్తి పెరగడం, అమ్మకాలు వృద్ధి చెందడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని సంస్థ ఎండీ, సీఈఓ అజయ్ కపూర్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.5,646 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.6,265 కోట్లకు ఎగసింది. అమ్మకాలు 50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 17 శాతం వృద్ధితో 58.7 లక్షల మెట్రిక్ టన్నులకు ఎగిశాయి. ఇబిటా 62 శాతం వృద్ధితో రూ.541 కోట్లకు పెరగ్గా, ఇబిటా మార్జిన్ 4.8 శాతం వృద్ధితో 19.9 శాతానికి చేరింది. మొత్తం వ్యయాలు రూ.5,310 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.5,541 కోట్లకు చేరుకున్నాయి. ఒక్కో షేర్‌కు రూ. 2 తుది డివిడెండ్(వంద శాతం) ఇవ్వనున్నట్లు కంపెనీ తెలియజేసింది. గతంలో ఇచ్చిన రూ.1.60 మధ్యంతర డివిడెండ్‌తో కలుపుకొని మొత్తం డివిడెండ్ రూ.3.60కు పెరిగింది. ‘సిమెంట్’ భవిష్యత్తు సానుకూలమే... ప్రీమియమ్ ఉత్పత్తులు, కీలకమైన మార్కెట్లు, వ్యయాల నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించామని, ఫలితంగా అమ్మకాలు పెరిగాయని, ఇబిటా కూడా పెరిగిందని అజయ్ కపూర్ పేర్కొన్నారు. మౌలిక రంగం అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు పెరగడం, అందుబాటు ధరల గృహాలపై ప్రభుత్వం దృష్టి సారించడం సిమెంట్ రంగానికి ప్రయోజనం కలిగిస్తాయని వివరించారు. లఫార్జేహోల్సిమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, రోలాండ్ కోహ్లర్‌ను అంబుజా సిమెంట్ అదనపు డైరెక్టర్‌గా నియమించామని, ఈ నియామకం మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. అర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్ఈలో అంబుజా సిమెంట్స్ షేర్ 2 శాతం లాభంతో రూ.263 వద్ద ముగిసింది. అంచనాలను మించిన ఫలితాలు..! అమ్మకాలు అంచనాలను మించడం, వ్యయ నియం త్రణ పద్ధతులు, ప్రీమియమ్ ఉత్పత్తుల వాటా పెరగడం వల్ల ఈ క్యూ3లో అంబుజా సిమెంట్స్ మంచి పనితీరు కనబరిచిందని రిలయన్స్ సెక్యూరిటీస్ పేర్కొంది. డిమాండ్ పుంజుకుంటోందని, ఈ కంపెనీ బ్రాండ్ ఈక్విటీ పటిష్టంగా ఉందని, ప్రీమియమ్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని, విలువ ఆధారంగా ధరల నిర్ణయం కలసివస్తోందని, మొత్తం మీద భవిష్యత్తులో ఈ కంపెనీ మంచి వృద్ధినే సాధించగలదని ఈ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది. -
ఆర్థిక ఫలితాలు
అంబూజా సిమెంట్స్ నికర లాభంలో 11.83% వృద్ధి ముంబై: అంబూజా సిమెంట్స్ కన్సాలిడేటెడ్ నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 11.83% వృద్ధిచెంది రూ. 642 కోట్ల నుంచి రూ. 718 కోట్లకు చేరింది. నికర అమ్మకాల ఆదాయం 14.67% పెరుగుదలతో రూ. 5,359 కోట్ల నుంచి రూ. 6,145 కోట్లకు చేరింది. 12 శాతం తగ్గిన భారతి ఇన్ఫ్రాటెల్ నికర లాభం న్యూఢిల్లీ: భారతి ఇన్ఫ్రాటెల్ నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 12% క్షీణించి రూ.756 కోట్ల నుంచి రూ. 664 కోట్లకు తగ్గింది. ఆదాయం 10% వృద్ధితో రూ. 3,211 కోట్ల నుంచి రూ. 3,525 కోట్లకు పెరిగింది. టాటా కమ్యూనికేషన్స్ లాభంలో క్షీణత న్యూఢిల్లీ: టాటా కమ్యూనికేషన్స్ లాభం జూన్ త్రైమాసికంలో 22% క్షీణించింది. రూ.32.94 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో వచ్చిన లాభం రూ.42.38 కోట్లు కావడం గమనార్హం. మొత్తం ఆదాయం 5% క్షీణించి రూ.4,552 కోట్ల నుంచి రూ.4,354 కోట్లకు పరిమితం అయింది. హడ్కో లాభం 50 శాతం జంప్ న్యూఢిల్లీ: హడ్కో లాభం జూన్ క్వార్టర్లో ఏకంగా 52% వృద్ధితో రూ.211 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.139 కోట్లు. ఆదాయం రూ.891 కోట్ల నుంచి రూ.929 కోట్లకు పెరిగింది. వామా ఇండస్ట్రీస్ లాభం రూ.1.8 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వామా ఇండస్ట్రీస్ జూన్ క్వార్టర్లో నికర లాభం రూ.1.87 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1.44 లక్షలు. టర్నోవరు రూ.6 కోట్ల నుంచి 41.6 కోట్లకు ఎగసింది. -
విలీన ప్రతిపాదనపై ఏసీసీ, అంబుజా కసరత్తు
న్యూఢిల్లీ: సిమెంటు ఉత్పత్తిలో అంతర్జాతీయ దిగ్గజం లఫార్జ్‌హోల్సిమ్‌లో భాగమైన దేశీ సంస్థలు ఏసీసీ, అంబుజా సిమెంట్స్ విలీన ప్రతిపాదనపై మరింతగా కసరత్తు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేయాలని ఇరు కంపెనీలు శుక్రవారం తమ తమ బోర్డ్‌ల సమావేశాల్లో నిర్ణయించాయి. వ్యాపారాల విలీనంతో వాటాదారులందరికీ ప్రయోజనం చేకూరగలదనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రెండు సంస్థలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ఇందుకోసం డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయి. ఒకవేళ ప్రతిపాదిత విలీనం సాకారమైన పక్షంలో ఏర్పడే కొత్త సంస్థ టర్నోవరు దాదాపు రూ. 20,425 కోట్లకు పైగా ఉంటుంది. ముంబైకి చెందిన ఏసీసీ 2016లో (జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరం) రూ. 11,158 కోట్ల ఆదాయం ఆర్జించగా.. అంబుజా సిమెంటు రూ. 9,268 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. 63 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో విలీన కంపెనీ సిమెంటు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న అల్ట్రాటెక్ తర్వాతి స్థానాన్ని దక్కించుకోనుంది. విలీన అవకాశాల వార్తలతో ఫిబ్రవరిలో ఏసీసీ, అంబుజా సిమెంట్ స్టాక్స్ గణనీయంగా లాభపడ్డాయి.