న్యూఢిల్లీ: సంస్థాగత ఇన్వెస్టర్ల సలహా సంస్థ ఐఐఏఎస్ తాజాగా అదానీ కుటుంబం చేపట్టిన పెట్టుబడుల సమీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు చేయవలసిందిగా అంబుజా సిమెంట్స్ వాటాదారులకు సూచించింది. వారంట్ల జారీ ద్వారా రూ. 20,000 కోట్ల సమీకరణకు అంబుజా సిమెంట్స్ సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా స్వతంత్ర డైరెక్టర్లుగా అమీత్ దేశాయ్, పుర్వీ షేథ్ ఎంపికను సైతం వ్యతిరేకించవలసిందిగా ఐఐఏఎస్ సిఫారసు చేసింది.
ఏసీసీలో 50.05 శాతం వాటాను కలిగి ఉన్న అంబుజా సిమెంట్స్ శనివారం(8న) అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహిస్తోంది. మొత్తం 12 ప్రతిపాదనలపై వాటాదారుల అనుమతిని కోరనుంది. వీటిలో ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా 47.74 కోట్ల వారంట్ల జారీ ప్రతిపాదన సైతం ఉంది. షేరుకి దాదాపు రూ. 419 ధరలో అదానీ గ్రూప్ సంస్థ హార్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు వారంట్ల కేటాయింపు ద్వారా రూ. 20,001 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. బోర్డులో గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, కుమారుడు కరణ్ అదానీసహా ఇద్దరు డైరెక్టర్లు, మరో నలుగురు స్వతంత్ర డైరెక్టర్ల ఎంపికకు అనుమతులను కోరనుంది.
కారణాలివీ..
అదానీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఐఐఏఎస్ ఇందుకు పలు కారణాలను పేర్కొంది. వారంట్లను మార్పిడి చేశాక ఈక్విటీ 19.4 శాతంమేర విస్తరించనుంది. ఇది అత్యధికంకాగా.. ప్రమోటర్ల వాటా ప్రస్తుత 63.1 శాతం నుంచి 70.3 శాతానికి పెరగనుంది. అంతేకాకుండా వారంట్ల ఇష్యూ ధర ప్రస్తుత రూ. 500తో పోలిస్తే 16 శాతంపైగా తక్కువ(డిస్కౌంట్). హోల్సిమ్ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన ధర కంటే 8.8 శాతం ప్రీమియం. అంబుజా సిమెంట్స్ ఇప్పటికే రూ. 3,840 కోట్ల నగదు, తత్సమాన నిల్వలు కలిగి ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే ఇవి రూ. 8,500 కోట్లు. ఎన్‌ఎస్‌ఈలో అంబుజా సిమెంట్స్ షేరు 3.7 శాతం జంప్‌చేసి రూ. 526 వద్ద ముగిసింది.
చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా
Comments
Please login to add a commentAdd a comment