న్యూఢిల్లీ: Gautam Adani Raised rs 11,330 crore : ప్రణాళికలకు అనుగుణంగానే నిధుల సమీకరణ చేపట్టినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. దీంతో గత నాలుగేళ్లలో రూ. 73,800 కోట్లు(9 బిలియన్ డాలర్లు) సమకూర్చుకున్నట్లు తెలియజేసింది. ఇందుకు గ్రూప్ కంపెనీలలో వాటాల విక్రయాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. ఈ బాటలో ఇటీవలే మూడు కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా రూ. 11,330 కోట్లు(1.38 బిలియన్ డాలర్లు) సమీకరించిన అంశాన్ని ప్రస్తావించింది.
10ఏళ్ల కాలానికిగాను పెట్టుబడుల పరివర్తన నిర్వహణ (ట్రాన్స్‌ఫార్మేటివ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్) ప్రణాళికల్లో భాగంగా నిధుల సమీకరణ చేపడుతున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. వివిధ పోర్ట్‌ఫోలియో కంపెనీల కోసం 2016లో ఈ ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేసింది.
దీనిలో భాగంగానే ఇటీవల అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా రూ. 11,330 కోట్లు అందుకున్నట్లు వివరించింది. దీంతో గ్రూప్ స్థాయిలో అత్యధిక పెట్టుబడులు అందుబాటులోకి వచ్చినట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment