న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోలో టైగర్ గ్లోబల్, డీఎస్‌టీ గ్లోబల్ మొత్తం 1.8 శాతం వాటాను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాకు సమానమైన 12,34,86,408 షేర్లను విక్రయించింది. ఇక డీఎస్‌టీ గ్లోబల్ 0.4 శాతం వాటాకు సమానమైన 3,19,80,447 షేర్లను అమ్మివేసింది.
షేరుకి రూ. 90–91 సగటు ధరలో విక్రయించిన వీటి మొత్తం విలువ రూ. 1,412 కోట్లు. యాక్సిస్ ఎంఎఫ్, ఎస్‌బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రులైఫ్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, సొసైటీ జనరాలి తదితరాలు జొమాటో షేర్లను కొనుగోలు చేశాయి. ఈ నేపథ్యంలో జొమాటో షేరు బీఎస్‌ఈలో 1.5 శాతం పుంజుకుని రూ. 92.3 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment