ఏసీసీ, అంబుజాకు ఓపెన్‌ ఆఫర్‌ | Adani to launch open offer to acquire stake in ACC, Ambuja Cements | Sakshi
Sakshi News home page

ఏసీసీ, అంబుజాకు ఓపెన్‌ ఆఫర్‌

Published Mon, Aug 22 2022 1:26 AM | Last Updated on Mon, Aug 22 2022 1:26 AM

Adani to launch open offer to acquire stake in ACC, Ambuja Cements - Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం అదానీ గ్రూప్‌ వచ్చే వారం సిమెంట్‌ రంగ దిగ్గజాల వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించే అవకాశముంది. స్విస్‌ దిగ్గజం హోల్సిమ్‌కు చెందిన దేశీ లిస్టెడ్‌ కంపెనీలు అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లో యాజమాన్య వాటా కొనుగోలుకి మే నెలలోనే అదానీ గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది.

దీనిలో భాగంగా రెండు సిమెంట్‌ దిగ్గజాల వాటాదారుల నుంచి మరో 26 శాతం చొప్పున వాటాలు సొంతం చేసుకునేందుకు ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించనుంది. ఇందుకు రూ. 31,000 కోట్లు వెచ్చించే వీలుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్‌ రూ. 50,181 కోట్ల విలువైన డీల్‌ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 10.5 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనుంది.

ఆఫర్‌ ధరలు ఇలా..
ఓపెన్‌ ఆఫర్‌ నిర్వాహక సంస్థల తాజా సమాచారం ప్రకారం ఏసీసీ, అంబుజా సిమెంట్‌ వాటాదారులకు అదానీ గ్రూప్‌ సంస్థ ఎండీవర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఈ నెల 26 నుంచి ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించనుంది. సెప్టెంబర్‌ 9న ముగియనున్న ఆఫర్‌లో భాగంగా ఏసీసీ వాటాదారులకు షేరుకి రూ. 2,300, అంబుజా సిమెంట్‌ వాటాదారులకు షేరుకి రూ. 385 చొప్పున కొనుగోలు చేయనుంది.

వెరసి అంబుజా సిమెంట్స్‌కు చెందిన 51.63 కోట్ల షేర్ల కొనుగోలుకి రూ. 19,880 కోట్లవరకూ వెచ్చించనుంది. ఇక ఏసీసీకు చెందిన 4.89 కోట్ల షేర్లను సొంతం చేసుకునేందుకు రూ. 11,260 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేయనుంది. అనుబంధ సంస్థల ద్వారా అంబుజాలో 63.19 శాతం, ఏసీసీలో 54.53 శాతం చొప్పున హోల్సిమ్‌ వాటాలు కలిగి ఉంది. రెండు సంస్థల ప్రస్తుత స్థాపిత సామర్థ్యం వార్షికంగా 7 కోట్ల టన్నులు. దేశవ్యాప్తంగా 23 సిమెంట్‌ ప్లాంట్లు, 14 గ్రైండింగ్‌ స్టేషన్లు, 80 రెడీమిక్స్‌ యూనిట్లను కలిగి ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement