Open Offer
-
అంబుజా చేతికి సంఘీ సిమెంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అంబుజా సిమెంట్స్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన సంఘీ ఇండస్ట్రీస్‌లో 56.74 శాతం వాటా కొనుగోలు చేసింది. సంఘీ ప్రమోటర్లు అయిన రవి సంఘీ, కుటుంబం నుంచి ఈ వాటా దక్కించుకుంది. ఇందుకోసం అంబుజా సిమెంట్స్ రూ.1,674 కోట్లు వెచి్చస్తోంది. మరో 26 శాతం వాటా కోసం అంబుజా సిమెంట్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. 6.71 కోట్ల ఈక్విటీ షేర్లకుగాను 13.8 శాతం ప్రీమియంతో ఒక్కొక్కటి రూ.114.22 చొప్పున రూ.767 కోట్లను ఖర్చు చేయనుంది. ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయితే సంఘీ ఇండస్ట్రీస్‌లో అంబుజా సిమెంట్స్‌కు 82.74 శాతం వాటా దక్కుతుంది. ఈ డీల్‌లో భాగంగా సంఘీ ఇండస్ట్రీస్‌ను రూ.5,000 కోట్లుగా విలువ కట్టారు. 3–4 నెలల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. సంఘీ ఇండస్ట్రీస్ కొనుగోలుతో అంబుజా సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7.36 కోట్ల టన్నులకు చేరనుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపు.. సంఘీ సిమెంట్స్‌కు గుజరాత్‌లోని కచ్ వద్ద ఉన్న సంఘీపురంలో 61 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక తయారీ సామర్థ్యం గల సిమెంట్ ప్లాంటుతోపాటు 66 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో క్లింకర్ ప్లాంట్ ఉంది. ‘సంఘీ ఇండస్ట్రీస్‌తో చేతులు కలపడం ద్వారా అంబుజా తన మార్కెట్ ఉనికిని విస్తరించడానికి, ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి.. నిర్మాణ సామగ్రి రంగంలో అగ్రగామిగా తన స్థానాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. సంఘీ ఇండస్ట్రీస్‌కు ఉన్న 100 కోట్ల టన్నుల సున్నపురాయి నిల్వలతో అంబుజా సిమెంట్స్ వచ్చే రెండేళ్లలో సంఘీపురంలో సిమెంట్ సామర్థ్యాన్ని 1.5 కోట్ల టన్నులకు చేర్చనుంది. అదానీ గ్రూప్ 2028 నాటికి 14 కోట్ల మెట్రిక్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉంది’ అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ సందర్భంగా తెలిపారు. పెద్ద నౌకలకు వీలుగా.. 8,000 డెడ్ వెయిట్ టన్నేజ్ సామర్థ్యం గల పెద్ద నౌకలు వచ్చేందుకు వీలుగా అక్కడే ఉన్న పోర్టును విస్తరించడానికి పెట్టుబడి చేయనున్నట్టు అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్ సీఈవో కరణ్ అదానీ వెల్లడించారు. దేశంలో అతి తక్కువ ఖర్చుతో క్లింకర్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటుగా సంఘీ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని చెప్పారు. గురువారం అంబుజా షేరు ధర 2.87% పెరిగి రూ.474.20 వద్ద, సంఘీ ఇండస్ట్రీస్ షేరు ధర 4.99% ఎగసి రూ.105.76 వద్ద స్థిరపడింది. -
ఎన్డీటీవీలో అదానీ పైచేయి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్లో భాగంగా ఇన్వెస్టర్లు 53.27 లక్షల షేర్లు విక్రయించేందుకు ఆసక్తి చూపినట్లు ఎన్డీటీవీ తాజాగా వెల్లడించింది. దీంతో మీడియా సంస్థలో అదానీ గ్రూప్ అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. ఎన్డీటీవీలో పరోక్షంగా 29.18 శాతం వాటాను పొందిన అదానీ గ్రూప్ మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. షేరుకి రూ. 294 ధరలో 1.67 కోట్ల షేర్ల కొనుగోలుకి సిద్ధపడింది. శుక్రవారం(2న) ముగింపు ధర రూ. 415తో పోలిస్తే ఆఫర్ ధర 41 శాతం తక్కువకాగా.. షేర్ల కొనుగోలు నేడు(5న) ముగియనుంది. కార్పొరేట్ ఇన్వెస్టర్లు సై ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కార్పొరేట్ ఇన్వెస్టర్లు 39.34 లక్షల షేర్లు, రిటైలర్లు 7 లక్షలకుపైగా, అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) 6.86 లక్షల షేర్లు చొప్పున టెండర్ చేశారు. ఇవి ఆఫర్లో 32 శాతంకాగా.. 8.26 శాతం వాటాను అదానీ గ్రూ ప్ సొంతం చేసుకోనుంది. వెరసి ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 37.44 శాతానికి బలపడనుంది. తద్వారా ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణవ్ రా య్, ఆయన భార్య రాధికా రాయ్‌ల సంయుక్త వా టా 32.26 శాతాన్ని మించనుంది. దీంతో చైర్మన్ పదవికి అదానీ గ్రూప్ అభ్యర్థిని నియమించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. చైర్మన్సహా ఇద్దరు డైరెక్టర్లను నియమించవచ్చని తెలియజేశాయి. ప్రస్తుతం ఎన్డీటీవీకి ప్రణవ్ రాయ్ (15.94 శాతం వాటా) చైర్‌పర్శన్‌గా, రాధిక(16.32 శాతం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వాటాల రీత్యా వీరిరువురూ డైరెక్టర్లుగా కొనసాగేందుకు వీలుంది. -
ఎన్డీటీవీ ఓపెన్ ఆఫర్‌కు స్పందన
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ ప్రకటించిన ఓపెన్ ఆఫర్లో భాగంగా మూడో రోజు గురువారాని(24)కల్లా దాదాపు 28 లక్షల ఎన్డీటీవీ షేర్లు టెండరయ్యాయి. ఎన్డీటీవీ వాటాదారుల నుంచి 1.67 కోట్ల షేర్లు(26 శాతం వాటా) కొనుగోలుకి అదానీ గ్రూప్ షేరుకి రూ. 294 ధరను నిర్ణయించింది. ఆఫర్ డిసెంబర్ 5న ముగియనుంది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం ఆఫర్లో 16.54 శాతానికి సమానమైన 27,72,159 షేర్లు లభించాయి. అయితే గురువారం బీఎస్ఈలో ఎన్డీటీవీ షేరు ఆఫర్ ధరతో పోలిస్తే 25 శాతం అధికంగా రూ. 368కు ఎగువన ముగియడం గమనార్హం! క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ నెల 7న అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు అనుమతించిన విషయం విదితమే. వెరసి ఎన్డీటీవీలో 26 శాతం అదనపు వాటాకు అదానీ గ్రూప్ రూ. 493 కోట్లు వెచ్చించనుంది. దశాబ్దకాలం క్రితం ఎన్డీటీవీకి రూ. 400 కోట్ల రుణాలు సమకూర్చిన వీసీపీఎల్ ఇందుకుగాను వారంట్లను పొందింది. వీసీపీఎల్‌ను సొంతం చేసుకోవడం ద్వారా అదానీ గ్రూప్ ఈ వారంట్లను ఈక్విటీగా మార్చుకునేందుకు నిర్ణయించింది. తద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఎన్డీటీవీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. -
ఎన్డీటీవీ ఓపెన్ ఆఫర్‌కి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాలను కొనుగోలు చేసే దిశగా ఓపెన్ ఆఫర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఓపెన్ ఆఫర్ లెటర్ ముసాయిదాను పరిశీలించి, అభిప్రాయాలు తెలపాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని కోరింది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు రూ. 400 కోట్ల రుణాలిచ్చిన విశ్వప్రధాన్ కమర్షియల్ (వీసీపీఎల్) అనే సంస్థను ఈ ఏడాది ఆగస్టులో కొనుగోలు చేయడం ద్వారా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ 29.18 శాతం వాటాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మైనారిటీ షేర్‌హోల్డర్ల నుండి మరో 26 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అక్టోబర్ 17న ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్లు అప్పట్లో వీసీపీఎల్ తెలిపింది. కానీ డీల్‌పై ఎన్డీటీవీ ప్రమోటర్ అయిన ఆర్ఆర్పీఆర్ అనుసరిస్తున్న ప్రతికూల వైఖరి కారణంగా సాధ్యపడలేదని తాజాగా పేర్కొంది. ఓపెన్ ఆఫర్ ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 294 చొప్పున దాదాపు 1.67 కోట్ల షేర్లను (26 శాతం) వీసీపీఎల్ కొనుగోలు చేస్తుందంటూ ఇష్యూని నిర్వహిస్తున్న జేఎం ఫైనాన్షియల్ గతంలో ఒక ప్రకటనలో పేర్కొంది. దీన్ని బట్టి ఓపెన్ ఆఫర్ అక్టోబర్ 17న ప్రారంభమై నవంబర్ 1న ముగియాలి. మరోవైపు, బుధవారం ఎన్డీటీవీ షేరు రూ. 332.90 వద్ద క్లోజయ్యింది. ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. -
అదానీ కీలక నిర్ణయం: కరణ్ అదానీ చేతికి ఏసీసీ పగ్గాలు
న్యూఢిల్లీ: స్విస్ సిమెంట్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన ఇండియా బిజినెస్‌ల కొనుగోలును పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. తద్వారా ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ గ్రూప్ దేశీయంగా రెండో అతిపెద్ద సిమెంట్ దిగ్గజంగా ఆవిర్భవించింది. కాగా అదానీ పెద్దకుమారుడు కరణ్‌కు ఏసీసీ బాధ్యతలు అప్పగించినట్లు గ్రూప్ తాజాగా పేర్కొంది. 6.5 బిలియన్ డాలర్లకు హోల్సిమ్ నుంచి సొంతం చేసుకున్న తదుపరి ఏసీసీ, అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్లను పూర్తి చేసినట్లు తెలిపింది. అదానీ గ్రూప్ టేకోవర్ పూర్తయిన వెంటనే రెండు కంపెనీల బోర్డు డైరెక్టర్లు రాజీనామాలు చేసినట్లు వెల్లడించింది. (Gautam Adani: దూకుడు మామూలుగా లేదుగా! ఏకంగా బెజోస్‌కే ఎసరు) గౌతమ్ అదానీ అధ్యక్షతన గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ అంబుజా సిమెంట్స్‌కు అధ్యక్షత వహించ నున్నారు. ప్రస్తుతం పోర్టు బిజినెస్‌లు చూస్తున్న కరణ్ అదానీ ఏసీసీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అంబుజా బోర్డులో, ఇంధన దిగ్గజం షెల్ ఇండియా మాజీ హెడ్ నితిన్ శుక్లా ఏసీసీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంబుజా సీఈవోగా అజయ్ కుమార్, ఏసీసీ సీఈవోగా శ్రీధర్ బాలకృష్ణన్ వ్యవహరించనున్నారు. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ఇదీ చదవండి: Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్ కమింగ్ సూన్ -
అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లకు స్పందన అంతంతే
న్యూఢిల్లీ: సిమెంట్ రంగ దిగ్గజాలు ఏసీసీ, అంబుజా వాటాదారులకు అదానీ గ్రూప్ ప్రకటించిన ఓపెన్ ఆఫర్లలో నామమాత్ర స్పందనే కనిపించింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ బిజినెస్ కొనుగోలులో భాగంగా అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్లను చేపట్టింది. పబ్లిక్ నుంచి 26 శాతం అదనపు వాటా కొనుగోలుకి ప్రకటించిన ఓపెన్ ఆఫర్లు వారాంతాన(9న) ముగిశాయి. సిమెంట్ దిగ్గజాలు వెల్లడించిన వివరా ల ప్రకారం 4.89 కోట్ల షేర్లకుగాను ఏసీసీ వాటాదారుల నుంచి 40.51 లక్షల షేర్లు మాత్రమే లభించాయి. ఇక అంబుజా సిమెంట్స్ విషయంలో మరింత తీసికట్టుగా కేవలం 6.97 లక్షల షేర్లు టెండర్ అయ్యాయి. కంపెనీ 51.63 కోట్ల షేర్ల కోసం ఆఫర్ ఇచ్చింది. రెండు కంపెనీల ఓపెన్ ఆఫర్లు ఆగస్ట్ 26న ప్రారంభమయ్యాయి. ఏసీసీ షేరుకి రూ. 2,300, అంబుజాకు రూ. 385 చొప్పున అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. హోల్సిమ్ దేశీ సిమెంట్ బిజినెస్‌ను సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ 10.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 84,000 కోట్లు)డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఓపెన్ ఆఫర్లు విజయవంతమైతే రూ.31,000కోట్లు వెచ్చించవలసి వచ్చేది. వారాంతాన ఏసీసీ షేరు ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే బీఎస్ఈలో 3 శాతం అధికంగా రూ. 2,365 వద్ద ముగిసింది. అంబుజా సిమెంట్స్ ఆఫర్ ధరకంటే 18 శాతం ప్రీమియంతో రూ. 454 వద్ద స్థిరపడింది. -
అదానీ దూకుడు, ఓపెన్ ఆఫర్ డేట్ ఫిక్స్, షేర్ ప్రైస్ ఎంతంటే?
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అదానీగ్రూప్ మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ఈ వాటా కొనుగోలుకు సంబంధించి తన ఓపెన్ ఆఫర్‌ను అక్టోబర్ 17న ప్రారంభించనుంది.1.67 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలుకు సంబంధించిన ఈ ఓపెన్ ఆఫర్లో ఒక్కో షేరు ధర రూ. 294గా నిర్ణయించిందని జేఎం ఫైనాన్షియల్ ప్రకటించింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ అనుబంధ సంస్థల ద్వారా బహుళ-లేయర్డ్ లావాదేవీలతో ఎన్డీటీవీలో మొత్తం 55శాతం వాటాను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అదానీ గ్రూప్, మీడియా సంస్థలో 29.18వాటాను కొనుగోలు చేయాలనే గ్రూప్ ప్రణాళికలకు అనుగుణంగా, ఓపెన్ ఆఫర్ కోసం తాత్కాలిక ప్రారంభ తేదీగా అక్టోబర్ 17ని నిర్ణయించింది.ఇష్యూకు మేనేజర్ జేఎం ఫైనాన్షియల్ పబ్లిక్ ప్రకటన ప్రకారం, ఆఫర్ తాత్కాలికంగా నవంబర్ 1న ముగియనుంది. ఓపెన్ ఆఫర్‌కు అనుగుణంగా, ఓపెన్ ఆఫర్లో పూర్తి అంగీకారం ఉందని భావించి, కొనుగోలుదారు, ఓటింగ్ షేర్ క్యాపిటల్‌లో 26శాతం వరకు పొందవలసి ఉంటుంది. ఒక్కో షేరుకు రూ. 294 ధరతో పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయితే, ఓపెన్ ఆఫర్ మొత్తం రూ. 492.81 కోట్లుగా ఉంటుంది. (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480) కాగా ఆగస్టు 23న, ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్‌లో 99.99 శాతం వాటాను కలిగి ఉన్న విశ్వప్రధాన కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్ లిమిటెడ్‌లో భాగమైన వీపీసీఎల్ వాటా తీసుకున్నామని వివరించింది. ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ. ఇందులో 29.18 శాతం వారికి వాటా ఉంది. ఎన్డీటీవీలో మరో 26 శాతం వాటా కొనుగోలుకు వీసీపీఎల్, ఏఎంఎన్ఎల్, ఏఈఎల్ కలిసి ఓపెన్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (Share Pledging Case: కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు భారీ ఊరట!) -
ఎన్డీటీవీ ఏజీఎం వాయిదా
న్యూఢిల్లీ: అదనంగా 26 శాతం వాటాల కొనుగోలు కోసం అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో ఎన్డీటీవీ తమ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. వాస్తవానికి ఇది సెప్టెంబర్ 20న జరగాల్సి ఉంది. అనుబంధ సంస్థ వీసీపీఎల్ ద్వారా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ పరోక్షంగా 29.18 శాతం వాటాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నిర్దిష్ట నిబంధనల అమలు కోసం 34వ ఏజీఎంను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్డీటీవీ తెలిపింది. -
అదానీ దూకుడు: రూ. 31 వేల కోట్ల ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. తద్వారా స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ అనుబంధ సంస్థల్లో 26 శాతం చొప్పున వాటాలను కొనుగోలు చేయనుంది. ఇందుకు మొత్తం రూ. 31,000 కోట్లు వెచ్చించనుంది. ఈ ఏడాది మే నెలలో హోల్సిమ్ లిమిటెడ్ దేశీ బిజినెస్‌ల కొనుగోలుకి అదానీ గ్రూప్ 10.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 84,000 కోట్లు) విలువైన డీల్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు గత వారం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందింది. సెప్టెంబర్ 9 వరకూ అంబుజా సిమెంట్స్ వాటాదారులకు షేరుకి రూ. 385, ఏసీసీ వాటాదారులకు షేరుకి రూ. 2,300 చొప్పున అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ శుక్రవారం(26న) ప్రారంభమై 2022 సెప్టెంబర్ 9న ముగియనుంది. వెరసి అంబుజా సిమెంట్స్‌కు చెందిన 51.63 కోట్ల షేర్లు(26 శాతం వాటా) అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 19,880 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో ఏసీసీకి చెందిన 4.89 కోట్ల షేర్ల కోసం రూ. 11,260 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. డీల్‌లో భాగంగా అంబుజా సిమెంట్స్‌లో 63.19 శాతం వాటాతోపాటు ఏసీసీలో 54.53% వాటాను అదానీ సొంతం చేసుకోనుంది. ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో అంబుజా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం బలపడి రూ. 403 వద్ద ముగిసింది. ఇక ఏసీసీ నామమాత్ర లాభంతో రూ. 2,286 వద్ద ముగిసింది. -
ఏసీసీ, అంబుజాకు ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ వచ్చే వారం సిమెంట్ రంగ దిగ్గజాల వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించే అవకాశముంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్కు చెందిన దేశీ లిస్టెడ్ కంపెనీలు అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లో యాజమాన్య వాటా కొనుగోలుకి మే నెలలోనే అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా రెండు సిమెంట్ దిగ్గజాల వాటాదారుల నుంచి మరో 26 శాతం చొప్పున వాటాలు సొంతం చేసుకునేందుకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. ఇందుకు రూ. 31,000 కోట్లు వెచ్చించే వీలుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంబుజా, ఏసీసీలలో మెజారిటీ వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ రూ. 50,181 కోట్ల విలువైన డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 10.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఆఫర్ ధరలు ఇలా.. ఓపెన్ ఆఫర్ నిర్వాహక సంస్థల తాజా సమాచారం ప్రకారం ఏసీసీ, అంబుజా సిమెంట్ వాటాదారులకు అదానీ గ్రూప్ సంస్థ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ నెల 26 నుంచి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. సెప్టెంబర్ 9న ముగియనున్న ఆఫర్లో భాగంగా ఏసీసీ వాటాదారులకు షేరుకి రూ. 2,300, అంబుజా సిమెంట్ వాటాదారులకు షేరుకి రూ. 385 చొప్పున కొనుగోలు చేయనుంది. వెరసి అంబుజా సిమెంట్స్‌కు చెందిన 51.63 కోట్ల షేర్ల కొనుగోలుకి రూ. 19,880 కోట్లవరకూ వెచ్చించనుంది. ఇక ఏసీసీకు చెందిన 4.89 కోట్ల షేర్లను సొంతం చేసుకునేందుకు రూ. 11,260 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. అనుబంధ సంస్థల ద్వారా అంబుజాలో 63.19 శాతం, ఏసీసీలో 54.53 శాతం చొప్పున హోల్సిమ్ వాటాలు కలిగి ఉంది. రెండు సంస్థల ప్రస్తుత స్థాపిత సామర్థ్యం వార్షికంగా 7 కోట్ల టన్నులు. దేశవ్యాప్తంగా 23 సిమెంట్ ప్లాంట్లు, 14 గ్రైండింగ్ స్టేషన్లు, 80 రెడీమిక్స్ యూనిట్లను కలిగి ఉన్నాయి. -
అంబుజా, ఏసీసీకి ఓపెన్ ఆఫర్లు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా రెండు లిస్టెడ్ సిమెంట్ కంపెనీలకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లో 26 శాతం చొప్పున వాటా కొనుగోలుకి అదానీ గ్రూప్ ఆఫర్ ఇచ్చింది. ఈ రెండు సంస్థలలో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనున్న నేపథ్యంలో సెబీ నిబంధనల ప్రకారం సాధారణ వాటాదారుల నుంచి మరో 26 శాతం చొప్పున వాటా కొనుగోలుకి సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా అంబుజా సిమెంట్స్ వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 385 ధర ప్రకటించగా.. ఏసీసీకి రూ. 2,300 ధరతో ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీ సిమెంట్ దిగ్గజాలలో మెజారిటీ వాటా కొనుగోలుకి హోల్సిమ్ ఇండియాతో సుమారు రూ. 81,300 కోట్ల(10.5 బిలియన్ డాలర్లు) విలువైన(ఓపెన్ ఆఫర్‌తో కలిపి) ఒప్పందాన్ని అదానీ గ్రూప్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మారిషస్ సంస్థ ద్వారా మారిషస్ అనుబంధ(ఆఫ్‌షోర్) సంస్థ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అదానీ గ్రూప్ అంబుజా, ఏసీసీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీనిలో భాగంగా అంబుజా సిమెంట్స్‌లో 26 శాతం వాటాకు సమానమైన 51.63 షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 19,880 కోట్లు వెచ్చించనుంది. ఇదే విధంగా ఏసీసీ వాటాదారుల నుంచి 26 శాతం వాటాకు సమానమైన 4.89 కోట్ల షేర్లను సొంతం చేసుకోనుంది. ఇందుకు మరో రూ. 11,260 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. కాగా.. అంబుజా, ఏసీసీలో మెజారిటీ వాటా కొనుగోలుకి హోల్సిమ్ ఇండియాతో నికరంగా అదానీ గ్రూప్ రూ. 50,181 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం అంబుజా, ఏసీసీ వార్షికంగా 70 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో అంబుజా సిమెంట్స్ షేరు 2.3% బలపడి రూ. 367.4 వద్ద నిలవగా.. ఏసీసీ 4% జంప్‌చేసి రూ. 2,193 వద్ద ముగిసింది. -
ఎవరెడీకి చైర్మన్, ఎండీలు బైబై
న్యూఢిల్లీ: డ్రై సెల్ బ్యాటరీలు, ఫ్లాష్లైట్ల తయారీ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అదిత్య ఖైతాన్, ఎండీ అమృతాన్షు ఖైతాన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఎవరెడీ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు బర్మన్ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన నేపథ్యంలో వీరిరువురూ పదవులకు గుడ్‌బై చెప్పినట్లు కంపెనీ పేర్కొంది. షేరుకి రూ. 320 ధరలో 1.89 కోట్ల ఎవరెడీ షేర్ల కొనుగోలుకి వివిధ సంస్థల ద్వారా సోమవారం నుంచి బర్మన్ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి(3) నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఆదిత్య, అమృతాన్షు బోర్డుకి రాజీనామాలు సమర్పించినట్లు ఎవరెడీ ఇండస్ట్రీస్ వెల్లడించింది. తద్వారా కొత్త యాజమాన్యం నేతృత్వంలో కంపెనీ లబ్ధి్ద పొందేందుకు వీలు కల్పించాలని వీరిరువురూ నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది. తాత్కాలిక ఎండీగా.. ఆదిత్య, అమృతాన్షు ఖైతాన్‌ల రాజీనామాలను ఆమోదించిన బోర్డు కంపెనీ జేఎండీగా వ్యవహరిస్తున్న సువమాయ్ సాహాకు మధ్యంతర ఎండీగా బాధ్యతలు అప్పగించినట్లు ఎవరెడీ వెల్లడించింది. వివిధ సంస్థల ద్వారా ఎవరెడీలో 19.84 శాతం వాటా కలిగిన బర్మన్ గ్రూప్ గత వారం 5.26 శాతం అదనపు వాటాను సొంతం చేసుకోవడం ద్వారా సోమవారం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం విదితమే. బీఎం ఖైతాన్ గ్రూప్ నిర్వహణలోని ఎవరెడీ కొనుగోలుకి డాబర్ ప్రమోటర్లు బర్మన్ కుటుంబం ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎవరెడీలో బర్మన్ కుటుంబ వాటా 25.11 శాతానికి చేరింది. దీంతో నిబంధనల ప్రకారం ఓపెన్ ఆఫర్‌కు డాబర్ తెరతీసింది. ప్రస్తుతం ఎవరెడీలో ఖైతాన్ కుటుంబానికి 4.84 శాతం వాటా మాత్రమే ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఎవరెడీ షేరు ఎన్ఎస్ఈలో 2.2% బలపడి రూ. 357 వద్ద ముగిసింది. -
ఎవరెడీకి డాబర్ ఓపెన్ ఆఫర్
కోల్‌కతా: డ్రై సెల్ బ్యాటరీల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో పూర్తిస్థాయి యాజమాన్య నియంత్రణకు వీలుగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు తాజాగా ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. కంపెనీ టేకోవర్ నిబంధనలకు అనుగుణంగా 26 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు షేరుకి రూ. 320 ధర చెల్లించనున్నట్లు వెల్లడించారు. బీఎం ఖైతాన్ గ్రూప్ నిర్వహణలోని ఎవరెడీ కొనుగోలుకి డాబర్ ప్రమోటర్లు బర్మన్ కుటుంబం ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. 5.26 శాతం అదనపు వాటా కొనుగోలు ద్వారా ఎవరెడీలో బర్మన్ కుటుంబ వాటా 25.11 శాతానికి చేరింది. దీంతో ఓపెన్ ఆఫర్‌కు డాబర్ తెరతీసింది. ప్రస్తుతం ఎవరెడీలో ఖైతాన్ కుటుంబానికి 4.84 శాతం వాటా మాత్రమే ఉంది. పరిస్థితులను గమనిస్తున్నాం ఎవరెడీలో పెట్టుబడులను పర్యవేక్షిస్తున్న డాబర్ కుటుంబంలోని మోహిత్ బర్మన్ కంపెనీ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. కంపెనీని దారిలో పెట్టేందుకు ఇదే సరైన సమయమని తెలియజేశారు. ఎవరెడీ బ్రాండుకు భారీ అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. కంపెనీకి విలువ జోడింపును చేపడుతామని, తద్వారా బిజినెస్‌ను మరోస్థాయికి తీసుకెళ్లగలమని వ్యాఖ్యానించారు. ఎవరెడీ కొనుగోలులో డాబర్ ఇండియా ప్రత్యక్షంగా పాల్లొనకపోవడం గమనార్హం! ఎవరెడీ ప్రమోటర్లు బీఎం ఖైతాన్ కుటుంబం మెక్నల్లీ భారత్ ఇంజినీరింగ్ రుణ చెల్లింపులకు, ఇతర రుణాలకుగాను కంపెనీ షేర్లను తనఖాలో ఉంచుతూ వచ్చారు. అయితే చెల్లింపుల్లో విఫలంకావడంతో రుణదాత సంస్థలు వీటిని విక్రయిస్తూ వచ్చాయి. దీంతో ఖైతాన్ వాటా 44 శాతం నుంచి 4.8 శాతానికి క్షీణించింది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో డాబర్ ఇండియా షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 565కు చేరగా.. ఎవరెడీ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 375 వద్ద ముగిసింది. -
క్రాంప్టన్ గ్రీవ్స్ చేతికి బటర్‌ఫ్లై
న్యూఢిల్లీ: బటర్‌ఫ్లై బ్రాండ్‌తో కిచెన్ అప్లయెన్సెస్ విక్రయించే గంధిమతి అప్లయెన్సెస్‌ను ప్రయివేట్ రంగ దిగ్గజం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ సొంతం చేసుకోనుంది. గంధిమతిలో మెజారిటీ వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా షేరుకి రూ. 1,403 ధరలో 55 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,380 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా బటర్‌ఫ్లై వాటాదారులకు షేరుకి రూ. 1,434 ధరలో ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. సెబీ నిబంధనల ప్రకారం 26 శాతం వాటావరకూ కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 667 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వెరసి గంధిమతి అప్లయెన్సెస్ కొనుగోలుకి రూ. 2,077 కోట్లవరకూ వెచ్చించనుంది. టాప్–3లో ఒకటి..: బటర్‌ఫ్లై బ్రాండుతో గంధిమతి అప్లయెన్సెస్ మిక్సర్ గ్రైండర్లు, టేబుల్ టాప్ వెట్ గ్రైండర్లు, ప్రెజర్ కుకర్లు, ఎల్పీజీ స్టవ్‌లు, నాన్‌స్టిక్ కుక్వేర్, స్టెయిన్లెస్ స్టీల్ వ్యాక్యూమ్ ఫ్లాస్క్‌లు తదితరాలను విక్రయిస్తున్న విషయం విదితమే. ఈ విభాగంలో దేశీయంగా టాప్–3 కంపెనీలలో ఒకటిగా నిలుస్తున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ పేర్కొంది. డీల్ వార్తల నేపథ్యంలో బటర్‌ఫ్లై షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 1,396 వద్ద నిలవగా.. క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 409 వద్ద ముగిసింది. -
కార్వీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై సెబీ రూ. 10 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: రీగాలియా రియాలిటీ లిమిటెడ్ సంస్థలో షేర్లను కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించే విషయంలో జాప్యం చేసినందుకు గాను కార్వీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 10 లక్షల జరిమానా విధించింది. నిర్దేశిత వ్యవధిలోగా తప్పనిసరిగా ప్రకటించకపోవడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, అందుకే జరిమానా విధించామని సెబీ పేర్కొంది. వివరాల్లోకి వెడితే రీగాలియా ప్రమోటర్లు 55.56 శాతం వాటాలను తనఖా పెట్టి కార్వీ నుంచి రూ. 7 కోట్లు రుణం తీసుకున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లను కార్వీ స్వాధీనం చేసుకుంది. దీంతో రీగాలియాలో కార్వీ వాటాలు సెబీ నిర్దేశిత స్థాయికి మించి 55.56 శాతానికి చేరాయి. ఫలితంగా పబ్లిక్ షేర్‌హోల్డర్ల నుంచి షేర్ల కొనుగోలుకు 45 రోజుల్లోగా ఓపెన్ ఆఫర్ ప్రకటించాలని సెబీ ఆదేశించింది. దీనిపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)ని ఆశ్రయించినప్పటికీ కార్వీకి చుక్కెదురైంది. సెబీని సమర్థిస్తూ 2018 ఏప్రిల్‌లో శాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన 45 రోజుల్లోగా కార్వీ బహిరంగ ప్రకటన చేయాల్సింది. కానీ 81 రోజుల తర్వాత 2018 ఆగస్టులో కార్వీ ఓపెన్ ఆఫర్ ప్రకటన చేసింది. ఇది నిబంధనల ఉల్లంఘన కింద భావిస్తూ సెబీ తాజాగా జరిమానా విధించింది. -
బీపీసీఎల్ కొత్త యజమాని ఓపెన్ ఆఫర్ ఇస్తే?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ బీపీసీఎల్ ప్రైవేటీకరణలో ఓ అంశం కీలకంగా మారింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్)లో 22.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీ కంపెనీలో 12.5 శాతం చొప్పున బీపీసీఎల్‌కు వాటాలున్నాయి. బీపీసీఎల్‌లో ప్రభుత్వం తనకున్న 52.98 శాతం వాటాను వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రైవేటీకరించే కసరత్తులో ఉన్న విషయం తెలిసిందే. బీపీసీఎల్‌ను కొనుగోలు చేసిన కొత్త యజమాని.. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐజీఎల్‌లో వాటాదారులకు 26 శాతం వాటాలను అదనంగా కొనుగోలు చేసేందుకు నిబంధనల మేరకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది విజయవంతం అయితే అప్పుడు ఐజీఎల్‌లో బీపీసీఎల్‌కు 48.5 శాతం, పెట్రోనెట్ ఎల్ఎన్జీలో 38.5 శాతానికి వాటాలు పెరుగుతాయి. దీంతో ఈ కంపెనీల్లో ఇప్పటికే వాటాలు కలిగిన ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), ఓఎన్జీసీ, గెయిల్ కంటే కూడా బీపీసీఎల్ పెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా ఐజీఎల్, పెట్రోనెట్ రెండూ కూడా ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలన్నది కేంద్రం యోచన. కనుక ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) సెబీని కోరింది. ఈ అభ్యర్థన బీపీసీఎల్ నుంచి రావాలని సెబీ సూచించడంతో.. బీపీసీఎల్ ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది. ఒకవేళ సెబీ నుంచి మినహాయింపు రాని పక్షంలో.. అప్పుడు పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐజీఎల్ వాటాదారులకు ఇచ్చిన ఓపెన్ ఆఫర్లో ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్ కూడా పాల్గొని అదనపు వాటాలను కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే పెట్రెనెట్, ఐజీఎల్‌కు ఐవోసీ, ఓఎన్జీసీ, గెయిల్ కూడా ప్రమోటర్లుగానే ఉండడంతో ఓపెన్ ఆఫర్లో పాల్గొనే అర్హత వాటికి కూడా ఉంటుంది. దీంతో బీపీసీఎల్ ప్రైవేటు పరం అయినా.. ఐజీఎల్, పెట్రోనెట్పై పీఎస్‌యూల ఆధిపత్యం కొనసాగే వీలుంటుంది. -
సత్తి కామెడీకి ప్రొడ్యూసర్ ఓపెన్ ఆఫర్
-
ఫ్యాన్స్‌కు ఓపెన్ ఆఫర్..హీరోయిన్‌తో డైరెక్ట్‌గా జూమ్ కాల్లో..
సినిమాలు ప్రమోట్ చేసుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌ను అనుసరిస్తారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాకే జై కొడుతున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం సోషల్ మీడియాను తెగ వాడుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బందా సైతం చేరింది. ప్రస్తుతం ఆమె ‘14 ఫేరే’ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవలె విడుదలై సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దేవాన్షుసింగ్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే, కృతి కర్బందా హీరో హీరోయిన్లుగా నటించారు. తాజాగా తన మూవీని ప్రమోషన్లో భాగంగా ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది కృతి. ఈ మూవీ ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నానని, అయితే ట్రైలర్లో తమకు నచ్చిన విషయాలేంటో చెప్పాలని ఫ్యాన్స్‌ను కోరింది. ఎవరైతే తనకు నచ్చిన అంశాల్ని ప్రస్తావిస్తారో వారితో జూమ్ కాల్లో మాట్లాడతానని అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఇక కృతి తెలుగులో తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ చిత్రాల్లో తళుక్కున మెరిసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత హిందీలో కాలు మోపిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైంది. ఇటీవలే హిందీలో ‘పాగల్ పంతి’ ‘హౌస్ ఫుల్-4’ సినిమాలతో హిట్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. -
ఆ సమస్య పరిష్కరిస్తే.. 35 లక్షలు మీవే..!
2016 నవంబర్ 8న.. రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000... 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్ ప్రసంగాన్ని అంతే రొటీన్‌గా చూస్తున్న జనానికది ఊహించని షాక్. ఇలా.. చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్‌లూ వచ్చాయి. ప్రభుత్వం భీమ్ యాప్‌ను తెచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే ఈ లావాదేవీలన్నీ స్మార్ట్ ఫోన్లలోనే జరుగుతున్నాయి. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. ఇంకా 50 కోట్ల ఫీచర్ ఫోన్ల వినియోగదారులున్నారని ఎన్‌సీపీఎల్ అంచనా. చదవండి: మాయల్లేవ్..మంత్రాల్లేవ్..ప్రయత్నించానంతే! ఫీచర్ ఫోన్లలో కూడా యూపీఐ సౌకర్యాన్ని కల్పించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని భారత్‌లో యూపీఐను నిర్వహించే ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంకల్పించింది. బిల్ అండ్ మిలిందా గేట్స్ పౌండేషన్, సీఐఐ సీవో కలిసి ఎన్పీసీఐ ఉమ్మడిగా ఓ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా యూపీఐ సౌకర్యాన్ని ఫీచర్ ఫోన్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినవారికి 50 వేల డాలర్ల (రూ.35.85 లక్షలు) బహుమతిని ప్రకటించింది. రెండో బహుమతిగా 30 వేల డాలర్లు (రూ.21.5 లక్షలు), మూడో బహుమతిగా 20 వేల డాలర్లు (రూ.14.34 లక్షలు) నిర్ణయించింది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందేందుకు దేశంలోని టెక్కీలకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ పోటీ ఈ నెల 12న ముగియనుంది. విజేతలను మార్చి 14న ప్రకటిస్తామని యూపీఐ నిర్వహణ సంస్థ పేర్కొంది. చదవండి: భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..! -
తగ్గుతున్న ఎల్ఐసీ ఆధిపత్యం!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ మార్కెట్ వాటా 70 శాతం లోపునకు పడిపోయింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎల్ఐసీ వాటా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 71.81 శాతం నుంచి 69.36 శాతానికి తగ్గింది. ఈ వివరాలను ఐఆర్డీఏ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా సంస్థల మార్కెట్ వాటా 30.64 శాతానికి పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా కంపెనీల వాటా 28.19 శాతంతో పోలిస్తే రెండు శాతానికి పైగా ఇవి వాటాను పెంచుకున్నాయి. నూతన వ్యాపార ప్రీమియం (కొత్త పాలసీల నుంచి) విభాగంలోనూ ప్రైవేటు కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. నూతన పాలసీల్లో 8.47 శాతం వృద్ధి నమోదు చేశాయి. అదే సమయంలో ఎల్ఐసీ కొత్త పాలసీల వృద్ధి 5.99%గా ఉంది. పాత పాలసీల రెన్యువల్ ప్రీమియంలో ఎల్ఐసీ వాటా 72.31 శాతం నుంచి క్రితం ఆర్థిక సంవత్సరంలో 69.35 శాతానికి తగ్గింది. ఎల్ఐసీ ఓపెన్ ఆఫర్‌కు పరిమిత స్పందన ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ (వాటాల కొనుగోలు) ను మైనారిటీ వాటాదారుల్లో 22 శాతం మంది వినియోగించుకున్నారు. మెజారిటీ వాటాదారులు మాత్రం ఎల్ఐసీ యాజమాన్యంపై నమ్మకంతో ఆఫర్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
ఒలెక్ట్రాకు ఎంఈఐఎల్ ఓపెన్ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల వంటి పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌లో (గతంలో గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్) మెజారిటీ వాటాల కొనుగోలు దిశగా ఎంఈఐఎల్ హోల్డింగ్స్ త్వరలో ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. ఈ డీల్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న యస్ సెక్యూరిటీస్ ఇందుకు సంబంధించిన వివరాలను స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఈ నెల 21 లేదా అంతకు ముందే ఓపెన్ ఆఫర్ వివరాలను పత్రికల్లో ప్రచురించనున్నట్లు తెలియజేసింది. ఓపెన్ ఆఫర్లో రూ. 4 ముఖ విలువ గల 2.37 కోట్ల దాకా షేర్లను .. షేరు ఒక్కింటికి రూ.175.30 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపింది. దీంతో ఇందుకోసం రూ. 415.58 కోట్లు వెచ్చించినట్లవుతుంది. ఇన్సులేటర్లు, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రాలో ఎంఈఐఎల్ హోల్డింగ్స్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కలిసి మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఒలెక్ట్రా ప్రమోటరు సంస్థ ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ నుంచి కోటి షేర్లతో పాటు ప్రిఫరెన్షియల్ ఇష్యూ కింద 2.65 కోట్ల షేర్లు, 91 లక్షల వారంట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది దాదాపు 50.01 శాతం వాటాలకు సరిసమానం. దీంతో సెబీ నిబంధనల ప్రకారం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి వచ్చింది. సోమవారం ఒలెక్ట్రా షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ.10 పెరిగి రూ.215 వద్ద ముగిసింది. ఈ షేరు ఏడాది కనిష్ఠ ధర రూ.112 కాగా గరిష్ఠ ధర రూ.249. -
రుణగ్రస్త కంపెనీల్లో వాటా కొంటే..
ఓపెన్ ఆఫర్ అక్కర్లేదు నిబంధనలు సడలించిన సెబీ ముంబై: భారీ రుణాల్లో కూరుకుపోయిన లిస్టెడ్ కంపెనీల్లో వాటా కొనే రుణదాతలు (బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు)...మైనారిటీ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫర్ ఇవ్వనక్కర్లేదు. ఈ మేరకు బ్యాంకులకు మినహాయింపునిస్తూ నిబంధనల్ని సడలిస్తున్నట్లు మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి ప్రకటించింది. రూ. 6 లక్షల కోట్ల మొండి బకాయిల సమస్యని పరిష్కరించేందుకు రిజర్వుబ్యాంకు పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సెబి తాజా ప్రకటన చేయడం గమనార్హం. బుధవారం సమావేశమైన సెబి బోర్డు సడలింపు ప్రతిపాదనల్ని ఆమోదించింది. ఇప్పటివరకూ ఎస్డీఆర్ స్కీము కింద రుణభారం కంపెనీల రుణాన్ని ఈక్విటీగా పునర్వ్యవస్థీకరించుకోవడంతో సమకూరే వాటాకు ఓపెన్ ఆఫర్ సడలింపు వుంది. ఇక ఆయా కంపెనీల వాటాను రుణదాతలు కొనుగోలు చేసే ఈక్విటీకి కూడా ఓపెన్ ఆఫర్ మినహాయింపు లభిస్తుంది. సాధారణంగా లిస్టెడ్ కంపెనీ నుంచి ఎవరైనా 15 శాతం మించి వాటాను కొంటే మైనారిటీ షేర్‌హోల్డర్ల నుంచి వాటాలు కొనుగోలు చేసేందుకు ఒక నిర్ణీత ధరపై ఓపెన్ ఆఫర్ జారీచేయాల్సివుంటుంది. రుణదాతల నుంచి సడలింపు కోరుతూ విజ్ఞాపనలు రావడంతో సెబి తాజా నిర్ణయం తీసుకుంది. ఓపెన్ ఆఫర్ సడలింపుతో రుణగ్రస్త కంపెనీలో వాటాను రుణదాతలు కొనుగోలు చేసి, కొత్త యాజమాన్యానికి విక్రయించడం వల్ల యాజమాన్య మార్పిడి వ్యయం తగ్గుతుంది. ఓపెన్ ఆఫర్ ద్వారా అదనపు వ్యయం సెబి తాజా నిర్ణయంతో రుణగ్రస్త కంపెనీల యాజమాన్య మార్పు సులభమవుతుందని, ఇది ఇన్వెస్టర్లకు ఊరట కల్పించే అంశమని కార్పొరేట్ అడ్వయిజరీ సంస్థ కార్పొరేట్ ప్రొఫెషనల్స్ పార్టనర్ మనోజ్ కుమార్ చెప్పారు. స్పెక్యులేషన్ కోసం పీ–నోట్స్ జారీపై నిషేధం.. స్పెక్యులేషన్ కోసం పార్టిసిపేటరీ నోట్స్ (పీ–నోట్స్) ద్వారా స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీలను కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ సెబి బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. ఈ పీ–నోట్స్‌ను భారత్ మార్కెట్లను పరీక్షించడానికి కొంతమంది ఇన్వెస్టర్లు ఉపయోగిస్తున్నందున, వీటిని పూర్తిగా నిషేధించడం లేదని సెబి ఛైర్మన్ అజయ్ త్యాగి చెప్పారు. బోర్డు సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పెక్యులేషన్ కోసం వీటిని వినియోగించడమే నిషిద్దమన్నారు. సెబి వద్ద రిజిష్టర్ అయిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల ఖాతాల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు పీ–నోట్స్‌ను ఉపయోగించి ఇక్కడ షేర్లను కొనడం, అమ్మడం చేస్తుంటారు. సాక్షి బిజినెస్ వెబ్సైట్లో... ⇔ చైనా రాక.. వర్థమాన దేశాలకు కాక ⇔ జీఎస్టీతో ఆటో డౌన్ ⇔ ఫండ్స్‌లో పెట్టుబడులకు మంచి తరుణమేనా? ⇔ ఆయిల్ కంపెనీ షేర్లకు క్రూడ్ సెగ ⇔ ఎల్ అండ్ టీకి బ్లాక్ డీల్స్ కిక్ ⇔ ఈ కంపెనీ ఫలితాల్లో నీరసం ⇔ ఆల్‌టైమ్ హైకి వందకు పైగా షేర్లు ⇔ మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, స్టాక్ అప్డేట్స్.. WWW.SAKSHIBUSINESS.COM -
మోన్ శాంటోకి బేయర్ ఓపెన్ (బంపర్) ఆఫర్
ముంబై: జర్మన్ ఫార్మా అండ్ కెమికల్ దిగ్గజం బేయర్ గ్రూప్ మోన్ శాంటోకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.1,100 పైగా కోట్లతో మోన్ శాంటో లోని 26శాతం అదనపు వాటాను కొనుగోలు చేసే మాండేటరీ ఓపెన్ ఆఫర్ ప్రకటనతో మదుపర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు దిగారు. బీటీ విత్తన దిగ్గజం మోన్శాంటో వాటాదారులకు బేయర్ గ్రూప్ ఈ ఓపెన్ ఆఫర్ ప్రకటించడంతో మోన్ శాంటో ఇండియా షేర్లు ఇంట్రాడేలో 6 శాతం పైగా ర్యాలీ అయ్యాయి. ఈ ఓపెన్ ఆఫర్ కింద, బేయర్ రూ 2,481.60 ధరకు వాటాదారుల నుండి దాదాపు 44.88 లక్షల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇది గత మంగళవారం నాటి మోన్ శాంటో ధరకు దాదాపు 4 శాతం అదనం. భారత నిబంధనల ప్రకారం, ఒక సంస్థ మరో లిస్టెడ్ కంపెనీలోని 15 శాతం వాటావరకు పొందినట్లయితే అది ఓపెన్ ఆఫర్ గా పరిగణించబడుతుంది. కాగా బహుళజాతి ఫార్మా, కెమికల్స్ కంపెనీ బేయర్ , అమెరికాకు చెందిన బయోటెక్ అగ్రగామి కంపెనీ మోన్శాంటో విలీనానికి 66 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. -
పిపావవ్ డీల్‌కు రిలయన్స్ ఇన్ఫ్రా ఓపెన్ ఆఫర్
పిపావవ్ డీల్‌కు రిలయన్స్ ఇన్ఫ్రా ఓపెన్ ఆఫర్ముంబై: పిపావవ్ డిఫెన్స్ కొనుగోలు ప్రక్రియలో భాగంగా రిలయన్స్ ఇన్ఫ్రామంగళవారం మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. దీని విలువ సుమారు రూ. 1,263 కోట్లుగా ఉండనుంది. షేరు ఒక్కింటికి రూ. 66 చొప్పున మొత్తం 19.14 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ డిఫెన్స్ సిస్టమ్స్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఆఫర్‌ను ప్రకటించాయి. తాజా వార్తలతో బీఎస్ఈలో మంగళవారం పిపావవ్ షేర్లు దాదాపు 4 శాతం క్షీణించి రూ. 61.3 వద్ద ముగిశాయి. -
సుజ్లాన్ షేర్ల కోసం ఓపెన్ ఆఫర్
- ప్రమోటర్ల నుంచి 23 శాతం వాటా కొన్న సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వి - మరో 26 శాతం వాటాకు షేరుకు రూ. 18 ధరపై ఆఫర్ - 20 శాతం ఎగసిన షేరు ధర న్యూఢిల్లీ: పవన విద్యుదుత్పత్తిలో ఉపయోగపడే విండ్ టర్బైన్లు తయారు చేసే సుజ్లాన్ ఎనర్జీ షేర్ల కోసం డీఎస్ఏ(దిలిప్ సంఘ్వి ఫ్యామిలీ అండ్ అసోసియేట్స్) ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఒక్కో షేర్‌ను రూ.18 చొప్పున 26 శాతం వాటాను(157.64 కోట్ల షేర్లు) కొనుగోలు చేయనున్నామని డీఎస్ఏ తెలిపింది. ఈ ఓపెన్ ఆఫర్ కోసం రూ.2,838 కోట్లు కేటాయించింది. సుజ్లాన్ ఎనర్జీలో 23 శాతం వాటా కొనుగోలు (రూ.1,800 కోట్లతో) కోసం సుజ్లాన్ ఎనర్జీ, సన్ ఫార్మాకు ప్రమోటర్ అయిన దిలిప్ సంఘ్వి, కుటుంబ సభ్యులు(డీఎస్ఏ) మధ్య గత వారంలో ఒప్పందం కుదిరింది. ఈ డీల్ తర్వాత సుజ్లాన్ ఎనర్జీలో డీఎస్ఏ వాటా 23 శాతంగా, సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి కుటుంబానికి 24 శాతం చొప్పున వాటాలుంటాయి. ఒప్పందం ప్రకారం యాజమా న్య నియంత్రణ తంతి కుటుంబానికే ఉంటుంది. వెయ్యి కోట్లు పెరిగిన మార్కెట్ క్యాప్ ఈ పరిణామాల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేర్ ధర సోమవారం ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 23 వద్ద ముగిసింది. ఒక్క సోమవారం రోజే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,089 కోట్లు పెరిగి రూ.7,606 కోట్లకు చేరింది.