రేవంత్‌.. నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ముందా?: కేటీఆర్‌ | BRS KTR Serious Comments On Congress Over Ramannapet Issue | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే మరణశాసనం రాస్తారు: కేటీఆర్‌

Published Wed, Oct 23 2024 11:05 AM | Last Updated on Wed, Oct 23 2024 11:17 AM

BRS KTR Serious Comments On Congress Over Ramannapet Issue

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా రామన్నపేటలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని సవాల్‌ చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు.

రామన్నపేటలో అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం నేడు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య

నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్. , మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, లను  హౌజ్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మాజీ ఎమ్మెల్యేలు  గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్యలు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం నియంతృత్వం కాక మరేంటి?. వీరితో పాటు ప్రజాసంఘాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలను ముందస్తు అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం రేవంత్ సర్కారు అణచివేత విధానాలకు నిదర్శనం.

ఇంతటి నిర్బంధ పరిస్థితులను సృష్టించి నిర్వహించే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు విలువ ఉండదు. ఇదీ ముమ్మాటికీ అదానీ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ సాగిస్తున్న అరాచక పర్వం. అక్రమంగా నిర్బంధించిన బీఆర్ఎస్ నాయకులతోపాటు ప్రజాసంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అప్పుడే గుండె పగిలిన రైతుల ఆవేదన, చుట్టుపక్కల ప్రజల ఆక్రందన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. నియంతృత్వ విధానాలతో ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే మరణశాసనం రాస్తారు. జై తెలంగాణ అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement