అంబుజా సిమెంట్ ప్రతిపాదనకు ఆమోదం
న్యూఢిల్లీ: హోల్సిమ్ ఇండియాలో 24% పొందాలన్న అంబుజా సిమెంట్స్ ప్రతి పాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గల అర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటి (క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఆఫైర్స్-సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. అంబుజా సిమెంట్స్ తన హోల్డింగ్ కంపెనీ హోల్సిమ్(ఇండియా)లో 24% వాటాను హోల్డర్‌ఇండ్ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి కొనుగోలు చేయనున్నది. షేర్ స్వాప్ ద్వారా రివర్స్ మెర్జర్ ప్రతిపాదనకు కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది.