పెన్షన్ చెల్లింపులు వేగంగా జరపండి!
బీమా కంపెనీలను ఆదేశించిన ఐఆర్‌డీఏ
న్యూఢిల్లీ : పాలసీదారులకు పెన్షన్ చెల్లింపుల్లో ఆలస్యం చెయొద్దని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇం దుకోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పెన్షన్ ఉత్పత్తులను తీసుకున్న పాలసీదారులతో చర్చలు జరపాలని బీమా కంపెనీలకు తెలియజేసింది. ఈ చర్చల్లో పాలసీదారులు వారి పెన్షన్ చెల్లింపుల కోసం ఏలాంటి ఆప్షన్ కోరుకుంటారో బీమా కంపెనీలు తెలుసుకుంటాయి.
అలాగే సదరు బీమా కంపెనీ పెన్షన్‌ను ఏ విధానంలో చెల్లిస్తుందో పాలసీదారులకు 6 నెలల ముందే తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీదారులు ఎలాంటి ఆప్షన్ ఇవ్వకపోతే.. అప్పుడు బీమా కంపెనీ ఆ పాలసీదారు బీమా తీసుకునే సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా చెల్లింపులు జరుపుతుంది. అలాగే నిబంధనలను అతిక్రమించడంతో రిలయన్స్ లైఫ్‌కు ఐఆర్‌డీఏ రూ.85 లక్షల జరిమానా విధించింది.