Reliance Life
-
కంటి వ్యాధులకు జన్యు చికిత్స
న్యూఢిల్లీ: వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులను నయం చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రిలయన్స్ లైఫ్ సైన్సెస్‌కు లైసెన్స్ ఇచ్చింది. ఈ జన్యు చికిత్సను రిలయన్స్ లైఫ్ మరింత అభివృద్ధి చేసి వాణిజ్యపరం చేయనుంది. జన్యు చికిత్సకు (జీన్ థెరపీ) సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భారత్‌లోని ఒక విద్యాసంస్థ నుండి కంపెనీకి బదిలీ చేయడం ఇదే మొదటిసారి అని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన బయాలాజికల్ సైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభా గానికి చెందిన జయంధరణ్ గిరిధర రావు, శుభమ్ మౌర్య ఈ పేటెంటెడ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. జంతువుల్లో దృష్టి లోపాన్ని సరిదిద్దడంలో ఇది మెరుగ్గా పనిచేసిందని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. -
రిలయన్స్ వ్యాక్సిన్: ట్రయల్స్‌కు గ్రీన్‌సిగ్నల్!
ముకేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్.. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలోకి అడుగుపెట్టింది. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ వృద్ధి చేసిన రీకాంబినెంట్ ఆధారిత వ్యాక్సిన్.. రెగ్యులేటరీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. అప్లికేషన్‌ను పరిశీలించిన ది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో హ్యూమన్ ట్రయల్స్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిధిలోని రిలయన్స్ లైఫ్ సైన్సెస్ డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్.. ఇప్పుడు లైన్ క్లియన్ కావడంతో త్వరగా ఫేజ్-1 ట్రయల్స్‌ను మొదలుపెట్టనుంది. మొత్తం 58 రోజులపాటు ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ ముంబై ధీరూబాయ్ అంబానీ లైఫ్ సైన్సెస్ సెంటర్లో నిర్వహించనుంది. అది అయిపోయిన వెంటనే.. రెండో, మూడో ట్రయల్స్ నిర్వహిస్తుంది. రెండో డోసుల ఈ వ్యాక్సిన్ అన్ని సక్రమంగా జరిగితే.. వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. దేశంలో వ్యాక్సినేషన్ రేటు పుంజుకునే టైంలో.. రిలయన్స్ వ్యాక్సిన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తద్వారా ప్రజలను ఆకర్షించేందుకు రిలయన్స్ ఎలాంటి అడుగులు వేయనుందో అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, క్యాడిల్లా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. చదవండి: అంబానీ ‘డబుల్’ మాస్టర్ ప్లాన్ -
మార్కెట్లోకి రిలయన్స్ లైఫ్ కొత్త పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిలయెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘పెరుగుతున్న ఆదాయ బీమా పథకం’ పేరుతో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పాలసీ వ్యవధి 12-24 ఏళ్లు. 14-60 ఏళ్ల వయస్సు వారు అర్హులు. ఈ పథ కాన్ని పొదుపు, ఆదాయపు దశ అని రెండు విభాగాలుగా వర్గీకరించారు. పొదుపు దశ అంటే.. పాలసీ టర్మ్ ప్రథమార్థంలో వినియోగదారుడు క్రమవారీ ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయ దశ అంటే.. పాలసీ టర్మ్ ద్వితీయార్థంలో నెలవారీ ఆదాయం అందుకోవటం. ఈ పథకం మెచ్యూరిటీతో కూడిన ఆదాయం, కేవలం ఆదాయం అనే రెండు రకాలుగా అందుబాటులో ఉంది. మెచ్యూరిటీతో కూడిన ఆదాయమైతే.. 24 ఏళ్ల పాలసీకి 13వ పాలసీ సంవత్సరం నుంచి పాలసీదారుడు ప్రతి నెలా హామీ ఇవ్వబడిన మొత్తం నుంచి 1 శాతాన్ని ఆదాయంగా పొందుతారు. అలాగే హామీ ఇవ్వబడిన మొత్తానికి 12 శాతాన్ని సంవత్సరంలో మొత్తం ఆదాయంగా అర్జిస్తారు కూడా. అదే కేవలం ఆదాయం మాత్రమే అయితే.. పాలసీదారుడు 13వ పాలసీ సంవత్సరం నుంచి ప్రతి నెలా హామీ ఇవ్వబడిన మొత్తం నుంచి 2 శాతాన్ని ఆదాయంగా పొందుతారు. అలాగే హామీ ఇవ్వబడిన మొత్తం నుంచి 24 శాతాన్ని సంవత్సరం ఆదాయంగా అందుతుంది. ఒకవేళ పాలసీదారుడు టర్మ్ కాలంలో మరణించినట్లయితే కేసును బట్టి హామీ ఇవ్వబడిన మొత్తాన్ని లేదా ప్రీమియం 105 శాతం అందించబడుతుంది. అప్పటికే చెల్లించిన ఆదాయం ప్రయోజనాలతో సంబంధం లేకుండా నామినీ సంపూర్ణ ప్రయోజనాన్ని పొందుతారు. -
పెన్షన్ చెల్లింపులు వేగంగా జరపండి!
బీమా కంపెనీలను ఆదేశించిన ఐఆర్డీఏ న్యూఢిల్లీ : పాలసీదారులకు పెన్షన్ చెల్లింపుల్లో ఆలస్యం చెయొద్దని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇం దుకోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పెన్షన్ ఉత్పత్తులను తీసుకున్న పాలసీదారులతో చర్చలు జరపాలని బీమా కంపెనీలకు తెలియజేసింది. ఈ చర్చల్లో పాలసీదారులు వారి పెన్షన్ చెల్లింపుల కోసం ఏలాంటి ఆప్షన్ కోరుకుంటారో బీమా కంపెనీలు తెలుసుకుంటాయి. అలాగే సదరు బీమా కంపెనీ పెన్షన్‌ను ఏ విధానంలో చెల్లిస్తుందో పాలసీదారులకు 6 నెలల ముందే తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీదారులు ఎలాంటి ఆప్షన్ ఇవ్వకపోతే.. అప్పుడు బీమా కంపెనీ ఆ పాలసీదారు బీమా తీసుకునే సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా చెల్లింపులు జరుపుతుంది. అలాగే నిబంధనలను అతిక్రమించడంతో రిలయన్స్ లైఫ్‌కు ఐఆర్డీఏ రూ.85 లక్షల జరిమానా విధించింది. -
ప్రభుత్వ పాఠశాలల్లో రిలయన్స్ లైఫ్ లైబ్రరీలు
న్యూఢిల్లీ: రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ రూమ్ టు రీడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో వందకు పైగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ అనూప్ రావ్ చెప్పారు. ఈ ఒప్పందాల్లో భాగంగా మొదటి ఏడాది ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరా ఖండ్, మహారాష్ట్రల్లో మునిసిపాలిటీ కార్పొరేషన్ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేసి, నిర్వహిస్తామని పేర్కొన్నారు. తర్వాతి సంవత్సరాల్లో మరిన్ని పాఠశాలల్లో మరిన్ని గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. వాణిజ్య సామాజిక బాధ్యత(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ-సీఎస్ఆర్)లో భాగంగా ఈ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా 10 వేల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం కారణంగా ఏర్పాటు చేసే గ్రంథాలయాల వల్ల అక్షరాస్యత, లింగ సమానత్వం పెంపొందిస్తామని వివరించారు. గ్రంథాలయాలు పిల్లల్లో అవగాహనను, అభ్యసన అలవాట్లను, కుతూహలాన్ని పెంపొం దిస్తాయని వివరించారు. భారత్‌లో విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇలాంటి ప్రయత్నాల ద్వారా ప్రభుత్వానికి తగిన తోడ్పాటునందిస్తామని చెప్పారు. -
రిలయన్స్ లైఫ్ నుంచి ఆన్లైన్ టర్మ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు రంగ బీమా కంపెనీ రిలయన్స్ లైఫ్ అందుబాటు ధరల్లో ఆన్లైన్ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టింది. పూర్తి పారదర్శకంగా, సులభంగా తీసుకునే విధంగా ఈ ఆన్లైన్ టర్మ్ పాలసీని రూపొందించినట్లు రిలయన్స్ లైఫ్ సీఈవో అనూప్ రావు తెలిపారు. 25 ఏళ్ల ఉన్న వ్యక్తి కోటి రూపాయలకు బీమా తీసుకుంటే రోజుకు కేవలం రూ.15 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందన్నారు. కనీస బీమా మొత్తం రూ.25 లక్షలు, కనీస వార్షిక ప్రీమియం రూ.3,500లుగా నిర్ణయించారు. ధూమపానం అలవాటు లేనివారికి, మహిళలకు ప్రీమియంలో తగ్గింపును రిలయన్స్ లైఫ్ అందిస్తోంది.