న్యూఢిల్లీ: రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ రూమ్ టు రీడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో వందకు పైగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ అనూప్ రావ్ చెప్పారు.
ఈ ఒప్పందాల్లో భాగంగా మొదటి ఏడాది ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరా ఖండ్, మహారాష్ట్రల్లో మునిసిపాలిటీ కార్పొరేషన్ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేసి, నిర్వహిస్తామని పేర్కొన్నారు. తర్వాతి సంవత్సరాల్లో మరిన్ని పాఠశాలల్లో మరిన్ని గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. వాణిజ్య సామాజిక బాధ్యత(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ-సీఎస్‌ఆర్)లో భాగంగా ఈ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా 10 వేల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ భాగస్వామ్యం కారణంగా ఏర్పాటు చేసే గ్రంథాలయాల వల్ల అక్షరాస్యత, లింగ సమానత్వం పెంపొందిస్తామని వివరించారు. గ్రంథాలయాలు పిల్లల్లో అవగాహనను, అభ్యసన అలవాట్లను, కుతూహలాన్ని పెంపొం దిస్తాయని వివరించారు. భారత్‌లో విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇలాంటి ప్రయత్నాల ద్వారా ప్రభుత్వానికి తగిన తోడ్పాటునందిస్తామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో రిలయన్స్ లైఫ్ లైబ్రరీలు
Published Tue, Nov 18 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM
Advertisement
Advertisement