బీమా కంపెనీలు మెడికల్, వాహనాల పాలసీలపై నో క్లెయిమ్ బోనస్‌లు (ఎన్‌సీబీ) ఇస్తుంటాయి. అంటే.. ఏదైనా సంవత్సరం క్లెయిమ్‌లు చేయకపోయిన పక్షంలో.. అందుకు ప్రతిగా బీమా కంపెనీ ఇచ్చే గిఫ్ట్ లాంటిదన్నమాట. ఇది ప్రీమియం తగ్గింపు రూపంలో ఉండొచ్చు లేదా సమ్ అష్యూర్డ్‌ను పెంచడం రూపంలోనైనా ఉండొచ్చు.
వాహనాల పాలసీల విషయానికొస్తే.. .. ఎన్‌సీబీ గానీ ఉన్న పక్షంలో పాలసీని రెన్యువల్ చేసుకునేటప్పుడు ఓన్ డ్యామేజ్ అంశానికి సంబంధించి చెల్లించాల్సిన ప్రీమియంలో కొంత డిస్కౌంటు లభించేందుకు ఉపయోగపడుతుంది. అంటే సాధారణంగా కట్టాల్సిన దాని కన్నా ప్రీమియం ఇంకాస్త తగ్గుతుంది. ఈ ఎన్‌సీబీను అలా జమ చేసుకుంటూ కూడా పోవచ్చు. తద్వారా ప్రీమియంలో గరిష్టంగా యాభై శాతం దాకా డిస్కౌంటు పొందడానికి అవకాశముంది.
అయితే, ఎన్‌సీబీ ఎంత పోగుపడినా.. ఒక్కసారి క్లెయిమ్ చేశారంటే.. అప్పటిదాకా వచ్చిన బోనస్ అంతా పోయినట్లే. ఎన్‌సీబీని బదలాయించుకునే అవకాశమూ ఉంది. వాహనదారు పాత వాహనం స్థానంలో కొత్తది తీసుకుంటే.. తన ఖాతాలో ఉన్న బోనస్‌ను కొత్త వాహనం ఓనర్ కింద బదలాయించుకోవచ్చు.
నో క్లెయిమ్ బోనస్ సంగతులు
Published Fri, Apr 11 2014 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM
Advertisement