రైతులకు పరిహారం రూ.5 | Tamil Nadu farmers get Rs 5, Rs 10 as compensation | Sakshi
Sakshi News home page

రైతులకు పరిహారం రూ.5

Published Fri, Mar 23 2018 1:32 AM | Last Updated on Fri, Mar 23 2018 1:33 AM

Tamil Nadu farmers get Rs 5, Rs 10 as compensation - Sakshi

చెన్నై: వాతావరణం సహకరించక పంట దెబ్బతిని నష్టపోయిన తమిళనాడు రైతులకు బీమా కంపెనీలు షాకిచ్చాయి. దిండిగల్, నాగపట్నం జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు రూ.10, రూ.5, రూ.4, రూ.2 చొప్పున నష్టపరిహారాన్ని విడుదల చేశాయి. ఈ మొత్తాన్ని దిండిగల్‌ కేంద్ర సహకార బ్యాంక్‌ రైతులకు చెక్కుల రూపంలో ఫిబ్రవరిలో అందించింది. ఈ విషయంపై తమిళనాడు శాసనసభ గురువారం దద్దరిల్లింది.

మాజీ మంత్రి, డీఎంకే నేత కె.పిచండి ఈ చెక్కులను సభలో ప్రదర్శించారు. ‘కరుపసామి రూ.102 ప్రీమియం కట్టినప్పటికీ ఆయనకు రూ.10 మాత్రమే నష్టపరిహారంగా అందింది. తిరుమలైసామి అనే మరో రైతు రూ.50 ప్రీమియం కట్టగా, ఆయనకు కేవలం రూ.5 నష్టపరిహారం ఇచ్చారు. ఈ చెక్కుల్ని మార్చుకోవాలంటే బ్యాంకుకు వెళ్లి రూ.500తో ఖాతాను తెరవాలి. మరి వీటితో ఉపయోగం ఏముంది?’ అని ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement