చెన్నై కోసం ఆర్థిక సంస్థల సేవలు
చెన్నై వరదల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడానికి ఆర్థిక సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ఇందుకోసం బీమా కంపెనీలు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటే, బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు పెనాల్టీలను రద్దు చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోయినా ఎటువంటి పెనాల్టీలు విధించమని ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు ప్రకటించాయి.
అలాగే బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్స్‌ను త్వరితగతిన పరిష్కరించడానికి 1800 209 7072 అనే హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది.