Chennai flood
-
దర్శకుడైన హీరో విక్రమ్!
హీరో విక్రమ్ ఇప్పుడు దర్శకుడి అవతారమెత్తారు. అదేంటి? శుభ్రంగా హీరోగా చేస్తున్నవాడు... ఇలా దర్శకుడయ్యాడేమిటని నివ్వెరపోకండి! ఆ మధ్య చెన్నై నగరాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తి, జనజీవ నాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. జనం కృతనిశ్చయంతో ఆ కష్టాలను అధిగమించారు. చెన్నై నగర వాసుల్లోని స్ఫూర్తిదాయకమైన ఈ సానుకూల అంశాన్ని ప్రతిఫలిస్తూ, విక్రమ్ ఇప్పుడో పాటను వీడియోగా చిత్రీకరిస్తున్నారు. అలా ఈ హీరో తొలిసారిగా దర్శకుడి అవతారమెత్తారు. ‘ది స్పిరిట్ ఆఫ్ చెన్నై’ (చెన్నై నగర స్ఫూర్తి) అనే ఈ పాట చిత్రీకరణ కూడా సహజంగానే చెన్నై నగరంలోనే చేస్తున్నారు. విశేషం ఏమిటంటే, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా వచ్చి ఇందులో నటించారు. ప్రముఖ రచయిత మదన్ కార్కీ (‘బాహుబలి’లో కిల్కి భాష సృష్టికర్త), రాకేశ్, గానా బాల ఈ పాట రాశారు. 20 మందికి పైగా పాడారు. తమిళ హీరో సూర్య, మలయాళ నటుడు నివిన్ పాలీ, కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్, ఇంకా శివకార్తికే యన్, ప్రభుదేవా, ‘జయం’ రవి, జీవా, భరత్, వరలక్ష్మీ శరత్‌కుమార్ తదితరులు వీడియోలో నటించారు. మొత్తానికి, కొన్నేళ్ళ క్రితం మణిరత్నం ‘రావణ్’లో కలసి నటించినప్పటి నుంచి స్నేహితులైన విక్రమ్, అభిషేక్‌లు ఇంతకాలానికి మళ్ళీ కలసి కెమేరా ముందుకు రావడం విశేషమే. -
నీట మునిగిన సత్యం
గ్రాఫిక్స్ ఎడమ వైపు ఫొటోలో ఉన్న అమ్మాయి ‘తేజ్’ న్యూస్ చానల్ యాంకర్. కుడివైపు ఫొటోలో ఉన్న అమ్మాయి కూడా సేమ్ టు సేమ్ అదే యాంకర్. అయితే మొదటి ఫొటో ఒరిజినల్. రెండోది ఫేక్. చెన్నై వరదల్లో నీటి మట్టం క్షణక్షణానికీ పెరిగి పోతున్న విషయాన్ని ‘లైవ్’లో చెప్పడానికి ఈ యాంకర్ నీళ్లలోకి దిగారు. రెండో ఫొటోలో మాత్రం యాంకర్ బొమ్మ మాత్రమే నీళ్లలోకి దిగింది! తేజ్ న్యూజ్ చానెల్ వాళ్లు స్టూడియోలో ఉండి చేసిన గ్రాఫిక్స్ గిమ్మిక్ ఇది. అర్థమైన వాళ్లకు అయింది. ‘మరీ ఇలాంటప్పుడు కూడానా!’ అని ఆవేదన చెందారు. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా చెన్నైని వానలు, వరదలు ముంచెత్తాయి. 200 మందికి పైగా మరణించారు. మీడియా నిద్రమాని మరీ వార్తల్ని అందించింది. మరింత ప్రాణ నష్టం జరక్కుండా, పరిస్థితి విషమించకుండా ప్రజలకు, ప్రభుత్వశాఖలకు అప్డేట్స్ ఇచ్చింది. ఇలా వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టే న్యూస్ ఛానెల్స్‌ను అభినందించాల్సిందే. కానీ ఆ అభినందనల కోసం గ్రాఫిక్స్‌తో గిమ్మిక్స్ చేసే ఛానెళ్లను ఏమనుకోవాలి? పైగా దీనిపై ఆ చానల్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. -
చెన్నై కోసం ఆర్థిక సంస్థల సేవలు
చెన్నై వరదల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడానికి ఆర్థిక సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ఇందుకోసం బీమా కంపెనీలు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటే, బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు పెనాల్టీలను రద్దు చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోయినా ఎటువంటి పెనాల్టీలు విధించమని ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు ప్రకటించాయి. అలాగే బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్స్‌ను త్వరితగతిన పరిష్కరించడానికి 1800 209 7072 అనే హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. -
ఇంటికి చేరిన ‘చెన్నై’ బాధితులు
ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు నర్సింహులపేట : చైన్నైలో వరద ప్రవాహంలో చిక్కుకుని నాలు గు రోజులుగా విలవిలలాడుతున్న మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన బాధితులు శనివారం తెల్లవారుజామున రెండు గం టల ప్రాంతంలో తమ ఇంటికి చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉపాధి పనుల కోసం దాట్ల గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాలు పదేళ్ల క్రితం చైన్నైకి వెళ్లి వివిధ ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాయి. అయితే చైన్నైలోని ఆర్కే నగర్, నెహ్రూనగర్‌లోని 10వ వీధిలో నివసిస్తున్న వారు నాలుగు రోజు లుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో శుక్రవారం వారు అక్క డి నుంచి ప్రైవేటు వాహనంలో ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధవులు ఆనందం వ్యక్తం చేశారు. -
గబ్బర్ సింగ్ మౌనం ఎందుకు?
హైదరాబాద్: ప్రకృతి విపత్తులు ప్రజలను కష్టాల్లోకి నెట్టినపుడు చిత్ర పరిశ్రమ నడుం బిగించడం, సహాయ సహకారాలు అందించడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో వర్షాలు, వరదలతో అతలాకుతలమైన చెన్నైను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు భారీగా విరాళాలు ప్రకటించారు. టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సహాయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు రంగంలోకి దిగి మన మద్రాస్ కోసం అంటూ విరాళాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఇపుడు గబ్బర్ సింగ్ హాట్ టాపిక్ అయ్యాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా సహాయం చేయడంలో ముందుండే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం చర్చనీయాంశం అయింది. గతంలో హూదూద్ తుఫాన్ సమయంలో అందరికంటే ముందుగా స్పందించిన పవన్ ఈసారి మాత్రం పెదవి విప్పకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారీ వర్షాలతో తమిళనాడులోని పలు ప్రాంతాలు నీట మునిగి అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నా స్పందించకపోవడం చర్చకు దారి తీసింది. షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉండడమే కారణమా? లేక మరేమయినా కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో బిజీగా ఉన్నారని అభిమానులంటున్నారు. అందువల్లనే సహాయాన్ని ప్రకటించలేకపోయారని, తమ అభిమాన హీరో త్వరలోనే స్పందిస్తారని చెబుతున్నారు. కాగా వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, అల్లరి నరేష్, అఖిల్, నవదీప్,సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్, నిఖిల్, నాని, మంచు మనోజ్, అల్లు శిరీష్, మధు శాలిని, తేజస్వి మరికొందరు టాలీవుడ్ స్టార్లు ఆదివారం ‘మన మద్రాస్ కోసం' అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి విరాళాలు, సహాయ సామాగ్రిని సేకరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని మంజీరా మాల్, ఇన్ ఆర్బిట్ మాల్, కూకట్ పల్లిలోని ఫోరమ్ సంజానా మాల్ లో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పలువురు సెలబ్రిటీలు స్వయంగా ప్రజల నుండి విరాళాలు సేకరించనున్నారు. -
సత్తాచాటుతున్న సా'మాన్యులు'
చెన్నై: చెన్నై వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి సహాయ బృందాలు ప్రయత్నిస్తుండగా, సామాన్యులు సైతం బాధితులను ఆదుకోవడానికి కృషి చేస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమకు చేతనైన సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సామాన్యుల్లో నుంచి పుట్టుకొచ్చిన ఈ హీరోల్లో బెంగళూరుకు చెందిన 25 ఏళ్ల ఆదిత్యా వెంకటేశ్ కూడా ఒకరు. ఆయన తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఒక బృందంగా ఏర్పడి తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి చెన్నైలోని వరద ప్రాంతాలకు వెళుతున్నారు. అక్కడ మెడిసిన్లు అవసరం ఉన్నవారికి వాటిని అందిస్తున్నారు. ప్రత్యేకించి గర్భిణులకు అవసరమైన మెడిసిన్లను ఎక్కువ మొత్తంలో తమ వద్ద ఉంచుకొని వారికి అందజేస్తున్నారు. ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో పోస్టుల ఆధారంగా ఆపదలో ఉన్న వారి వివరాలు తెలుసుకొని వారి వద్దకు వెళ్లి తాము మందులు అందిస్తున్నట్లు ఆయన ‘మెయిల్ టుడే’కు చెప్పారు. 33 ఏళ్ల మోషిన్ పటేల్ కూడా ముంబై నుంచి చెన్నైకు బయల్దేరి వచ్చి అక్కడివారిని ఆదుకోవడానికి తన వంతు కృషి చేస్తున్నారు. ట్వీటర్, ఫేస్‌బుక్‌లలో ఆయన తన నంబర్ షేర్ చేశారు. ఆ నంబర్‌ను సంప్రదించి రీచార్జ్ కోరిన ప్రతి ఒక్కరికీ ఆయన మొబైల్ రీచార్జ్ చేస్తుండడం గమనార్హం. ‘‘నేను ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో నా ఆప్త మిత్రులను కోల్పోయాను. చెన్నైలో ప్రస్తుత పరిస్థితి నన్ను కలచి వేస్తోంది. అందుకే నేను ఈ రకమైన సహాయాన్ని ఎంచుకున్నాను’’ అని ఆయన మెయిల్ టుడేతో చెప్పారు. వెంటకేశ్, మోషిన్లలాంటి ఎందరో సామాన్య హీరోలు చెన్నై బాధితులకు అండగా నిలుస్తున్నారు. అయితే కొందరి వివరాలే మీడియా ద్వారా బయటకు తెలుస్తున్నాయి. అలా బయటకు తెలియని హీరోలకు కూడా సలామ్ కొడదాం! ప్రధాని ఫొటోలపై.. ‘ఫొటోషాప్’ మరక! సాక్షి, హైదరాబాద్: చెన్నై వరద పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన ఏరియల్ వ్యూకు సంబంధించిన ఫొటోల విషయంలో ఫొటోషాప్ చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) అభాసుపాలైంది. పీఎం ఏరియల్ వ్యూ ఫొటోస్ను ట్విటర్ ద్వారా మీడియాకు విడుదల చేసిన పీఐబీ అత్యుత్సాహం కొద్దీ ఫొటోషాప్‌తో వాటిని తీర్చిదిద్దింది. ఆ ఫొటోలను శుక్రవారం దేశవ్యాప్తంగా అన్ని మీడియా వర్గాలూ ప్రముఖంగా ప్రచురించాయి. మామూలుగా ఏరియల్ వ్యూ నుంచి చూస్తే వరద పరిస్థితి స్పష్టంగా కనిపించే అవకాశాలేమీ ఉండవు. అయితే పీఐబీ నుంచి వెలువడిన ఫొటోల్లో మాత్రం విమానం కిటీకీ నుంచే వరద పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా మార్ఫ్ చేశారు. ఈ విషయం తేటతెల్లం కావడంతో పీఐబీ తన పొరపాటును సవరించుకునే ప్రయత్నం చేసింది. ప్రధాని ఏరియల్ వ్యూ ఫొటోలకు సంబంధించిన ట్వీట్‌ను డిలీట్ చేసింది. అయితే పీఐబీ అత్యుత్సాహంతో ప్రధాని ఫొటోలను మార్ఫ్ చేయడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. -
దేవుడా.. రేపు ఎండలు వచ్చేలా చూడు!
భారీ వర్షాలతో ఛిన్నాభిన్నమైన చెన్నైకి అండగా బాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చారు. గత వందేళ్లలో కనీవినీ ఎరుగని వానలతో అల్లాడుతున్న చెన్నై వాసులు త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. చెన్నై వాసుల కష్టాలకు చలించిపోతూ చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. బాధితులకు సాయమందించాల్సిందిగా అన్ని వర్గాల వారిని కోరారు. వానలు నిలిచిపోయి కష్టాలు త్వరగా తొలగిపోవాలని ఆకాంక్షించారు. ఈ రోజంతా కురిసిన వానలు చెన్నైను చెరువులా మార్చేసినా నేపథ్యంలో రేపైనా ఎండలు కాసి.. పరిస్థితి కాస్తంతా మెరుగుపడాలని, చెన్నైవాసులకు ఊరటనివ్వాలని బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తోపాటు పలువురు బాలీవుడ్ తారలు ఆకాంక్ష వ్యక్తం చేశారు. చెన్నై వాసుల క్షేమం కోసం తామంతా ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. వారు ఏమన్నారంటే 'చెన్నై నీటమునిగిపోయింది. చెన్నైవాసుల భద్రత ఉండాలని.. త్వరగా పరిస్థితులు కుదుటపడాలని ప్రార్థిస్తున్నా.. ఈ కష్టకాలంలో స్వచ్ఛంద సహాయం వెల్లువెత్తడం హృదయాన్ని కదిలిస్తున్నది' - అమితాబ్ బచ్చన్ T 2077 - Chennai deluged .. !! Prayers for safety and calm soon .. So heartwarming to see immense voluntary help coming by !! — Amitabh Bachchan (@SrBachchan) December 1, 2015 'చెన్నైలో వరదల సమాచారం గుండెల్ని పిండేస్తున్నది. ఈ విప్తతు తొలగిపోయి.. రేపు ఎండలు కాసి.. వాతావరణం ఆహ్లాదంగా ఉండాలని బాధితుల తరఫున ప్రార్థిస్తున్నా' - అక్షయ్‌కుమార్, హీరో 'చెన్నై వాసుల కష్టాలే నన్ను తొలుస్తున్నాయి' - ఫర్హాన్ అఖ్తర్ 'నా క్షేమం కోసం ఆలోచించినందుకు కృతజ్ఞతలు. నేను భద్రంగా ఉన్నాను. వర్షాల్లో తీవ్రంగా దెబ్బతిన్న వారి కోసమే నేనిప్పుడు ప్రార్థిస్తున్నాను' - అభిషేక్ బచ్చన్ చెన్నై వాసుల కోసం ప్రార్థిస్తున్నాను. పరిస్థితులు త్వరగా బాగు పడాలని ఆశిస్తున్నాను. - సోనాక్షి సిన్హా