
దేవుడా.. రేపు ఎండలు వచ్చేలా చూడు!
భారీ వర్షాలతో ఛిన్నాభిన్నమైన చెన్నైకి అండగా బాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చారు. గత వందేళ్లలో కనీవినీ ఎరుగని వానలతో అల్లాడుతున్న చెన్నై వాసులు త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. చెన్నై వాసుల కష్టాలకు చలించిపోతూ చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు. బాధితులకు సాయమందించాల్సిందిగా అన్ని వర్గాల వారిని కోరారు. వానలు నిలిచిపోయి కష్టాలు త్వరగా తొలగిపోవాలని ఆకాంక్షించారు.
ఈ రోజంతా కురిసిన వానలు చెన్నైను చెరువులా మార్చేసినా నేపథ్యంలో రేపైనా ఎండలు కాసి.. పరిస్థితి కాస్తంతా మెరుగుపడాలని, చెన్నైవాసులకు ఊరటనివ్వాలని బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తోపాటు పలువురు బాలీవుడ్ తారలు ఆకాంక్ష వ్యక్తం చేశారు. చెన్నై వాసుల క్షేమం కోసం తామంతా ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. వారు ఏమన్నారంటే
'చెన్నై నీటమునిగిపోయింది. చెన్నైవాసుల భద్రత ఉండాలని.. త్వరగా పరిస్థితులు కుదుటపడాలని ప్రార్థిస్తున్నా.. ఈ కష్టకాలంలో స్వచ్ఛంద సహాయం వెల్లువెత్తడం హృదయాన్ని కదిలిస్తున్నది'
- అమితాబ్ బచ్చన్
T 2077 - Chennai deluged .. !! Prayers for safety and calm soon .. So heartwarming to see immense voluntary help coming by !!
— Amitabh Bachchan (@SrBachchan) December 1, 2015
'చెన్నైలో వరదల సమాచారం గుండెల్ని పిండేస్తున్నది. ఈ విప్తతు తొలగిపోయి.. రేపు ఎండలు కాసి.. వాతావరణం ఆహ్లాదంగా ఉండాలని బాధితుల తరఫున ప్రార్థిస్తున్నా'
- అక్షయ్‌కుమార్, హీరో
'చెన్నై వాసుల కష్టాలే నన్ను తొలుస్తున్నాయి'
- ఫర్హాన్ అఖ్తర్
'నా క్షేమం కోసం ఆలోచించినందుకు కృతజ్ఞతలు. నేను భద్రంగా ఉన్నాను. వర్షాల్లో తీవ్రంగా దెబ్బతిన్న వారి కోసమే నేనిప్పుడు ప్రార్థిస్తున్నాను'
- అభిషేక్ బచ్చన్
చెన్నై వాసుల కోసం ప్రార్థిస్తున్నాను. పరిస్థితులు త్వరగా బాగు పడాలని ఆశిస్తున్నాను.
- సోనాక్షి సిన్హా