financial institutions
-
తగ్గిన ఆర్థిక మోసాలు
సాక్షి, అమరావతి: గత రెండు సంవత్సరాలుగా దేశంలో వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలు తగ్గాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే... 2022–23, 2023–24 ఆరి్థక సంవత్సరాల్లో బ్యాంకుల్లో ఆర్థిక మోసాలు బాగా తగ్గడం విశేషం. ఈ విషయాన్ని కేంద్ర ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. 2021–22లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో రూ.9,289 కోట్ల విలువైన ఆర్థిక మోసాలు జరిగాయని తెలిపారు. 2022–23 ఆరి్థక సంవత్సరంలో రూ.3,607 కోట్ల విలువైన మోసాలు, 2023–24 ఆరి్థక సంవత్సరంలో రూ.2,175 కోట్ల విలువైన మోసాలు జరిగాయని పంకజ్ చౌదరి వివరించారు. మోసగాళ్లను అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకోవడంతో మోసాల సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు.‘2021–22లో అత్యధికంగా పశి్చమ బెంగాల్లో 537 కేసుల్లో రూ.3,391 కోట్ల మోసం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో 715 కేసుల్లో రూ.2,630 కోట్లు, మహారాష్ట్రలో 2,233 కేసుల్లో రూ.1,257 కోట్లు, 2022–23లో అత్యధికంగా ఢిల్లీలో 1,743 కేసుల్లో రూ.762 కోట్లు, 2023–24లో తమిళనాడులో అత్యధికంగా 6,468 కేసుల్లో రూ.663 కోట్ల మేర మోసం జరిగింది.’ అని ఆయన తెలిపారు. వాణిజ్య బ్యాంకులు, ఆరి్థక సంస్థల్లో మోసాలను నివారించేందుకు ఆర్బీఐ రిస్క్ మేనేజ్మెంట్పై ఇటీవల తగిన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. బ్యాంకుల్లో డెడికేటెడ్ డేటా అనలిటిక్స్ మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటును తప్పనిసరి చేసినట్లు తెలిపారు. మూడేళ్లలో యూపీఐ చెల్లింపుల్లో రూ.2,145 కోట్ల మోసం గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 26.99 లక్షల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల్లో రూ.2,145 కోట్ల మేర మోసం జరిగినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. లావాదేవీలు, చెల్లింపుల మోసాన్ని నివేదించే సాధనంగా ఆర్బీఐ మార్చి 2022 నుంచి వెబ్ అధారిత సెంట్రల్ పేమెంట్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని అమలు చేస్తోందని చెప్పారు. అన్ని సంస్థలు చెల్లింపుల మోసాలను వెబ్ అధారిత సెంట్రల్ పేమెంట్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీకి నివేదించాల్సి ఉంటుందన్నారు. లావాదేవీల మోసాలతోపాటు చెల్లింపు సంబంధిత మోసాలను నిరోధించేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ఏఐ అండ్ ఎంఎల్‌ను వినియోగించడం ద్వారా మోసపూరిత లావాదేవీలను బ్యాంకులు తిరస్కరించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఆన్‌లైన ఫైనాన్స్ భద్రతను మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. -
అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!
డబ్బు పొదుపు చేయాలని చాలా మంది కోరుకుంటారు. అందుకు విభిన్న మార్గాలు ఎంచుకుంటారు. అయితే వాటిలో డిపాజిట్ చేసే డబ్బుకు ఆర్బీఐ కొంత వరకు బీమా కల్పిస్తోంది. దాంతో చాలా మంది ఎఫ్డీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్లో వివిధ మనీ యాప్‌లు, బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ సంస్థలు వంటివి ఎఫ్డీలకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అందులో ఎక్కువ వడ్డీ అందించే సంస్థలు, ఏడాదిలో వాటి వడ్డీరేట్లను కింద తెలియజేశాం.యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.50% నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.50%సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.10% ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.10% శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.05% శ్రీరామ్ ఫైనాన్స్ - 9.07% వరకు (మహిళలకు)బజాజ్ ఫైనాన్స్ - 8.65% వరకుఇండస్ ఇండ్ బ్యాంక్ - 8.25%సౌత్ ఇండియన్ బ్యాంక్ - 7.75%ఈ రేట్లు ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నిబంధనలకు లోబడి ఉంటాయి. ఇన్వెస్టర్లు ఎంచుకునే కాలపరిమితి, వారి పెట్టుబడిని బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చు.ఇదీ చదవండి: అదానీపై కేసు ఎఫెక్ట్.. రూ.6,216 కోట్ల డీల్ రద్దు?9.5 శాతం వడ్డీ ఇస్తున్న మనీ యాప్‘సూపర్.మనీ’ యాప్ ఎఫ్డీపై 9.5 శాతం వడ్డీ అందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఆర్బీఐ గుర్తింపు కలిగిన ఏ ఆర్థిక సంస్థలో ఎఫ్డీ ద్వారా పెట్టుబడి పెట్టినా రూ.5 లక్షల వరకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) బీమా అందిస్తుంది. అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అందుకు సంబంధిత బ్యాంకు/ ఆర్థిక సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి రూ.5 లక్షలలోపు ఎప్డీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నవారు అధిక వడ్డీలిచ్చే బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వంటి విభిన్న మార్గాలను ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
తుక్కు విక్రయంతో రూ.4.5 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు), ఆర్థిక సంస్థలు తుక్కు విక్రయం ద్వారా రూ.4.5 కోట్లు సమకూర్చుకున్నాయి. అక్టోబర్ 2–31 తేదీల మధ్య కేంద్ర ఆర్థిక శాఖ స్వచ్ఛత కార్యక్రమాన్ని (ప్రత్యేక ప్రచారం 4.0) చేపట్టింది.కస్టమర్ అనుకూల చర్యలు, వసతిని మెరుగ్గా వినియోగించుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకోవడం, తుక్కును వదిలించుకోవడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, బీమా సంస్థలతోపాటు, నాబార్డ్, సిడ్బీ, ఎగ్జి మ్ బ్యాంక్, ఎన్‌హెచ్‌బీ, ఐఐఎఫ్‌సీఎల్ ఇందులో పాల్గొన్నాయి.వ్యర్థాలను వదిలించుకోవడం ద్వారా 11.79 లక్షల చదరపు అడుగుల వసతి అదనంగా వినియోగంలోకి వచ్చిందని, రూ.4.50 కోట్లు సమకూరాయని కేంద్ర ఆర్థిక సేవల విభాగం ప్రకటించింది. ప్రజల ఫిర్యాదులు, అప్పీళ్లు పరిష్కరించినట్టు, ప్రధానమంత్రి కార్యాలయం, ఎంపీల సూచనలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. -
ఆర్థిక సేవల్లో ఏఐ, జెనరేటివ్ ఏఐ కీలకం
న్యూఢిల్లీ: దేశంలో 90 శాతం ఆర్థిక సంస్థలు కృత్రిమ మేథ (ఏఐ)కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. జెనరేటివ్ ఏఐని ఆవిష్కరణలకు కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంగా పేర్కొంది. డేటా అనలైటిక్స్ సైతం కీలకంగా మారుతున్నట్టు 74 శాతం ఆర్థిక సంస్థలు పీడబ్ల్యూసీ ఇండియా సర్వేలో భాగంగా వెల్లడించాయి. నిర్ణయాలు తీసుకోవడంలో దీని సమగ్రమైన ప్రాధాన్యతను వెల్లడించాయి. ఈ సర్వేలో 31 బ్యాంక్‌లు, బీమా సంస్థలు, ఫిన్టెక్లో తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.పరిశ్రమ అభిప్రాయాలు.. » కస్టమర్లను సొంతం చేసుకోవడం, వారికి మెరుగైన అనుభవాన్ని ఇవ్వడం నూతన ఆవిష్కరణలకు కీలకమని 84 శాతం సంస్థలు తెలిపాయి. » ఉత్పత్తుల పంపిణీ అన్నది ఆవిష్కరణలకు కీలకమని 50 శాతం సంస్థలు పేర్కొన్నాయి. » రిస్క్‌ను పరిమితం చేయడం, మారుతున్న నియంత్రపరమైన నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం కీలకమైనవిగా 65 శాతం సంస్థలు చెప్పాయి. ఆవిష్కరణల విషయంలో నియంత్రణ పరమైన అవరోధాలను అధిగమించడం కీలకమని తెలిపాయి. » ప్రధానంగా అంతర్గత చర్యల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని 45 శాతం ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. ‘‘ఫిన్‌టెక్ పరిశ్రమ అభివృద్ధి చెందే క్రమంలో వృద్ధికి.. డిజిటల్ భద్రత, నియంత్రణపరమైన నిబంధనల అమలుకు మధ్య సమతూకం అవసరం. నిబంధనల అమలు భాగస్వామ్యాల ద్వారా మారుతున్న నియంత్రపరమైన మార్పులను అధిగమించొచ్చు’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ మిహిర్ గాంధీ తెలిపారు. -
ఎంఎస్ఎంఈలకు దన్నుగా నిలవండి
ముంబై: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)పై మరింత సానుకూల ధోరణితో వ్యవహరించాలని ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ సూచించారు. ఎకానమీలో కీలక పాత్ర పోషించే ఈ పరిశ్రమకు మద్దతుగా నిల్చే క్రమంలో రుణాల పునర్వ్యవస్థీకరణ, గ్రేస్ పీరియడ్ ఇవ్వడం తదితర చర్యల రూపంలో తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.విదేశీ మారక డీలర్ల అసోసియేషన్ (ఫెడాయ్) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్వామినాథన్ ఈ విషయాలు తెలిపారు. తక్కువ వడ్డీలకు రుణాలు దొరక్కపోవడం, చెల్లింపుల్లో జాప్యాలు, మౌలికసదుపాయాలపరమైన సమస్యలు మొదలైన అనేక సవాళ్లను ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చిన్న సంస్థలు ఎకానమీకి వెన్నెముకలా మాత్రమే కాకుండా వృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉద్యోగాల కల్పనకు చోదకాలుగా కూడా ఉంటున్నాయని స్వామినాథన్ వివరించారు.అయితే, ఈ సంస్థలు వృద్ధిలోకి రావాలంటే ఆర్థిక రంగం వినూత్న పరిష్కారమార్గాలతో వాటికి తగు మద్దతు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిర్దిష్ట మద్దతు కల్పించడం ద్వారా ఎంఎస్ఎంఈ ఎగుమతులు పెరగడంలో ఆర్థిక రంగం కీలక పాత్ర పోషించగలదని స్వామినాథన్ వివరించారు.ఫైనాన్స్, ఫ్యాక్టరింగ్, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ వంటి సంప్రదాయ ప్రోడక్టులతో పాటు ఎగుమతులకు రుణ బీమా, కరెన్సీ రిస్క్ హెడ్జింగ్ సొల్యూషన్స్ వంటివి ఆఫర్ చేయొచ్చని పేర్కొన్నారు. చెల్లింపులపరమైన డిఫాల్ట్‌లు, కరెన్సీ హెచ్చుతగ్గుల సవాళ్ల నుంచి ఇలాంటివి రక్షణ కల్పించడంతో పాటు అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లలో విస్తరించేందుకు ఎంఎస్ఎంఈలకు ఆత్మవిశ్వాసం ఇవ్వగలవని స్వామినాథన్ పేర్కొన్నారు. -
అధిక చార్జీల రిఫండ్
ముంబై: కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ విధింపు విషయంలో అసమంజస విధానాలను పాటిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన రిజర్వ్ బ్యాంక్ .. దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా వాటిని ఆదేశించింది. అలా అధికంగా వసూలు చేసిన వడ్డీలు, చార్జీలను కస్టమర్లకు తిరిగివ్వాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది. పలు నియంత్రిత సంస్థలను (ఆర్ఈ) పరిశీలించిన మీదట వడ్డీ విషయంలో కొన్ని సంస్థలు అసమంజస విధానాలు పాటిస్తున్నాయని గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. కొన్ని ఆర్ఈలు వాస్తవంగా రుణాన్ని విడుదల చేసిన తేదీ నుంచి కాకుండా రుణాన్ని మంజూరు చేసిన తేదీ నుంచి లేదా రుణ ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి వడ్డీ విధిస్తున్నాయని పేర్కొంది. -
గో ఫస్ట్‌కు ఎన్సీఎల్టీలో ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌కి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్టీ) కొంత ఊరట లభించింది. కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియను (సీఐఆర్‌పీ) ముగించేందుకు గడువును ఎన్సీఎల్టీ మరో 60 రోజుల పాటు పెంచింది. పరిష్కార నిపుణుడు (ఆర్పీ) దివాకర్ మహేశ్వరి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గో ఫస్ట్‌పై మూడు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు, ధరావత్తును కూడా డిపాజిట్ చేసినట్లు మహేశ్వరి తెలిపారు. దేశీ విమానయాన సంస్థ స్పైస్‌జెట్, షార్జాకి చెందిన స్కై వన్, ఆఫ్రికన్ సంస్థ సాఫ్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిలో ఉన్నాయి. ఇవి త్వరలోనే తమ ప్రణాళికలను సమర్పించే అవకాశం ఉందని మహేశ్వరి పేర్కొన్నారు. గో ఫస్ట్ గతేడాది మే 3 నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. స్వచ్ఛందంగా దివాలా పరిష్కార ప్రక్రియ చేపట్టాలని కోరుతూ మే 10న ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. గో ఫస్ట్ దివాలా పరిష్కార ప్రక్రియ డెడ్‌లైన్‌ను ఎన్సీఎల్టీ పొడిగించడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్ 23న 90 రోజుల పాటు పొడిగించగా.. ఆ డెడ్‌లైన్ ఫిబ్రవరి 4తో ముగిసింది. దివాలా కోడ్ కింద సీఐఆర్‌పీని గరిష్టంగా 330 రోజుల్లోగా పూర్తి చేయాలి. -
ఆర్బీఐ, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల నుంచి కేంద్రానికి రూ.70,000 కోట్లు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల (ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్) ద్వారా ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.70,000 కోట్ల డివిడెండ్‌ను పొందవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ మేరకు అంచనాలు ఉండవచ్చన్నది సమాచారం. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషనల్స్ నుంచి రూ.48,000 కోట్ల డివిడెండ్లను కేంద్ర బడ్జెట్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఈ మొత్తం లక్ష్యాన్ని మించి వనగూడాయి. ఒక్క ఆర్బీఐ రూ.87,416 కోట్ల డివిడెండ్‌ను అందించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఇదే సానుకూల అంకెలు వచ్చాయి. దీనితో 2023–24 కన్నా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీ డివిడెండ్లు వెలువడుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి 2023–24లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు జీడీపీలో 5.9 శాతంగా బడ్జెట్ అంచనా. 2025–26లో దీనిని 4.5 శాతానికి తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 5.4 శాతంగా ద్రవ్యలోటు ఉండాలన్నది ప్రభుత్వ రోడ్‌మ్యాప్స్‌లో భాగంగా ఉంది. -
బ్యాంకులకూ ముప్పు తప్పదా? హెచ్చరిస్తున్న జెరోధా సీఈవో నితిన్ కామత్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ముప్పు పొంచి ఉందా.. విస్తృతమవుతున్న డీప్ ఫేక్‌లు బ్యాంకులనూ బురిడీ కొట్టిస్తాయా? అవుననే హెచ్చరిస్తున్నారు ప్రముఖ స్టాక్ బ్రోకరేజీ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బ్యాంకులకు ఎదురుకానున్న సమస్యలను తెలియజేస్తూ ఆయనో వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విస్తృతమైంది. ఈ క్రమంలోనే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఈ టెక్నాలజీని తమ కార్యకలాపాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. అయితే ఏఐ టెక్నాలజీని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. సెలబ్రిటీల డీప్ ఫేక్‌లు సృష్టిస్తున్నారు. ఇది ఇక్కడికే పరిమితం కాదని, పెరుగుతున్న ముప్పును హైలైట్ చేస్తూ నితిన్ కామత్ ‘ఎక్స్’లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. డీప్‌ఫేక్ కస్టమర్ గుర్తింపులను ధ్రువీకరించడంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలియజేశారు. నిజమా.. ఏఐ కల్పితమా? ప్రస్తుతం కస్టమర్లు నేరుగా బ్యాంకులకు, కార్యాలయాలకు వెళ్లడం తగ్గిపోయింది. అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. ప్రస్తుతం బ్యాంకులు డిజిలాకర్ లేదా ఆధార్‌ని ఉపయోగించి కస్టమర్ల ఐడీ, అడ్రస్ ప్రూఫ్ డేటాను బ్యాంకులు పొందుతున్నాయి. ఇక ఖాతాను తెరిచే వ్యక్తితో ఈ ఐడీని వెబ్‌క్యామ్ ద్వారా నిర్ధారించుకుంటున్నాయి. అయితే డీప్‌ఫేక్‌లు పెరుగుతున్న కొద్దీ అవతలి వైపు ఉన్న వ్యక్తి నిజమా లేదా ఏఐ కల్పితమా అన్నది ధ్రువీకరించడం కష్టమవుతుందని తాను భావిస్తున్నట్లు నితిన్ కామత్ పేర్కొన్నారు. ఆన్‌బోర్డింగ్ సమయంలో మరింత కఠినమైన నియంత్రణ అవసరాలు ఉన్న బ్యాంకులకు ఈ సమస్య మరింత పెద్దదిగా మారుతుందన్నారు. ఇది కూడా చదవండి: మస్క్ వారి మరమనిషి మరింత కొత్తగా.. టెస్లా రోబో 2.0! ఈ ముప్పును అధిగమించడానికి రానున్న రోజుల్లో ఎలాంటి నిబంధనలు రూపొందిస్తారు.. ఖాతాలు తెరవాలంటే నేరుగా బ్యాంకులకే వెళ్లాల్సిన రోజులు మళ్లీ వస్తాయా అన్నది చూడాలి. వీడియో చివరిలో నితిన్ కామత్ ‘ఇక్కడ ఉన్నది నేను కాదు.. ఇది డీప్ ఫేక్’ అంటూ చమత్కరించారు. The rise of AI technology and deepfakes pose a large risk to the financial services industry. The tipping point for Indian financial services businesses was when onboarding became completely digital, thanks to Aadhaar, etc. For businesses onboarding a new customer, an important… pic.twitter.com/DI9Z1Q3jxY — Nithin Kamath (@Nithin0dha) December 13, 2023 -
అంబానీ మరో సంచలన నిర్ణయం: జూలై 20 ముహూర్తం
ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో కీలక అడుగు వేయబోతున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ంగ్కు సిద్దమవుతున్నారు. మాతృ సంస్థ రిలయన్స్ గ్రూపు నుంచి విడిపోయేందుకు ఇప్పటికేఎన్సీఎల్టీ ఆమోదం పొందింది. రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐఎల్) కొత్త ఈక్విటీ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో పొందేందుకు అర్హులైన కంపెనీ ఈక్విటీ వాటాదారులను నిర్ణయించే ఉద్దేశ్యంతో జూలై 20ని రికార్డ్ డేట్‌గా (షేర్స్ ఎలాట్మెంట్) నిర్ణయించినట్లు శనివారం తెలిపింది. ఈ స్కీం ఎఫెక్ట్ తేదీ జూలై 1, 2023 అని రెగ్యులేటర్ ఫైలింగ్‌లో రిలయన్స్ పేర్కొంది. స్కీమ్ నిబంధనలకు అనుగుణంగా, ఆర్ఎస్ఐఎల్ ఈక్విటీ షేరును రూ. 10 ముఖ విలువతో జారీ చేస్తుంది. (HDFC Bank: హెచ్డీఎఫ్సీ బ్యాంక్: విలీనం తరువాత లక్షలాది కస్టమర్లకు భారీ షాక్!) ఈ మార్చిలో, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ తన ఆర్థిక సేవల సంస్థను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐఎల్)లుగా విడదీసి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్ఎల్)గా పేరు మార్చాలని యోచిస్తున్నట్లు తెలిపింది. అలాగే హితేష్ కుమార్ సేథీ కొత్త సంస్థకు సీఎండీగా ఉంటారని కూడా ఆర్ఎస్ఐఎల్ ప్రకటించింది. (డైనమిక్ లేడీ నదియా: కిల్లర్ మూవ్‌తో రూ. 300కోట్ల-8వేల కోట్లకు) జియో ఫైనాన్షియల్ నికర విలువ రూ. 1,50,000 కోట్లు. ఈ లిస్టింగ్ ద్వారా కంపెనీకి చెందిన 36 లక్షల మంది వాటాదారులకు లాభాల పంట పడనుంది. మరోవైపు గ్లోబల్ బ్రోకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ ప్రకారం, జియో ఫైనాన్షియల్ షేర్ ధర రూ. 189 ఉంటుందని అంచనా. ఈ డీమెర్జర్, లిస్టంగ్ తరువాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశంలో ఐదో అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరించనుంది. అంతేకాదు పేటీఎం, బజాజ్ ఫైనాన్స్‌తో గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. -
మౌలికానికి బ్యాంకింగ్ సహకారం కీలకం
న్యూఢిల్లీ: మౌలిక రంగ లక్ష్యాల సాధనకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సహకారం ఎంతో అవసరమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న రూ. 111 లక్షల కోట్ల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ప్రాజెక్ట్ లక్ష్యాల సాధనకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇన్ఫ్రా ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా తగిన ప్రొడక్టులకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) 18వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జోషి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► దేశంలో అన్ని రంగాల పురోగతికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక అనుసంధానకర్త లాంటిది. అందువల్ల ఈ రంగం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎంఐ) వంటి ఇతర కార్యక్రమాలతో పాటు భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఎన్ఐపీ కీలక పాత్ర పోషించనుంది. ► పీఎం గతిశక్తి పోర్టల్ ఆధ్వర్యంలో మొత్తం రూ.111 లక్షల కోట్ల కేటాయింపులతో ఎన్ఐపీ ప్రాజెక్టులను పర్యవేక్షించడం జరుగుతోంది. 6,800 ప్రాజెక్ట్‌లతో ప్రారంభమైన ఎన్ఐపీ, ఇప్పుడు 34 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెక్టార్లను కవర్ చేస్తూ 9,000 ప్రాజెక్ట్‌లకు విస్తరించింది. ► ఈ ప్రాజెక్టులకు పెట్టుబడిలో 44 శాతం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల ద్వారా నిధులు సమకూరుస్తున్నా యి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు దాదాపు 30 శాతం వాటాతో ఈ ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నాం. ► ఎన్ఐపీ లక్ష్యాన్ని సాధించడానికి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు క్రియాశీలంగా, పరస్పర సహకారంతో పనిచేసే విధానాన్ని అవలంబించాలి. అప్పుడే పెట్టుబడుల అవసరాలు తీరతాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు సకాలంలో అందుబాటులోకి వస్తాయి. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కోసం అవసరమైన బాండ్లు, డెరివేటివ్ మార్కెట్ల అభివృద్ధిసహా దేశంలో దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణ వనరుల అభివృద్ధికి 2021లో ప్రభుత్వం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ)ని ఏర్పాటు చేసింది. ఎన్ఏబీఎఫ్ఐడీ కోసం ప్రభుత్వం రూ. 20,000 కోట్ల ఈక్విటీ మూలధనం,రూ. 5,000 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసింది. మౌలికరంగంలో పురోగతికి ఈ చర్య ఎంతో దోహదపడింది. ► మౌలిక రంగం పురోగతికి పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలు వ్యాపారాన్ని విస్తరించడానికి ఒకదాని ప్రయత్నాలకు మరొకటి ప్రభావితం కాకుండా, ప్రత్యామ్నాయంగా ఈక్విటీ– డెట్ ప్రొడక్టుల మిశ్రమాన్ని ప్రాజెక్టులకు అందించడం ముఖ్యం. ► ప్రాజెక్ట్‌ల వాస్తవ అవసరాలతో అనుసంధానమైన రుణ ప్రొడక్టుల రూపకల్పన అవసరం. ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న సబ్ సెక్టార్లలో ప్రాజెక్టులకు సేవలందించే సంస్థాగత సామర్థ్యాన్ని నిరంతరం మందింపు చేయాలి. ఇక్కడ ప్రభుత్వ రంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను తట్టుకుంటున్న ఎకానమీ భారత్ ఎకానమీ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులను తట్టుకొని పటిష్టంగా నిలబడగలుగుతోందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. భారత్ ఎకానమీ 2022–23 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి ప్రపంచ బ్యాంక్ పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొన్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తున్నట్లు పేర్కొన్నారు. 10 నెలల తర్వాత నవంబర్‌లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు (5.8 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే టోకు ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్టం 8.39 శాతానికి దిగివచ్చిన విషయాన్నీ గుర్తుచేశారు. -
రఘురామకృష్ణరాజుపై సీబీఐ చార్జ్‌షీట్
సాక్షి, అమరావతి: ఆర్థిక సంస్థలు, బ్యాంకులను మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులోని ట్యూటీకొరిన్‌లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇండ్ భారత్ థర్మల్ పవర్ మద్రాస్ లిమిటెడ్ అనే కంపెనీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసినందున 2019 ఏప్రిల్ 29న సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.947.71 కోట్ల మేరకు మోసం చేసిన ఇండ్ భారత్ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణరాజుతో సహా ఆ కంపెనీ డైరెక్టర్లు, అనుబంధ కంపెనీలు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లు కలిపి మొత్తం 16 మందిపై న్యూ ఢిల్లీలోని సీబీఐ న్యాయస్థానంలో శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట ఆర్థిక సంస్థలను రఘురామకృష్ణరాజు ఎలా మోసం చేశారనేది సీబీఐ ఓ ప్రకటనలో సవివరంగా వెల్లడించింది. ఇండ్ భారత్ పవర్ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణం రాజు పక్కా పన్నాగంతోనే బ్యాంకులను మోసం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. తమిళనాడులోని ట్యూటికోరిన్లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆర్థిక సంస్థల కన్సార్షియం నుంచి రూ.947.71 కోట్లు రుణం తీసుకున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ), ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్)లతో కూడిన కన్సార్షియం రుణం మంజూరు చేసింది. కానీ రఘురామకృష్ణరాజు తమిళనాడులో థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలేదు. రుణ ఒప్పంద నిబంధనలను పాటించలేదు. రుణం ద్వారా తీసుకున్న నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారు. ఆ నిధులను కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు చెల్లించేందుకుగాను బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అనంతరం ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు హామీగా చూపించి ఆ రెండు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వాటితో కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించినట్టుగా చూపించారు. ఆ తర్వాత ఆ రెండు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించనే లేదు. దాంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లను ఆ రుణం కింద జమ చేసుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం రుణం ఇచ్చిన ఆర్థిక సంస్థల కన్సార్షియం పూర్తిగా మోసపోయింది. ఆ విధంగా ఆర్థిక సంస్థల కన్సార్షియంను రఘురామకృష్ణరాజు రూ.947.71 కోట్ల మేర మోసం చేశారని సీబీఐ దర్యాప్తులో నిగ్గు తేలింది. పూర్తి ఆధారాలు సేకరించిన సీబీఐ ఈ కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో సంచలన చర్యలకు ఉపక్రమించనుందని సమాచారం. సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న నిందితులు ► ఇండ్ భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్ కంపెనీ,కె.రఘురామకృష్ణరాజు, చైర్మన్, ఎండీ, ఇండ్ ► భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్ కంపెనీ మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్, ఇండ్ భారత్ పవర్ ► మద్రాస్ లిమిటెడ్ కంపెనీ ► ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ ► ఆర్కే ఎనర్జీ లిమిటెడ్ ► శ్రీబా సీబేస్ ప్రైవేట్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ ఎనర్జీ ఉత్కళ్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ పవర్ కమాడిటీస్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ ఎనర్జీస్ మహారాష్ట్ర లిమిటెడ్ ► ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ ► సోకేయి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ► వై.నాగార్జున రావు, ఎండీ, సోకేయి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ► ఎం.శ్రీనివాసుల రెడ్డి, చార్టెడ్ అకౌంటెంట్ ► ప్రవీణ్ కుమార్ జబద్, చార్టెడ్ అకౌంటెంట్ ► సి.వేణు, ఇండ్ భారత్ గ్రూప్స్ చార్టెడ్ అకౌంటెంట్ -
మౌలిక రంగానికి రుణ లభ్యత అంతంతే!
ముంబై: బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ–ఐఎఫ్‌సీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2021 ఏప్రిల్–జూన్) మౌలిక రంగం ప్రాజెక్టులకు ఇచ్చిన రుణం అంతంతేనని ఇక్రా రేటింగ్స్ నివేదిక ఒకటి పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ సవాళ్లు దీనికి ప్రధాన కారణమని సంస్థ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. అయితే మౌలిక రంగం పరోగతిపై సమీప భవిష్యత్తులో ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తుందని మధ్య కాలికంగా ఈ విభాగం గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉందని వివరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... - 2021 మర్చి 31 నాటికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ–ఐఎఫ్సీలు కలిసి మౌలిక రంగానికి ఇచ్చిన రుణ అంచనా రూ.24.7 లక్షల కోట్లు. 2020 ఇదే కాలంతో పోల్చితే ఇది 10 శాతం తక్కువ. జూన్ 30 వరకూ మౌలిక రంగానికి రుణ పరిమాణం బలహీనంగానే ఉంది. కరోనా సెకండ్‌వేవ్ ప్రేరిత సవాళ్లు దీనికి ప్రధాన కారణం. - ఒక్క ఐఎఫ్‌సీల విషయంలో మౌలిక రంగానికి గత ఐదేళ్లలో రుణం పెరుగుతోంది. 2021మార్చి 31 వతేదీ నాటికి 54 శాతం పురోగమించింది. అయితే బ్యాంకుల షేర్ గడచిన ఐదేళ్లలో 61 శాతం నుంచి నుంచి 46శాతానికి పడిపోయింది. - 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2024– 2025 ఆర్థిక సంవత్సరం వరకూ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) కింద రూ.111 లక్షల కోట్లకు పైగా మౌలిక రంగం పెట్టుబడులపై కేంద్రం దృష్టి సారించడం ఈ రంగానికి భవిష్యత్ సానుకూల అంశాల్లో కీలకమైనది. - ప్రస్తుతం ఎన్బీఎఫ్సీ–ఐఎఫ్‌సీల ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పరిస్థితులు బాగున్నాయి. స్వల్ప కాలిక రుణాలకు సంబంధించి లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడ్డాయి. - ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీల విషయానికి వస్తే, ప్రభుత్వ రంగంలో సంస్థలు లాభాల బాటకు మళ్లాయి. మొండిబకాయిల (ఎన్పీఏ) వాటా తగ్గింది. రుణ వ్యయాలు తక్కువగా ఉన్నాయి. - ఎన్బీఎఫ్సీ–ఐఎఫ్‌సీల రుణ నాణ్యత మెరుగుదల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. -
నచ్చినోళ్లకు రుణం... బ్యాంకింగ్‌కు భారం
న్యూఢిల్లీ: క్రోనీ రుణ మంజూరీలకు దూరంగా ఉండాలని, అధిక నాణ్యత రుణ మంజూరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం ఫైనాన్షియల్ సంస్థలకు మంగళవారం పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి సంబంధించి విలువైన ఆస్తుల సృష్టికి అధిక నాణ్యతతో కూడిన రుణాలు దోహదపడతాయని అన్నారు. తద్వారానే దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా నడిపించవచ్చని సూచించారు. నచ్చిన వాళ్లకు లేదా రాజకీయ నాయకుల ప్రభావానికి గురై ఇతర ఎటువంటి అంశాలనూ పరిశీలనలోకి తీసుకోకుండా మంజూరు చేసే రుణాలను ‘క్రోనీ లెండింగ్’గా పరిగణిస్తారు. ఇండస్ట్రీ చాంబర్ ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ►నాణ్యత లేని పేలవ రుణ మంజూరీ సమస్యను 1990 నుంచీ భారత్ బ్యాంకింగ్ ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి బడా రుణాల విషయంలో ఈ పరిస్థితి చోటుచేసుకుంటోంది. రుణాలను సకాలంలో తీర్చుతున్న (క్రెడిట్ వర్తీనెస్) వారికి రుణ మంజూరీలు సజావుగా లేవు. అదే సమయంలో క్రోనీ క్యాపిటలిస్టుల విషయంలో రుణ మంజూరీలు సునాయాసంగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్‌లో మొండిబకాయిలు పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. ►క్రెడిట్‌వర్తీ లేని ఒక వ్యక్తికి రుణం మంజూరు చేయడం అంటే, క్రెడివర్తీ కలిగిన రుణ గ్రహీత రుణం పొందడంలో ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే భావించాల్సి ఉంటుంది. ►వృద్ధి బాటలో మూలధనాన్ని తగిన రుణ గ్రహీతకు అందజేయడం ఫైనాన్షియల్ రంగం విధి. ►మౌలిక రంగంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితలు కూడా బ్యాంకింగ్ మొండిబకాయిలు పెరిగిపోవడానికి కారణం. అధిక నాణ్యతతో కూడిన రుణాల మంజూరీల విషయంలో ఫైనాన్షియల్ రంగం బాధ్యతా ఉంది. ప్రత్యేకించి మౌలిక రంగంలో రుణాల విషయంలో ‘క్రోనీ’ లెండింగ్‌కు ఎంతమాత్రం స్థానం ఉండకూడదు. ఫైనాన్షియల్ రంగ ప్రధాన లక్ష్యంలో ఈ అంశం ఉండాలి. ►ఫైనాన్షియల్ రంగంలో కార్పొరేట్ పాలనా విధానం కూడా మెరుగుపడాలి. ఇది అధిక నాణ్యత కలిగిన రుణ మంజూరీలకు దోహదపడుతుంది. సీనియర్ మేనేజ్మెంట్కు ప్రోత్సాహకాలకు రుణ నాణ్యత ప్రాతిపదికగా ఉండాలి. దివాలా చట్రంలో 4000 కంపెనీలు: సాహూ కార్యక్రమంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఎస్ సాహూ మాట్లాడుతూ, దివాలా చట్రంలో ప్రస్తుతం 4,000 కంపెనీలు ఉన్నాయన్నారు. ఇందులో 2,000 కంపెనీలకు సంబంధించి దివాల ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీల విలువ లిక్విడేషన్ కన్నా అధికంగా ఉందనీ తెలిపారు. కొన్ని కంపెనీల విషయంలో విలువలు లిక్విడేషన్ వ్యాలూకన్నా 300 శాతం వరకూ అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. -
పోస్ట్ బ్యాంకు నుంచి రుణాలు
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో జట్టు కట్టడం ద్వారా రుణాలు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు తదితర ఆర్థిక ఉత్పత్తులను అందించేందుకు సన్నద్ధమవుతోంది. థర్డ్ పార్టీ టై అప్ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంకు తరఫున రుణాలను ఆఫర్ చేయనుంది. అలాగే, బీమా ఉత్పత్తులను అందించేందుకు బజాజ్ అలియెంజ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 21న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 650 శాఖల్లో ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ‘‘1.55 లక్షల తపాలా శాఖలు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో(ఐపీపీబీ) అనుసంధానం అవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1.3 లక్షల తపాలా కార్యాలయాలున్నాయి. వీటి ద్వారా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలు అందుతాయి’’ అని ఆ వర్గాలు తెలియజేశాయి. పేమెంట్స్ బ్యాంకులు రూ.లక్ష వరకు డిపాజిట్లను సేకరించొచ్చు. ఇతర బ్యాంకుల ఖాతాలకు నగదు బదిలీ సేవలను అందించవచ్చు. కానీ రుణాలు, క్రెడిట్ కార్డు సేవలను అందించేందుకు అనుమతి లేదు. మూడో పక్షంతో ఒప్పందం చేసుకుని వాటి తరఫున ఇతర ఆర్థిక సేవలను అందించొచ్చు. పోస్ట్‌మ్యాన్ పేరు ‘పోస్ట్ పర్సన్’: పోస్ట్‌మ్యాన్‌ను పోస్ట్ పర్సన్‌గా మార్చే ప్రతిపాదను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. లింగపరమైన సమానత్వం కోసం పోస్ట్‌మ్యాన్‌కు బదులుగా పోస్ట్‌పర్సన్ అని పిల వాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పార్లమెంటరీ ప్యానల్ చేసిన సిఫారసే ఇందుకు మూలం. పోస్ట్ ఉమన్ కూడా పనిచేస్తున్నందున పోస్ట్ పర్సన్ అని పిలవడమే సముచితమని పేర్కొంది. -
వ్యాపారులకిచ్చే గృహ రుణాలపై జాగ్రత్త!
ముంబై: స్వయం ఉపాధి పొందే వ్యాపార వర్గాలకు గృహ రుణాలిచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు (హెచ్ఎఫ్సీ) రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సూచించింది. ఈ రిస్కీ విభాగంలో మొండిబాకీలు భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని ఒక నివేదికలో తెలియజేసింది. గృహ రుణాల మంజూరులో అధిక వృద్ధి సాధించే దిశగా ఆర్థిక సంస్థలు.. ఈ విభాగం వర్గాలకు రుణాలివ్వడంపై మరింతగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో క్రిసిల్ నివేదిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నాలుగేళ్ల క్రితం హెచ్ఎఫ్సీల పోర్ట్‌ఫోలియోలో.. స్వయం ఉపాధి పొందే గృహ రుణగ్రహీతల వాటా 20 శాతంగా ఉండగా... ప్రస్తుతం అది 30 శాతానికి పెరిగిందని క్రిసిల్ పేర్కొంది. ఇదే సమయంలో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 0.40 శాతం నుంచి రెట్టింపై 1.1 శాతానికి పెరిగింది. ఇది గణనీయమైన ప్రభావం చూపకపోయినప్పటికీ.. ఈ విభాగం విషయంలో కాస్త జాగ్రత్త అవసరమని క్రిసిల్ తెలిపింది. అందరికీ గృహాలు సమకూర్చే దిశగా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ప్రోత్సాహక చర్యలు తీసుకుంటుండంతో అది గృహ రుణాల వృద్ధికి దోహదపడుతున్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. స్వయం ఉపాధి పొం దేవారి ఆదాయాలన్నీ అంచనాలను బట్టే ఉంటాయి కనక జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. -
ఆర్థిక సంస్థల్లో రాష్ట్రానికి 12వ స్థానం
ఆరో గణన వివరాలను విడుదల చేసిన మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంస్థల సంఖ్యలో రాష్ట్రం దేశంలో 12వ స్థానంలో ఉంది. ఈ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు లేదా ఉపాధి పొందుతున్న వారి సంఖ్యలో పదో స్థానంలో ఉంది. జాతీయ స్థాయి లో నిర్వహించిన ఆరో ఆర్థిక గణన ప్రకారం ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిం చింది. దేశవ్యాప్తంగా 2013 ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఈ గణన నిర్వహించారు. అంత కు ముందు 2005లో నిర్వహించిన అయిదో ఆర్థిక గణనతో పోలిస్తే తెలంగాణలో ఆర్థిక సంస్థలు 77.94శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఆయా ప్రాంత పరిధిలో ఉన్న ఆర్థిక సంస్థలు, యూనిట్లను లెక్కించటమే ఆర్థిక గణన. జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ గణన ప్రకారం సరుకుల ఉత్పత్తి లేదా సేవల ద్వారా ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే వాటిని ఆర్థిక సంస్థలుగా పరిగణించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళ వారం సచివాలయంలో ఈ గణాం కాల సీడీ, పుస్తకాలు, రాష్ట్ర ప్రణా ళిక విభాగం రూపొందించిన వ్యవ సాయ విస్తీర్ణం, ఉత్పత్తికి సంబం ధించి మూడో ముందస్తు అంచనా గణాంకాలను విడుదల చేశారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (ట్రాక్) ఆ«ధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి వనరులను సమగ్రంగా గుర్తించే ప్రాజెక్టు అమలవుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా పరిధిలోని హుజూ రాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు వివరాలను ప్రణాళిక విభాగం విడు దల చేసింది. ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య, కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర అర్థగణాంక విభాగం డైరెక్టర్ ఎ సుదర్శన్‌రెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
చెన్నై కోసం ఆర్థిక సంస్థల సేవలు
చెన్నై వరదల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడానికి ఆర్థిక సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ఇందుకోసం బీమా కంపెనీలు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటే, బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు పెనాల్టీలను రద్దు చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోయినా ఎటువంటి పెనాల్టీలు విధించమని ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు ప్రకటించాయి. అలాగే బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్స్‌ను త్వరితగతిన పరిష్కరించడానికి 1800 209 7072 అనే హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. -
ఏటీ చెల్లింపులో పోటాపోటీ
- అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల్లో ఆర్థిక సంస్థల ముందంజ - ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ రెండంకెల వృద్ధి ముంబై: మార్చి త్రైమాసికం ముందస్తు పన్ను చెల్లింపుల్లో ఆర్థిక సంస్థలు ముందున్నాయి. ఎస్బీఐ, ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ వంటి సంస్థలు ఈ విషయంలో రెండంకెల వృద్ధి రేటును నమోదుచేశాయి. వివరాల్లోకి వెళితే... ⇒ ఎస్బీఐ 23 శాతం అధికంగా రూ.1,794 కోట్ల ముందస్తు పన్ను చెల్లించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ చెల్లింపు రూ.1,456 కోట్లు. ⇒ డిసెంబర్ క్వార్టర్లో బ్యాంక్ చెల్లింపులు రూ.1,425 కోట్లు. రుణ వృద్ధి బలహీనంగా ఉన్నప్పటికీ ముందుస్తు పన్ను చెల్లింపుల్లో బ్యాంక్ ముందుండడం గమనార్హం. ⇒ ఎల్ఐసీ ఈ విషయంలో 15% అధికంగా చెల్లించింది. ఈ విలువ రూ. 1,280 కోట్ల నుంచి రూ.1,470 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో చెల్లింపులు రూ.5,100 కోట్ల నుంచి రూ.5,880 కోట్లకు చేరాయి. ⇒ ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ 23 శాతం తక్కువగా రూ.230 కోట్లను మాత్రమే చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ చెల్లింపు రూ. 298 కోట్లు. ⇒ హెచ్డీఎఫ్సీ 10 శాతం అధికంగా తమ చెల్లింపులను రూ.500 కోట్ల నుంచి రూ.550 కోట్లకు పెంచింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 12.8 శాతం వృద్ధితో రూ. 2,160 కోట్ల నుంచి రూ. 2,435 కోట్లకు పెరిగింది. ⇒ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన రుణదాత నాబార్డ్ చెల్లింపులు రూ.370 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఈ విలువ రూ. 1,490 కోట్ల నుంచి రూ.1,560 కోట్లకు ఎగసింది. ⇒ ప్రైవేటు రంగంలోని యస్ బ్యాంక్ చెల్లింపులు రూ. 200 కోట్ల నుంచి రూ. 260 కోట్లకు పెరిగాయి. ⇒ యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ రూ.25 కోట్లు చెల్లించింది. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే..: అధిక ఆదాయ కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు తమ ఆదాయంపై పన్నును ఒక ఆర్థిక సంవత్సరంలో నాలుగు దఫాలుగా ముందస్తుగా చెల్లించడమే ఈ అడ్వాన్స్ ట్యాక్స్ వ్యవస్థ. ఒక నిర్ధిష్ట సమయంలో కంపెనీ పనితీరుకు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు అద్దం పడుతుంది. -
వచ్చే ఏడాది డివిడెండ్ వసూళ్ల లక్ష్యం రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ రంగ కంపెనీలు, బ్యాంకుల నుంచి రూ. లక్ష కోట్ల డివిడెండ్ వసూళ్లను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది ప్రస్తుత ఏడాది రూ.88,781 కోట్లతో పోలిస్తే దాదాపు 13% ఎక్కువ. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కనీసం 20% డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించాలి. లేకపోతే పన్ను చెల్లింపుల తర్వాత లాభాల్లో 20% ప్రభుత్వానికి ఇవ్వాలి. రూ.1,00,651 కోట్ల డివిడెండ్ వసూళ్ల లక్ష్యంలో రూ.36,174 కోట్లను ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, రూ.64,477 కోట్లను బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి ప్రభుత్వం సేకరించనుంది. కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడులలో డివిడెంట్ ఆదాయానిదే అగ్రభాగం. -
సులభంగా గృహరుణం..
త్వరలోనే వడ్డీరేట్లు దిగిరానుండటంతో బ్యాంకులు, గృహ రుణ సంస్థలు ఖాతాదారులను ఆకర్షించడానికి ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఏకంగా 20 ఏళ్లకు ఫిక్స్డ్ హోమ్‌లోన్ ప్రకటిస్తే, మరికొన్ని బ్యాంకులు బేస్‌రేటు కంటే వడ్డీరేట్లను తగ్గించడానికి వీలు లేకపోవడంతో ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులు, ప్రీక్లోజర్ చార్జీలపై మినహాయింపులతో ఆకర్షిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కొత్తగా గృహరుణం తీసుకోవాలనుకునే వారు పరిశీలించాల్సిన అంశాలపై ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం. సొంతింటి కల సాకారం చేసుకోవడవునేది చాలా క్లిష్టమైన అంశం. సరైన ఇంటిని అన్వేషించడం దగ్గర నుంచి, దానికి తగ్గ నగదును సవుకూర్చుకోవడం వరకు అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది అందుబాటు ధరలో ఉన్న ఇంటిని ఎంచుకోవడం, దీనికి తగిన నగదును సవుకూర్చుకోవడవునేవి చాలా ముఖ్యాంశాలు. ఇప్పుడు అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహరుణాలను అందిస్తున్నాయి. గృహరుణాన్ని ఇచ్చే సంస్థలో సరైన సంస్థను ఎంచుకోకపోతే సొంతింటి కల నెరవేర్చుకున్న ఆనందం ఒక్క రోజూ కూడా మిగలదు. ఇటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రుణం పొందాలంటే ఈ అంశాలే కీలకం. ఎటువంటి గృహ రుణం కావాలి మార్కెట్లో అనేక గృహ రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ గృహరుణం, ఇంటి విస్తరణకు రుణం, ఇంటి వురవ్ముతులకు రుణం, ఇంటిని తనఖా పెట్టి తీసుకునే రుణం, వుహిళల గృహరుణం, నివాసేతర గృహరుణం, స్టెప్ అప్ ఈఎంఐ, లీజ్ రెంటల్ ఫైనాన్స్ వంటి అనేక పథకాలున్నాయి. ముందుగా ఈ పథకాల్లో ఏది మీకు సరిపోతుందో పరిశీలించండి. మీరు సొంతంగా ఇంటిని నిర్మించుకుంటున్నారా లేక అపార్ట్మెంట్ తీసుకుంటున్నారా లేక ప్రస్తుతమన్న ఇంటిని విస్తరిస్తున్నారా అనేవి కీలకం. ఎందుకంటే ఇవి దేనికవి విభిన్నం. వడ్డీ రేట్ల దగ్గర నుంచి డాక్యుమెంటేషన్ల వరకు అన్నీ వూరిపోతాయి. ఎవరు తీసుకోవచ్చు వ్యక్తిగతంగా లేదా సహకార సంఘాలు, కార్పొరేట్ సంస్థలు, వివిధ సంఘాలు గృహరుణం తీసుకోవచ్చు. వ్యక్తిగత గృహరుణాల విషయూనికి వస్తే జీతం ఆదాయుంగా ఉన్న వారితో పాటు, వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు ఇలా ఆదాయుం ఉన్న ప్రతీ ఒక్కరు తీసుకోవచ్చు. సాధారణంగా ఇంటి విలువలో 80 శాతం వరకు గృహ రుణం లభిస్తుంది. పైన పేర్కొన్న వాటిలో ఏ విభాగంలోకి వస్తారన్నదాన్ని బట్టి డాక్యుమెంటేషన్, వడ్డీరేట్లు ఆధారపడి ఉంటాయి. ఎంత రుణం వస్తుంది... ఈ విషయూనికి వచ్చేసరికి గృహరుణ సంస్థలు అనేకాంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ముఖ్యంగా మీ చెల్లింపు సావుర్థ్యంతో పాటు, మీ వయసు, విద్యార్హత, మీపై ఆధారపడి జీవించే వారి సంఖ్య, అప్పులు, పొదుపు, ఆస్తులు, స్థిరంగా వచ్చే ఆదాయుం వంటి అంశాలను పరిశీలిస్తారు. అలాగే రుణం తీసుకునే వారు ఇంటిలోని ఇతర కుటుంబ సభ్యులకు ఆదాయం ఉంటే వారిద్దరూ కలసి రుణానికి దరఖాస్తు చేస్తే వురింత రుణం పొందే అవకాశంతో పాటు, సులభంగా లభిస్తుంది. రుణ కాలపరిమితి.. గృహరుణాల్లో పరిశీలించాల్సిన వాటిలో వురో ముఖ్యమైన అంశం రుణ కాలపరిమితి. సాధారణంగా అన్ని బ్యాంకులు ఏడాది నుంచి 20 ఏళ్ల కాలపరిమితిలో రుణాలను అందిస్తాయి. వురికొన్ని సంస్థలు అయితే 25 నుంచి 30 ఏళ్ల వరకు కూడా రుణాన్ని ఇస్తున్నాయి. జీతం ఆదాయుం ఉన్న వారికి 60 ఏళ్ల వరకు, అదే వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు 65 ఏళ్ల వరకు మాత్రమే రుణాన్ని ఇస్తాయి. ప్రతీ ఒక్కరు పదవీ విరవుణలోపే గృహరుణాన్ని తీర్చే విధంగా ప్రణాళిక చేసుకోవాలి. ఇవి కావాలి.. గృహరుణానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరి. కేవైసీ నిబంధనలకు అనుగుణంగా మీ నివాస, గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు ఉద్యోగస్తులు అయితే మీ జీతానికి సంబంధించిన ఆరు నెలల శాలరీ స్లిప్, అపాయింట్మెంట్ ఆర్డరు, ఫాం 16, ఒక ఏడాది బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అదే వృత్తినిపుణులు అయితే మూడేళ్ల లాభనష్టాల చిట్టా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎంచుకున్న ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇవ్వాలి. చెల్లింపు సామర్థ్యం ఇది మీ వ్యక్తిగత జీవిత అలవాట్లు, బాధ్యతలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు ఉన్న వారు నెల జీతంలో గరిష్టంగా 40 శాతం వరకు వూత్రమే ఈఎంఐ ఉండే విధంగా చూసుకోవాలి. అదే ప్రారంభంలో కుటుంబ బాధ్యతలు లేనివారు 60 శాతం వరకు చెల్లించే విధంగా ఈఎంఐ ఎంచుకోవచ్చు. ఈఎంఐ ఎంత అనేది మీరు తీసుకునే రుణం, అది చెల్లించే కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఫిక్స్డ్ ఆర్ ఫ్లోటింగ్ గృహరుణంలో ఎంచుకునే వడ్డీరేటు విధానం కూడా చాలా కీలకమైనది. సాధారణంగా బ్యాంకులు చలన (ఫ్లోటింగ్), స్థిర (ఫిక్స్డ్) వడ్డీరేట్లను ఆఫర్ చేస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకోవాలన్న విషయూనికి వస్తే... సాధారణంగా వడ్డీరేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు (అంటే ఇప్పుడున్న పరిస్థితిలాగానే ) ఫ్లోటింగ్, అదే వడ్డీరేట్లు కనిష్ట స్థాయికి చేరాయునుకున్నప్పుడు ఫిక్స్డ్ రేటుకు వెళ్లాలి. ఉదాహరణకు 1983-84 సవుయుంలో చాలా బ్యాంకులు 7.5 శాతానికే హోమ్లోన్స్ అందించాయి. అప్పుడు చాలావుంది ఫిక్స్డ్ విధానం ఎంచుకున్నారు. ఆ తర్వాత వడ్డీరేట్లు గణనీయుంగా పెరిగినా ఈఎంఐ భారం పెరగకుండా తప్పించుకున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇంళ్ళకు బ్యాంకులు ప్రత్యేక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయూ అని బ్యాంకు అధికారులను సంప్రదించండి. ఇవి పరిశీలిస్తాయి రుణానికి దరఖాస్తు చేసిన తర్వాత మంజూరు చేయూలా వద్దా అన్న అంశంపై హోమ్‌లోన్ సంస్థలు అనేక అంశాలను పరిశీలిస్తాయి. ఇందులో రెండు అంశాలు కీలకమైనవి. ఇందులో మొదటిది రుణ చెల్లింపు సావుర్థ్యం, రుణ చరిత్ర వంటివి అయితే రెండోది ఆస్తి పరిశీలన. ఎంచుకున్న ఆస్తి ఎటువంటి వివాదాలు లేకుండా సరిగా ఉందా లేదా, అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నాయూ లేదా అని పరిశీలిస్తాయి. ఈ రెండు అంశాల్లో బ్యాంకులు సంతృప్తి చెందితే మీకు రుణం మంజూరు అవుతుంది. బీమా తప్పనిసరి.. గృహరుణం తీసుకునే వారు రుణ మొత్తానికి సరిపడా బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు చాలా హోమ్‌లోన్ సంస్థలు గ్రూపు ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. బీమా తీసుకుంటే రుణం తీసుకున్న తర్వాత అనుకోని సంఘటన ఏదైనా జరిగినా.. కుటుంబ సభ్యులకు ఈ రుణం భారంగా మారదు. అటువంటి సమయంలో చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తాన్ని బీమా కంపెనీనే చెల్లిస్తుంది. సాధారణంగా ఈ బీమా పాలసీలకు ప్రీమియం ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. పాలసీకి చెల్లించాల్సిన ప్రీమియానికి కూడా రుణం లభిస్తుంది. - ఆర్. నంబిరాజన్ ఎండీ, డీహెచ్ఎఫ్ఎల్ వైశ్యా హౌసింగ్ ఫైనాన్స్ -
ఇంటి రుణం.. ఇలా సులభం
ఇల్లు కొనుక్కోవడమనేది చాలా కీలకమైన నిర్ణయం. ఇందులో బోలెడన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ఎలాంటిది తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి మొదలుకుని డౌన్పేమెంట్లు, రుణం సమకూర్చుకోవడం దాకా అనేక విషయాల గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది గృహ రుణం పొందడం. ఇతరత్రా అన్నీ సిద్ధం చేసుకుని.. లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాక.. చివరికి చేతికొచ్చే దాకా సస్పెన్సే. ఎక్కడ కొర్రీ పడుతుందోనని వర్రీనే. ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదంటే ఇంటి గురించి అనుకున్నాక.. ఒక అయిదారు నెలల ముందు నుంచే గృహ రుణం సమకూర్చుకోవడం కోసం సన్నాహాలు చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని సూత్రాలు పాటించాలి.. క్రెడిట్ నివేదిక... ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేసే ముందు క్రెడిట్ హిస్టరీ.. అంటే గతంలో తీసుకున్న రుణాలు, వాటిని తిరిగి చెల్లించిన తీరు గురించి చూస్తున్నాయి. గతంలో దేనికైనా బకాయిపడినా, ఎగ్గొట్టినా, లేటుగా చెల్లించినా అందుకు సంబంధించిన వివరాలన్నీ సిబిల్ వంటి సంస్థల దగ్గర ఉంటాయి. అవి ఇచ్చిన నివేదికలు, స్కోరును బట్టి లోన్ ఇవ్వొచ్చా లేదా అన్నది బ్యాంకులు నిర్ణయం తీసుకుంటున్నాయి. కాబట్టి, బాకీలు లాంటివేమైనా ఉంటే తీర్చి.. క్రెడిట్ రిపోర్టు, స్కోరు సరిగ్గా ఉండేలా చూసుకోవడం మంచిది. క్రెడిట్ హిస్టరీ స్వయంగా తెలుసుకోవాలంటే ఆన్లైన్లో కూడా సిబిల్ నివేదికను తీసుకోవచ్చు. ఇందుకు రూ. 470 కట్టాల్సి ఉంటుంది. అలాగే, ఇతరత్రా ఈఎంఐలు ఏమైనా ఇప్పటికే కడుతున్న పక్షంలో ముందుగా వాటిని పూర్తి చేసుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే.. మనకి ఎంత రుణం ఇవ్వాలనేది మనం ఎంత ఈఎంఐల భారం మోస్తున్నామన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇతర ఈఎంఐలు ఎక్కువైన కొద్దీ మంజూరయ్యే రుణం పరిమాణం తగ్గిపోతుంది. సాధారణంగా జీతంలో ఈఎంఐల భారం 40 శాతం మించకూడదు. బ్యాంకులు ఈ అంశాన్ని కూడా పరిగణించి రుణ మొత్తంపై నిర్ణయం తీసుకుంటాయి. బ్యాంకింగ్ అలవాట్లు మెరుగుపర్చుకోవాలి.. లోన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇతర పత్రాలతో పాటు మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా గడిచిన ఆరు నెలలు లేదా ఏడాది కాలానికి సంబంధించిన స్టేట్మెంట్ను బ్యాంకులు అడుగుతుంటాయి.మన బ్యాంకింగ్ అలవాట్లు, ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉంచుతున్నారు మొదలైన వాటి గురించి ఈ స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది. ఉద్యోగ స్థిరత్వం.. ఉద్యోగంలో స్థిరంగా కొనసాగుతుండటం కూడా రుణ మంజూరీలో కీలక పాత్ర పోషిస్తుంది. స్థిరం గా ఉద్యోగం చేస్తున్నారా లేక తరచూ మారిపోతున్నారా.. అలాగే కొన్నాళ్లపాటైనా ఒకే ఇంటిలో ఉంటున్నారా లేక అది కూడా మారిపోతున్నారా.. ఇలాంటివి సైతం బ్యాంకర్లు పరిశీ లిస్తారు. ఒకవేళ అలాంటేదేమైనా ఉంటే.. లోన్ విషయంలో పునరాలోచించే అవకాశం ఉంటుంది. ఇక, బ్యాంకుకు ఇవ్వాల్సిన పత్రాల విషయానికొస్తే.. సాధారణంగా వేతన జీవులైతే దరఖాస్తుతో పాటు గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, తాజా పే స్లిప్, ఫారం 16, ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రాపర్టీకి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అధ్యయనం చేయండి .. సాధారణంగా ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీ రేటు వసూలు చేస్తుంటుంది. కనుక ఏ బ్యాంకు ఎంత వడ్డీపై ఇస్తోంది, ప్రత్యేక ఆఫర్లేమైనా ఉన్నాయా వంటి వాటిపై కాస్త అధ్యయనం చేయాలి. అప్పుడే మెరుగైన డీల్ దక్కించుకోవచ్చు. అలాగే, రుణం మంజూరు ప్రక్రియ ఎలా ఉంటుందో బ్యాంకులో తెలుసుకోవాలి. ప్రీ-అప్రూవ్డ్కి ప్రయత్నించండి.. ఇంకా ఏ ప్రాపర్టీ కొనాలన్నదీ ఇదమిత్థంగా నిర్ణయం తీసుకోకపోయినా... ప్రీ-అప్రూవ్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఇచ్చే వివరాలను బట్టి మీకు మంజూరు చేయబోయే రుణ మొత్తానికి బ్యాంకులు ముందస్తుగానే ఆమోదముద్ర వేస్తుంటాయి. దీంతో ఎంత మొత్తం లభిస్తుందనేది ఐడియా వస్తుంది కనుక మరికాస్త ధీమాగా ఇళ్ల వేట చేయొచ్చు. ప్రీ-అప్రూవ్డ్ను చూపించి రేటు విషయంలో బిల్డరుతో బేరమాడవచ్చు. అయితే, ప్రీ-అప్రూవ్ చేసినంత మాత్రాన అంత మొత్తాన్నీ బ్యాంకులు ఇచ్చేసే అవకాశాలూ లేవు. ఎందుకంటే.. మీరు ఎంచుకున్న ప్రాపర్టీ లేదా అది ఉన్న ప్రాంతం విషయంలో ఏవైనా సందేహాలుంటే బ్యాంకు తుది నిర్ణయం మారవచ్చు. ఇందుకే హెచ్డీఎఫ్సీ వంటి కొన్ని బ్యాంకులు తాము రుణం ఇచ్చే హౌసింగ్ ప్రాజెక్టుల వివరాలను తమ వెబ్సైట్లలో ఉంచుతున్నాయి. వాటిల్లో నుంచి నచ్చినది ఎంపిక చేసుకుంటే .. బ్యాంక్ ఎలాగూ ఆమోదించినదే కాబట్టి.. లోన్ ప్రక్రియ మరింత సులువుగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.