ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో కీలక అడుగు వేయబోతున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ంగ్‌కు సిద్దమవుతున్నారు. మాతృ సంస్థ రిలయన్స్ గ్రూపు నుంచి విడిపోయేందుకు ఇప్పటికేఎన్‌సీఎల్‌టీ ఆమోదం పొందింది.
రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌ఐఎల్) కొత్త ఈక్విటీ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో పొందేందుకు అర్హులైన కంపెనీ ఈక్విటీ వాటాదారులను నిర్ణయించే ఉద్దేశ్యంతో జూలై 20ని రికార్డ్ డేట్‌గా (షేర్స్ ఎలాట్‌మెంట్) నిర్ణయించినట్లు శనివారం తెలిపింది. ఈ స్కీం ఎఫెక్ట్ తేదీ జూలై 1, 2023 అని రెగ్యులేటర్ ఫైలింగ్‌లో రిలయన్స్ పేర్కొంది. స్కీమ్ నిబంధనలకు అనుగుణంగా, ఆర్‌ఎస్‌ఐఎల్ ఈక్విటీ షేరును రూ. 10 ముఖ విలువతో జారీ చేస్తుంది. (HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: విలీనం తరువాత లక్షలాది కస్టమర్లకు భారీ షాక్!)
ఈ మార్చిలో, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌ఐఎల్ తన ఆర్థిక సేవల సంస్థను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌ఐఎల్)లుగా విడదీసి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్‌ఎస్‌ఎల్)గా పేరు మార్చాలని యోచిస్తున్నట్లు తెలిపింది. అలాగే హితేష్ కుమార్ సేథీ కొత్త సంస్థకు సీఎండీగా ఉంటారని కూడా ఆర్‌ఎస్‌ఐఎల్ ప్రకటించింది. (డైనమిక్ లేడీ నదియా: కిల్లర్ మూవ్‌తో రూ. 300కోట్ల-8వేల కోట్లకు)
జియో ఫైనాన్షియల్ నికర విలువ రూ. 1,50,000 కోట్లు. ఈ లిస్టింగ్ ద్వారా కంపెనీకి చెందిన 36 లక్షల మంది వాటాదారులకు లాభాల పంట పడనుంది. మరోవైపు గ్లోబల్ బ్రోకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ ప్రకారం, జియో ఫైనాన్షియల్ షేర్ ధర రూ. 189 ఉంటుందని అంచనా. ఈ డీమెర్జర్, లిస్టంగ్ తరువాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశంలో ఐదో అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరించనుంది. అంతేకాదు పేటీఎం, బజాజ్ ఫైనాన్స్‌తో గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment