listing debut
-
అంబానీ మరో సంచలన నిర్ణయం: జూలై 20 ముహూర్తం
ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో కీలక అడుగు వేయబోతున్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ంగ్కు సిద్దమవుతున్నారు. మాతృ సంస్థ రిలయన్స్ గ్రూపు నుంచి విడిపోయేందుకు ఇప్పటికేఎన్సీఎల్టీ ఆమోదం పొందింది. రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐఎల్) కొత్త ఈక్విటీ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో పొందేందుకు అర్హులైన కంపెనీ ఈక్విటీ వాటాదారులను నిర్ణయించే ఉద్దేశ్యంతో జూలై 20ని రికార్డ్ డేట్‌గా (షేర్స్ ఎలాట్మెంట్) నిర్ణయించినట్లు శనివారం తెలిపింది. ఈ స్కీం ఎఫెక్ట్ తేదీ జూలై 1, 2023 అని రెగ్యులేటర్ ఫైలింగ్‌లో రిలయన్స్ పేర్కొంది. స్కీమ్ నిబంధనలకు అనుగుణంగా, ఆర్ఎస్ఐఎల్ ఈక్విటీ షేరును రూ. 10 ముఖ విలువతో జారీ చేస్తుంది. (HDFC Bank: హెచ్డీఎఫ్సీ బ్యాంక్: విలీనం తరువాత లక్షలాది కస్టమర్లకు భారీ షాక్!) ఈ మార్చిలో, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ తన ఆర్థిక సేవల సంస్థను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐఎల్)లుగా విడదీసి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్ఎల్)గా పేరు మార్చాలని యోచిస్తున్నట్లు తెలిపింది. అలాగే హితేష్ కుమార్ సేథీ కొత్త సంస్థకు సీఎండీగా ఉంటారని కూడా ఆర్ఎస్ఐఎల్ ప్రకటించింది. (డైనమిక్ లేడీ నదియా: కిల్లర్ మూవ్‌తో రూ. 300కోట్ల-8వేల కోట్లకు) జియో ఫైనాన్షియల్ నికర విలువ రూ. 1,50,000 కోట్లు. ఈ లిస్టింగ్ ద్వారా కంపెనీకి చెందిన 36 లక్షల మంది వాటాదారులకు లాభాల పంట పడనుంది. మరోవైపు గ్లోబల్ బ్రోకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ ప్రకారం, జియో ఫైనాన్షియల్ షేర్ ధర రూ. 189 ఉంటుందని అంచనా. ఈ డీమెర్జర్, లిస్టంగ్ తరువాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశంలో ఐదో అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా అవతరించనుంది. అంతేకాదు పేటీఎం, బజాజ్ ఫైనాన్స్‌తో గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. -
ఎల్ఐసీ లిస్టింగ్.. ప్చ్!
ముంబై: స్టాక్ మార్కెట్లు దూకుడు చూపినప్పటికీ బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ లిస్టింగ్‌లో ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిల్చింది. ఇష్యూ ధర రూ. 949కాగా.. బీఎస్ఈలో 9 శాతం(రూ. 82) నష్టంతో రూ. 867 వద్ద లిస్టయ్యింది. ఎన్ఎస్ఈలోనూ రూ. 77 తక్కువగా రూ. 872 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. పాలసీదారులతోపాటు, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ఐపీవో ధరలో డిస్కౌంట్ ఇవ్వడంతో రూ. 889, రూ. 904 చొప్పున షేర్లు లభించాయి. ఈ ధరలతో పోల్చినా ఎల్ఐసీ నీరసంగానే లిస్టయ్యింది. కాగా.. బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు తొలుత రూ. 920 వద్ద గరిష్టాన్ని తాకగా, తదుపరి రూ. 860 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ ఇంట్రాడేలో రూ. 919–860 మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. చివరికి బీఎస్ఈలో రూ. 875.5 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 873 వద్ద ముగిసింది. వెరసి రోజంతా ఇష్యూ ధర కంటే దిగువనే కదిలింది. ఎన్ఎస్ఈలో 4.87 కోట్లు, బీఎస్ఈలో 27.52 లక్షలు చొప్పున షేర్లు చేతులు మారాయి. ఎల్ఐసీలో 3.5 శాతం వాటా(22.13 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 20,557 కోట్లు సమకూర్చుకుంది. టాప్–5లో చోటు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా ఎల్ఐసీ రూ. 5.54 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను పొందింది. దీంతో మార్కెట్ విలువలో టాప్–5 ర్యాంకులో చోటు సాధించింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం రూ. 17.12 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), రూ. 12.67 లక్షల కోట్లతో టీసీఎస్, రూ. 7.29 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తొలి మూడు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. తదుపరి ఇన్ఫోసిస్ రూ. 6.38 లక్షల కోట్లతో నాలుగో స్థానాన్ని పొందగా.. రూ. 50,000 కోట్లు కోల్పోయిన ఎల్ఐసీ ఐదో ర్యాంకులో నిలిచింది. వెరసి మార్కెట్ విలువలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్(రూ. 5.27 లక్షల కోట్లు), ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ(రూ. 4.94 లక్షల కోట్లు), పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ(రూ. 4.17 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ(రూ. 3.97 లక్షల కోట్లు)లను ఎల్ఐసీ వెనక్కి నెట్టింది. కొత్త ప్రొడక్టులు జనవరి–మార్చిలో నాన్‌పార్టిసిపేటింగ్, గ్యారంటీ ప్రొడక్టులను ప్రవేశపెట్టిన ఎల్ఐసీ ఇకపై వీటిని మరింత అధికంగా విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు కుమార్ చెప్పారు. కొన్ని కొత్త ప్రొడక్టులను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ప్రత్యేకంగా డిజిటల్ మార్కెటింగ్ చానల్‌ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. పాలసీల పంపిణీ కోసం బ్యాంకెస్యూరెన్స్ చానల్‌పై సైతం దృష్టిపెట్టనున్నట్లు వివరించారు. ఎల్ఐసీ 63 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. కొనుగోలు చేయండి... అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగానే ఎల్ఐసీ బలహీనంగా లిస్టయినట్లు దీపమ్ సెక్రటరీ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. మార్కెట్లను ఎవరూ అంచనా వేయలేరని, తగిన విలువ కోసం దీర్ఘకాలం వేచిచూడవలసిందిగా ఇన్వెస్టర్లకు సూచించారు. డిస్కౌంట్ ద్వారా పాలసీదారులకు, ఇన్వెస్టర్లకు కొంత రక్షణ కల్పించినట్లు తెలియజేశారు. కాగా.. మార్కెట్లు కోలుకుంటే షేరు ధర పుంజుకుంటుందని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఐపీవోలో షేర్లు దక్కని ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చని సలహా ఇచ్చారు. దీర్ఘకాలంపాటు షేరు తక్కువ స్థాయిలో నిలిచేందుకు ఎలాంటి కారణమూ కనిపించడంలేదన్నారు. మార్కెట్ విశ్లేషకులు సైతం దీర్ఘకాలానికి ఎల్ఐసీ షేర్లను హోల్డ్ చేయవచ్చని సూచిస్తున్నారు. -
ఇన్వెస్టర్ల జేబులు గుల్ల.. పేటీఎం ఒక్కటే కాదు.. ఇవి కూడా
ఎన్నో అంచనాల నడుమ ఇన్షియల్ పబ్లిక ఇష్యూకి వచ్చిన పేటీఎం షేర్లు ఇన్వస్టర్లకు షాక్ ఇచ్చాయి. దేశంలోనే అతి పెద్ద ఐపీవోగా రికార్డు స్థాయిలో రూ.18,300 కోట్ల నిధులు సమీకరణ లక్ష్యంగా అడుగులు పడగా లిస్టింగ్ అయిన తొలిరోజే షేర్ల ధర భారీగా పడిపోవడంతో ఒక్క రోజులోనే 38 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంచనాలు తారుమారు పేటీఎంకి ముందు ఐపీవోకి పలు కంపెనీలు వచ్చాయి. వీటిలో జోమాటో, నైకా ఐపీవోలు సంచనలం సృష్టించాయి. జోమాటో లిస్టింగ్‌లోనూ అదరగొట్టినా ఆ తర్వాత కొంత వెనుకడుగు వేసింది. ఇక నైకా షేర్లు ఇంకా జోరుమీదే ఉన్నాయి. ఇదే పరంపరలో వచ్చిన పేటీఎం మాత్రం బొక్కబోర్ల పడింది. అయితే లాంగ్‌రన్‌లో పేటీఎం షేర్లు లాభాలు అందిస్తాయనే వారు ఉన్నారు. పేటీఎం తరహాలో గతంలో లిస్టింగ్‌లో అనేక కంపెనీలు ఢమాల్ అన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఐపీవోల వివరాలు.. - దేశవ్యాప్తంగా అనేక స్టోర్లను కలిగి నగర వాసులందరదికీ సుపరిచితమైన కాఫీ డే 2015 అక్టోబరు 14న ఐపీవో ఇష్యూ చేసింది. 316 నుంచి 328 ప్రైస్‌బ్యాండ్‌తో 45 లాట్లలో లిస్టింగ్‌కి వచ్చింది. తొలిరోజు కంపెనీ షేర్ల ధర 17.60 శాతం క్షీణించింది. - అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ పవర్ 2008 జనవరి 15న ఐపీవోకి వచ్చింది. ప్రైస్‌బ్యాండ్ ధర రూ.405 నుంచి 450గా నిర్ణయించారు. అయితే లిస్టింగ్ అయిన తొలిరోజే ఈ కంపెనీ షేర్లు 17.20 శాతం క్షీణించాయి. - ఇదే తరహాలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేర్లు 14.4 శాతం, కెయిర్న్ 14.10 శాతం, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ 14 శాతం, కళ్యాణ్ జ్యూయలర్లర్స్ 13.4 శాతం, భారతి ఇన్ఫ్రా లిమిటెడ్ 13.1 శాతం క్షీణించి ఐపీవోలో షేర్లు అలాట్ కాబడిన ఇన్వెస్టర్లకు కన్నీళ్లను మిగిల్చాయి. పరిశీలించాకే స్టాక్ మార్కెట్లో రంగంలోకి దిగేముందు పూర్తి స్థాయి పరిశీలన అవసరమని నిపుణులు చెబుతుంటారు. ప్రచార ఆర్భాటాలను నమ్మడం కాకుండా కంపెనీ పనితీరు, భవిష్యత్తు, మార్కెట్లో ట్రెండ్‌ను బట్టి ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తుంటారు. -
ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!
500 Indian Employees Just Turned Crorepatis: భారత సంతతికి చెందిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ సంస్థ నాస్డాక్లో లిస్టింగ్ చేసిన ఒక్కరోజులోనే కంపెనీల షేర్లు 32 శాతం మేర పెరిగాయి. నాస్డాక్ ట్రేడింగ్‌లో బుధవారం రోజున ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ షేర్లు 47.55 డాలర్ల వద్ద ముగిశాయి. కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 13 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాగా ఫ్రెష్‌వర్క్స్ కంపెనీలోని సుమారు 500 మంది భారతీయ ఉద్యోగులు ఒక్కరోజులోనే కోటీశ్వరులైనారని కంపెనీ వ్యవస్థాపకుడు గిరీష్ మాతృబూతం వెల్లడించారు. అందులో సుమారు 70 మంది ఉద్యోగులు 30 ఏళ్ల లోపు వారే. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా సుమారు 4300 ఉద్యోగులున్నారు. సుమారు 76 శాతం మంది ఉద్యోగులు ఫ్రెష్‌వర్క్స్ షేర్లను కలిగి ఉన్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు...! నాస్డాక్ స్టాక్ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేసిన భారతీయ సాఫ్ట్వేర్ సంస్థగా ఫ్రెష్‌వర్క్ నిలిచింది. ఫ్రెష్ వర్క్స్ సంస్థను 2010లో భారత్‌లో గిరీష్ మాతృబూతం, షాన్ కృష్ణసామి స్థాపించారు. కస్టమర్లకు మరింత దగ్గరవ్వడం కోసం కొద్ది రోజుల క్రితమే భారత్ నుంచి అమెరికాకు ఫ్రెష్‌వర్క్స్‌ను యాజమాన్యం తరలించింది. ఇప్పుడు కాలిఫోర్నియాలోని శాన్ మేటియోలో, చెన్నైలో గణనీయమైన ఉద్యోగులను ఫ్రెష్‌వర్క్స్ కలిగి ఉంది. ఆక్సెల్ , సీక్వోయా క్యాపిటల్ వంటి పెట్టుబడిదారుల నుండి నిధులను ఫ్రెష్‌వర్క్స్ సేకరించింది. ఇన్ఫోసిస్, విప్రో, డబ్ల్యుఎన్ఎస్, డాక్టర్ రెడ్డిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి డజనుకు పైగా నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేసిన భారతీయ కంపెనీలలో ఫ్రెష్‌వర్క్స్ ఒకటిగా నిలవనుంది,. 1999లో నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేసిన మొదటి భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ తన పేరిట ఆ రికార్డు కలిగి ఉంది. చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ కంపెనీ -
ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్- లిస్టింగ్ భళా
ముంబై, సాక్షి: గతేడాది మళ్లీ కళకళలాడిన ప్రైమరీ మార్కెట్లో భాగంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ హుషారుగా లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 315తో పోలిస్తే ఎన్ఎస్ఈలో రూ. 436 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది 36 శాతం ప్రీమియంకాగా.. వెనువెంటనే రూ. 490 వరకూ ఎగసింది. ప్రస్తుతం 6.5 శాతం లాభంతో రూ. 465 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 436 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలోలోనూ రూ. 430 వద్ద లిస్టయ్యింది. రూ. 493 వరకూ జంప్‌చేసింది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్(ఎంఎస్‌డబ్ల్యూ) విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ గత నెల చివర్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఇష్యూకి 15 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ 66.66 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. 10 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 90 కోట్లను సమీకరించింది. తద్వారా కంపెనీ మొత్తం రూ. 300 కోట్లు సమకూర్చుకుంది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 215 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా.. కంపెనీ తాజాగా రూ. 85 కోట్ల విలువైన షేర్లను జారీ చేసింది. చదవండి: (ఈ చిన్న షేరు గెలాప్ వెనుక?!) ప్రాజెక్టుల కోసం ఐపీవో నిధులను అనుబంధ సంస్థల ద్వారా పీసీఎంసీ WTE ప్రాజెక్టుకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పక్టస్‌లో ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పేర్కొంది. వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రంగంలో దేశీయంగా గల ఐదు టాప్ కంపెనీలలో ఒకటి ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్. మూడు రకాల ప్రాజెక్టులను చేపడుతోంది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్, సీఅండ్‌టీ ప్రాజెక్ట్స్, ఎంఎస్‌డబ్ల్యూ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ప్రధానంగా ఎంఎస్‌డబ్ల్యూ సర్వీసులలో పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వీటిలో సోలిడ్ వేస్ట్ కలెక్షన్, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్ సర్వీసులున్నట్లు తెలియజేసింది. (2020: ఐపీవో నామ సంవత్సరం) మునిసిపాలిటీలతో.. మునిసిపాలిటీలకు అత్యధికంగా సర్వీసులు అందిస్తున్నట్లు ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పేర్కొంది. ల్యాండ్ ఫిల్ నిర్మాణం, నిర్వహణ విభాగంలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఎంఎస్‌డబ్ల్యూ ఆధారిత డబ్ల్యూటీఈ సర్వీసుల్లో పట్టు సాధించింది. ప్రస్తుతం నవీముంబై, థానే, ఉత్తర ఢిల్లీ, మంగళూరు మునిసిపల్ తదితర 25 ప్రాజెక్టులను చేపట్టింది. 18 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటిలో 12 ప్రాజెక్టులు ఎంఎస్‌డబ్ల్యూ సీఅండ్‌టీ విభాగంలోనివే. 1147 వాహనాలను కలిగి ఉంది. 969 వాహనాలకు జీపీఎస్‌ను అనుసంధానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ. 207 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. కుటుంబ సభ్యులు, ప్రమోటర్లకు 24.73 శాతం వాటా ఉంది. -
ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్.. వీక్ లిస్టింగ్
ఇటీవల పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిస్టింగ్‌లో ఇన్వెస్టర్లను నిరాశపరచింది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో 6 శాతం తక్కువగా రూ. 31 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇష్యూ ధర రూ. 33తో పోలిస్తే ఇది 6 శాతం తక్కువకాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 32.45 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 32.65 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 30 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. రెండు రెట్లు కొద్ది రోజుల క్రితం పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 517 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూకి దాదాపు రెండు రెట్లు అధికంగా స్పందన లభించింది. ఆఫర్లో భాగంగా 11.6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 22.6 కోట్ల షేర్లకోసం దరఖాస్తులు లభించాయి. రిటైల్ విభాగం రెండు రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ సాధించింది. ఇష్యూ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టైర్-1 క్యాపిటల్‌ను పటిష్ట పరచుకునేందుకు వినియోగించనున్నట్లు బ్యాంక్ ఇప్పటికే తెలియజేసింది. ఈక్విటాస్ హోల్డింగ్స్ ప్రమోటర్‌గా కలిగిన ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఐపీవోను చేపట్టింది. లైసెన్సింగ్ మార్గదర్శకాల ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావలసి ఉంది. గత రెండేళ్లలో గత రెండేళ్ల కాలంలో అంటే 2018-20 మధ్య కాలంలో ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ ఆదాయంలో 29 శాతం వృద్ధిని సాధించింది. వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు 39 శాతం, రుణ విడుదల 31 శాతం చొప్పున పుంజుకున్నాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.72 శాతాన్ని తాకగా.. నికర ఎన్పీఏలు 1.66 శాతానికి చేరాయి. -
ఏంజెల్ బ్రోకింగ్.. వీక్ లిస్టింగ్
దేశంలో నాలుగో పెద్ద బ్రోకింగ్ సేవల కంపెనీ ఏంజెల్ బ్రోకింగ్.. ఇన్వెస్టర్లను నిరాశపరుస్తూ స్టాక్ ఎక్స్ఛేంజీలలో డిస్కౌంట్లో లిస్టయ్యింది. ఐపీవో ధర రూ. 306తో పోలిస్తే ఎన్ఎస్ఈలో 10 శాతం నష్టంతో రూ. 275 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 297 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 257 వద్ద కనిష్టానికీ చేరింది. ప్రస్తుతం రూ. 17 నష్టంతో రూ. 289 వద్ద కదులుతోంది. రూ. 600 కోట్లు గత నెల 24న ముగిసిన పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఏంజెల్ బ్రోకింగ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 306 ధరలో 58.8 లక్షల షేర్లను 12 సంస్థలకు కేటాయింంచింది. ఏంజెల్ బ్రోకింగ్‌లో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా, మెక్వారీ ఫండ్ సొల్యూషన్స్, ఇన్వెస్కో ట్రస్టీ, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తదితరాలున్నాయి. వెరసి ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకుంది. బ్యాక్‌గ్రౌండ్.. టెక్నాలజీ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఏంజెల్ బ్రోకింగ్ అందిస్తోంది. ప్రధానంగా బ్రోకింగ్, అడ్వయజరీ, మార్జిన్ ఫండింగ్, షేర్ల తనఖాపై రుణాలు తదితరాలను క్లయింట్లకు సమకూర్చుతోంది. 7.7 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. 6.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. క్లయింట్ల రీత్యా దేశంలోనే నాలుగో పెద్ద బ్రోకింగ్ సంస్థగా ఏంజెల్ నిలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 639 కోట్లను అధిగమించింది. ఏంజెల్ బ్రోకింగ్.. ఈ ఏడాది అంటే 2020లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన 8వ కంపెనీ కావడం గమనార్హం! -
23 శాతం ప్రీమియంతో లిస్టయిన క్యామ్స్
గత నెలలో ఐపీవోకి వచ్చిన కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్- క్యామ్స్(CAMS) లాభాల లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 1,230కాగా.. బీఎస్ఈలో 23 శాతం(రూ. 288) ప్రీమియంతో రూ. 1,518 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి అమ్మకాలు పెరగడంతో కొంతమేర వెనకడుగు వేసింది. రూ. 1,306 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. ఇదే విధంగా రూ. 1,550 వద్ద గరిష్టాన్నీ తాకింది. ప్రస్తుతం రూ. 194 లాభంతో రూ. 1,424 వద్ద ట్రేడవుతోంది. 47 రెట్లు సెప్టెంబర్ 21-23 మధ్య ఐపీవో చేపట్టిన క్యామ్స్.. తద్వారా రూ. 318 కోట్లను సమీకరించింది. ఇష్యూ 47 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవోలో భాగంగా క్యామ్స్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ. 667 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 1230 ధరలో 35 సంస్థలకు షేర్లను విక్రయించింది. వెరసి స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈకి భారీ వాటా ఉన్న కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్- క్యామ్స్(CAMS) ఇష్యూ ద్వారా రూ. 2242 కోట్లవరకూ సమకూర్చుకుంది. సెబీ నిబంధనల ప్రకారం క్యామ్స్‌లో గల మొత్తం 37.48 శాతం వాటాను పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎన్ఎస్ఈ విక్రయించింది. తద్వారా కంపెనీ నుంచి ఎన్ఎస్ఈ వైదొలగింది. క్యామ్స్‌లో మరో ప్రమోటర్ కంపెనీ గ్రేట్ టెరైన్‌కు 43.53 శాతం వాటా ఉంది. ఐపీవో తదుపరి ఈ వాటా 30.98 శాతానికి పరిమితంకానుంది. పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్‌కు చెందిన కంపెనీ ఇది. ఇతర వివరాలు.. 1988లో ఏర్పాటైన క్యామ్స్‌లో ప్రధాన ప్రమోటర్ గ్రేట్ టెరైన్ ప్రస్తుతం 31 శాతం వాటాను కలిగి ఉంది. దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్‌కు అతిపెద్ద రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్‌గా సేవలందిస్తోంది. దేశీ ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల సగటు రీత్యా చూస్తే క్యామ్స్ 70 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 జులైకల్లా దేశంలోని అతిపెద్ద 15 ఫండ్ హౌస్‌లలో 9 సంస్థలను క్లయింట్లుగా కలిగి ఉంది. టాప్-5 ఎంఎఫ్‌లలో నాలుగింటికి సేవలందిస్తోంది. -
కెమ్‌కాన్ స్పెషాలిటీ.. రికార్డ్ లిస్టింగ్
గత నెలలో ఐపీవోకి వచ్చిన కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో బంపర్ లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 340కాగా.. ఎన్ఎస్ఈలో ఏకంగా 115 శాతం(రూ. 391) ప్రీమియంతో రూ. 731 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి అమ్మకాలు పెరగడంతో కొంతమేర వెనకడుగు వేసింది. రూ. 610 దిగువన ఇంట్రాడే కనిష్టానికి చేరింది. ప్రస్తుతం రూ. 305 లాభంతో రూ. 645 వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం హ్యాపీయెస్ట్ మైండ్స్ 111 శాతం ప్రీమియంతో లిస్ట్‌కావడం ద్వారా 2020లో రికార్డ్ సాధించిన సంగతి తెలిసిందే. 149 రెట్లు సెప్టెంబర్ 21-23 మధ్య ఐపీవో చేపట్టిన కెమ్‌కాన్ స్పెషాలిటీ రూ. 318 కోట్లను సమీకరించింది. ఇష్యూ 149 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. తద్వారా ఈ ఏడాది(2020) పబ్లిక్ ఇష్యూకి అత్యధిక స్పందన సాధించిన రెండో కంపెనీగా నిలిచింది. 151 రెట్లు బిడ్స్ సాధించడం ద్వారా హ్యాపియెస్ట్ మైండ్స్ తొలి ర్యాంకును కైవసం చేసుకుంది. ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ రూ. 95.4 కోట్లను సమకూర్చుకుంది. షేరుకి రూ. 340 ధరలో 28.06 లక్షల షేర్లను జారీ చేసింది. ఇష్యూ నిధులను తయారీ సామర్థ్య విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కెమ్‌కాన్ పేర్కొంది. బ్యాక్‌గ్రౌండ్ కెమ్‌కాన్ ప్రధానంగా హెచ్ఎండీఎస్, సీఎంఐసీగా పేర్కొనే స్పెషలైజ్డ్ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. వీటిని ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగిస్తారు. అంతేకాకుండా ఇన్ఆర్గానిక్ బ్రోమైడ్స్లోనూ ఉపయోగిస్తారు. కాల్షియం, జింక్, సోడియం బ్రోమైడ్స్గా పిలిచే వీటిని అత్యధికంగా చమురు క్షేత్రాల పరిశ్రమలో వినియోగిస్తారు. ఆయిల్వెల్ కంప్లీషన్ కెమికల్స్‌గా వీటిని సంబోధిస్తారు. ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ నివేదిక ప్రకారం దేశీయంగా హెచ్ఎండీఎస్ కెమికల్స్‌ను కెమ్‌కాన్ మాత్రమే తయారు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. కెమికల్ ఉత్పత్తులను యూఎస్, ఇటలీ, జర్మనీ, జపాన్, రష్యా తదితర పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫార్మా రంగంలో హెటెరో ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, అరబిందో తదితర పలు కంపెనీలను కస్టమర్లుగా కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 262 కోట్ల ఆదాయం, రూ. 70 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. నికర లాభం రూ. 49 కోట్లుగా నమోదైంది. -
రోజారీ బయోటెక్ బంపర్ లిస్టింగ్
కోవిడ్-19 అనిశ్చితుల నేపథ్యంలోనూ పబ్లిక్ ఇష్యూకి వచ్చిన స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ రోజారీ బయోటెక్ స్టాక్ ఎక్స్చేంజీలలో భారీ ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 425కాగా.. ఎన్ఎస్ఈలో రూ. 244 లాభంతో రూ. 669 వద్ద లిస్టయ్యింది. తదుపరి రూ. 695 వరకూ జంప్‌చేసింది. ఇది 63 శాతం లాభంకాగా.. రూ. 664 వద్ద కనిష్టాన్ని చేరింది. ప్రస్తుతం రూ. 680 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల 15న ముగిసిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 496 కోట్లు సమీకరించింది. ఇష్యూ 79 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్కావడం విశేషం! కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ రోజారీ బయోటెక్ ప్రధానంగా మూడు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. గృహ పరిశుభ్రత, వ్యక్తిగత సంరక్షణ(హోమ్, పెర్సనల్ కేర్) ప్రొడక్టులతోపాటు.. పెర్ఫార్మెన్స్ కెమికల్స్‌నూ తయారు చేస్తోంది. టెక్స్టైల్ స్పెషాలిటీ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. అంతేకాకుండా జంతు సంరక్షణ, బలవర్ధక ఉత్పత్తులు(యానిమల్ హెల్త్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్)ను తయారు చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులను సబ్బులు, డిటర్జెంట్లు, పెయింట్లు, టైల్స్, పేపర్, టెక్స్టైల్స్ తదితర రంగాలలో వినియోగిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. కంపెనీకి హెచ్‌యూఎల్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, అరవింద్ తదితర దిగ్గజ కంపెనీలు కీలక కస్టమర్లుగా నిలుస్తున్నాయి. కంపెనీ కార్యకలాపాలు కలిగిన రంగాలలో ఆర్తి ఇండస్ట్రీస్, గలాక్సీ సర్ఫెక్టాంట్స్, వినతీ ఆర్గానిక్స్ తదితర లిస్టెడ్ కంపెనీలు ప్రధాన ప్రత్యర్దులుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020లో ఇలా గతేడాది(2019-20)లో రోజారీ బయోటెక్ రూ. 604 కోట్ల ఆదాయం సాధించింది. ఇబిటా రూ. 104 కోట్లను అధిగమించగా.. నికర లాభం రూ. 65 కోట్లను తాకింది. కంపెనీ ఉత్పత్తులను గృహ, వ్యక్తిగత సంరక్షణ ప్రొడక్టుల తయారీలో వినియోగిస్తున్నందున నిత్యావసర కేటగిరీలోకి చేరుతుందని యాక్సిస్ క్యాపిటల్ పేర్కొంది. దీంతో సిల్వస్సాలోని ప్లాంటు కోవిడ్-19 లాక్‌డవున్‌లోనూ తయారీని కొనసాగించినట్లు తెలియజేసింది. -
ఐపీవోలో దూసుకెళ్లిన ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్
ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ లిస్టింగ్ లో అదరగొట్టింది. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 25 శాతం అధిగమించి దూసుకుపోతోంది. రూ. 472 దగ్గర మొదలైన ఇష్యూ ప్రైస్ 21.19 శాం ప్రీమియాన్ని నమోదు చేసింది. రూ. 10 ముఖ విలువగల 2.64 కోట్లకు పైగా షేర్లను విక్రయించి మొత్తం రూ. 1,161 కోట్లను సమీకరించింది. ఈ ఐపీఓ ద్వారా రూ. 1161 కోట్ల నిధులలో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 348 కోట్లు లభించాయి. 2000లో ఏర్పాటైన ఎండ్యూరెన్స్ ప్రధానంగా త్రిచక్ర, ద్విచక్ర వాహనాలకు ఇంజిన్, ట్రాన్స్మిషన్ విడిభాగాలను తయారు చేస్తోంది. వీటితోపాటు పాసింజర్, తేలికపాటి వాణిజ్య వాహనాలకూ ప్రత్యేక విడిభాగాలను రూపొందిస్తోంది. ఆటో కాంపొనెంట్ విభాగానికి చెందిన కంపెనీ కావడం.. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ కంపెనీల షేర్లలో ర్యాలీ జరుగుతూ ఉండడం కంపెనీకి కలిసి వచ్చిందని ఎనలిస్టుల అభిప్రాయం. మరోపక్క మంచి వర్షపాతం, 7వ వేతన సంఘం సిఫారసులు అమలు ద్విచక్రవాహనాల సెగ్మెంట్ లో డిమాండ్ ఊపందుకుందని తెలిపారు. ఔరంగాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఎండ్యూరెన్స్ కు దేశంలో 18 ప్లాంట్స్ ఉండగా, యూరోప్ లో 7 ప్లాంట్లుఉన్నాయి. అయితే ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ లో 13.72శాతం వాటా ఉన్న యూకే కంపెనీ యాక్టిస్ ఎడ్వైజర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఈ ఐపీవో తో బయటికి వచ్చినట్టు ప్రకటించింది.