రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల (ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్) ద్వారా ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.70,000 కోట్ల డివిడెండ్‌ను పొందవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ మేరకు అంచనాలు ఉండవచ్చన్నది సమాచారం. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషనల్స్ నుంచి రూ.48,000 కోట్ల డివిడెండ్లను కేంద్ర బడ్జెట్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఈ మొత్తం లక్ష్యాన్ని మించి వనగూడాయి. ఒక్క ఆర్‌బీఐ రూ.87,416 కోట్ల డివిడెండ్‌ను అందించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఇదే సానుకూల అంకెలు వచ్చాయి. దీనితో 2023–24 కన్నా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీ డివిడెండ్లు వెలువడుతాయన్న అంచనాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి
2023–24లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు జీడీపీలో 5.9 శాతంగా బడ్జెట్ అంచనా. 2025–26లో దీనిని 4.5 శాతానికి తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 5.4 శాతంగా ద్రవ్యలోటు ఉండాలన్నది ప్రభుత్వ రోడ్‌మ్యాప్స్‌లో భాగంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment