న్యూఢిల్లీ: వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ రంగ కంపెనీలు, బ్యాంకుల నుంచి రూ. లక్ష కోట్ల డివిడెండ్ వసూళ్లను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇది ప్రస్తుత ఏడాది రూ.88,781 కోట్లతో పోలిస్తే దాదాపు 13% ఎక్కువ. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కనీసం 20% డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించాలి. లేకపోతే పన్ను చెల్లింపుల తర్వాత లాభాల్లో 20% ప్రభుత్వానికి ఇవ్వాలి. రూ.1,00,651 కోట్ల డివిడెండ్ వసూళ్ల లక్ష్యంలో రూ.36,174 కోట్లను ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, రూ.64,477 కోట్లను బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి ప్రభుత్వం సేకరించనుంది. కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడులలో డివిడెంట్ ఆదాయానిదే అగ్రభాగం.