ఆర్థిక సంస్థలకు ఆర్‌బీఐ ఆదేశం
ముంబై: కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ విధింపు విషయంలో అసమంజస విధానాలను పాటిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన రిజర్వ్ బ్యాంక్ .. దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా వాటిని ఆదేశించింది. అలా అధికంగా వసూలు చేసిన వడ్డీలు, చార్జీలను కస్టమర్లకు తిరిగివ్వాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది.
పలు నియంత్రిత సంస్థలను (ఆర్‌ఈ) పరిశీలించిన మీదట వడ్డీ విషయంలో కొన్ని సంస్థలు అసమంజస విధానాలు పాటిస్తున్నాయని గుర్తించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. కొన్ని ఆర్‌ఈలు వాస్తవంగా రుణాన్ని విడుదల చేసిన తేదీ నుంచి కాకుండా రుణాన్ని మంజూరు చేసిన తేదీ నుంచి లేదా రుణ ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి వడ్డీ విధిస్తున్నాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment