Circular
-
విశాఖలో ఉక్కు కార్మికుల వినూత్న నిరసన
-
అధిక చార్జీల రిఫండ్
ముంబై: కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ విధింపు విషయంలో అసమంజస విధానాలను పాటిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన రిజర్వ్ బ్యాంక్ .. దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా వాటిని ఆదేశించింది. అలా అధికంగా వసూలు చేసిన వడ్డీలు, చార్జీలను కస్టమర్లకు తిరిగివ్వాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది. పలు నియంత్రిత సంస్థలను (ఆర్ఈ) పరిశీలించిన మీదట వడ్డీ విషయంలో కొన్ని సంస్థలు అసమంజస విధానాలు పాటిస్తున్నాయని గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. కొన్ని ఆర్ఈలు వాస్తవంగా రుణాన్ని విడుదల చేసిన తేదీ నుంచి కాకుండా రుణాన్ని మంజూరు చేసిన తేదీ నుంచి లేదా రుణ ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి వడ్డీ విధిస్తున్నాయని పేర్కొంది. -
కారణాలు చూపకుండా పరిధి విభజన సరికాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మూడు జిల్లా వినియోగదారుల కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిని నిర్ణయిస్తూ 2022 నాటి సర్క్యులర్‌ను పక్కన పెడుతూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. రాష్ట్ర కమిషన్ అధ్యక్షుల హోదాలో జిల్లా కమిషన్ల అధికార పరిధిని నిర్ణయించవచ్చన్న న్యాయస్థానం.. ఆ నిర్ణయం మాత్రం పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. పరిధి మార్పు ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన వివరణ ఉండాలని పేర్కొంది. జిల్లా కమిషన్ల న్యాయవాదుల సంఘం ఇచ్చి న వినతి పత్రానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. హైదరాబాద్‌లోని మూడు జిల్లా కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిపై 2022లో జారీ చేసిన సర్క్యులర్‌ను నిలిపివేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ గతేడాది ఏప్రిల్‌లో రాసిన లేఖను సవాల్‌చేస్తూ న్యాయవాది రాఘవేంద్రసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ పి. శ్యామ్ కోసీ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్చు చెప్పింది. హైదరాబాద్‌లోని మూడు జిల్లా కమిషన్లు నాంపల్లిలోని చంద్రవిహార్ నుంచి విధులు నిర్వహిస్తున్నాయి. కమిషన్–1లో కేసులు ఎక్కువగా ఉండగా మిగిలిన రెండు కమిషన్లలో కేసులు లేక మధ్యాహ్నంలోగానే విచారణ పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయవాదుల సంఘం వినతి మేరకు కేసుల విభజన బాధ్యతను కమిషన్–1కి అప్పగిస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ రిజిస్ట్రార్ లేఖ రాశారు. కేసుల విభజనలో వివక్ష చూపుతున్నారని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేసుల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని వివరిస్తూ విభజన చేయవచ్చని, న్యాయవాదుల సంఘం ఇచ్చి న వినతిపై నిర్ణయం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. తగిన కారణాలు చూపకుండా... దానిపై వివరణ లేకుండా విభజన చేయడం సరికాదని స్పష్టం చేసింది. -
సిమ్ నిబంధనలు ఉల్లంఘిస్తే, టెల్కోలకు తప్పదు భారీ మూల్యం
న్యూఢిల్లీ: నమోదు చేసుకోని డీలర్ల ద్వారా సిమ్ కార్డులను విక్రయించి, కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని టెల్కోలను టెలికం శాఖ (డాట్) హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. దీనికి ఉద్దేశించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయని, టెలికాం ఆపరేటర్లు సెప్టెంబర్ 30 లోపు అన్ని ‘పాయింట్ ఆఫ్ సేల్’ (PoS) నమోదు చేసుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొంది. సిమ్ కార్డుల మోసపూరిత విక్రయాలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు అన్ని పాయింట్ ఆఫ్ సేల్స్‌ను (పీవోఎస్) సెప్టెంబర్ 30లోగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పీవోఎస్‌లు తగు పత్రాలను సమర్పించి, రిజిస్టర్ చేయించుకోవాలి. -
ఈపీఎఫ్‌వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల ప్రొఫైల్ అప్డేషన్ ప్రక్రియకు సంబంధించి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను తీసుకొచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం, ఈపీఎఫ్ సభ్యులు వారి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను అప్డేట్ చేసుకోవడానికి జాయింట్ డిక్లరేషన్ల ప్రాసెసింగ్‌లో ఎస్ఓపీ సహాయం చేస్తుంది. అప్డేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వివరాల నమోదులో అవకతవకలను నివారించేందుకు ఈ కొత్త ప్రక్రియను ఈపీఎఫ్ఓ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈపీఎఫ్‌వో డేటాబేస్‌లో అసంపూర్ణంగా లేదా సరిపోలని విధంగా ఉన్న వివరాల అప్డేషన్ కోసం కాగితాల ద్వారా సమర్పించే జాయింట్ డిక్లరేషన్ విధానం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇందుకు చాలా సమయం పడుతోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త విధానానం (ఎస్ఓపీ) సహాయపడుతుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అప్డేషన్ వివరాలు, పరిమితులు ప్రొఫైల్స్ సక్రమంగా లేకపోవడంతో తరచూ తిరస్కరణలు, కొన్నిసార్లు అవకతవకలకు సైతం దారితీసే అవకాశం ఉంటోంది. పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు/తల్లి పేరు, సంబంధ స్థితి, ఆరోగ్య స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, నిష్క్రమించడానికి కారణం, నిష్క్రమించిన తేదీ, జాతీయత, ఆధార్ నంబర్ తదితర వివరాల్లో డేటా సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్లలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైన పేర్కొన్న 11 రకాల వివరాల్లో సవరణలను ఈపీఎఫ్‌వో సభ్యులు చేసుకోవచ్చు. కొత్త ఎస్ఓపీ ప్రకారం.. వీటిని చిన్న, పెద్ద మార్పులుగా వర్గీకరించారు. అలాగే ఈ వివరాలను ఎన్నిసార్లు అప్డేషన్ చేసుకోవచ్చన్న దానిపై కూడా పరిమితిని విధించింది ఈపీఎఫ్‌వో. చిన్న అభ్యర్థనలు ఏడు రోజుల్లో పెద్ద అప్డేషన్లు 15 రోజుల్లో పూర్తయ్యే చర్యలు చేపట్టింది. అప్డేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి దశలోనూ సభ్యులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. అప్డేషన్ ప్రక్రియతో పాటు, ఇందుకు అవసరమైన పత్రాలను సర్క్యులర్‌లో పేర్కొన్నారు. పేరు, జెండర్ అప్డేట్ చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. అగానే సభ్యులు మరణించిన సందర్భంలో మరణ ధ్రువీకరణ పత్రం కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. -
రూ. వేల కోట్ల చార్జీల ఎఫెక్ట్: బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 2018 నుంచి జరిమానా ఛార్జీల రూపంలో ఖాతాదారుల నుంచి రూ. 35,000 కోట్లకు పైగా వసూలు చేశాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది. ఇందులో మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవడంపై రూ.21,044.4 కోట్లు, అదనపు ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,289.3 కోట్లు, ఎస్ఎంఎస్ సేవల ద్వారా రూ.6,254.3 కోట్లు వసూలు చేశాయి. బ్యాంకులు చార్జీల రూపంలో కస్టమర్ల నుంచి ఇన్ని వేల కోట్లు వసూలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సురక్షిత రుణ విధానాలపై తన ఆదేశాలలో భాగంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన రుణగ్రహీతలపై జరిమానా రూపంలో అదనపు వడ్డీని విధించవద్దని బ్యాంకులను కోరింది. బ్యాంకులు జరిమానా రూపంలో విధించే వడ్డీలు, ఛార్జీలను ఆదాయ మార్గంగా చూడకూడదని, ఒప్పందం ప్రకారం విధించే వడ్డీని మించి అదనపు వడ్డీని కస్టమర్ల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. రుణ ఖాతాలపై విధించే జరిమానా ఛార్జీలను నియంత్రించాలని ప్రతిపాదించిన ఏప్రిల్ 12 నాటి ముసాయిదా సర్క్యులర్‌కు ప్రతిస్పందనగా ఆర్బీఐ ఆదేశాలను జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు ఇవే.. నిబంధనల ఉల్లంఘించినందుకు రుణ ఖాతాలపై ఎలాంటి వడ్డీ విధించకూడదు. ఒక సారి అపరాధ రుసుము విధించిట్లయితే, ఈ ఛార్జీలపై అదనపు వడ్డీ వేయకూడదు. వసూలు చేసే వడ్డీపై అదనంగా ఎటువంటి వడ్డీలు కానీ, చార్జీలు కానీ విధించకూడదు. జరిమానాలు సహేతుకంగా నిబంధనల ఉల్లంఘనల తీవ్రతకు అనుగుణంగా ఉండాలి. ఏదైనా నిర్దిష్ట రుణ ఉత్పత్తిపై ఇవి మరీ ఎక్కువగా ఉండకూడదు. వ్యక్తిగత రుణగ్రహీతలకు విధించే జరిమానా ఛార్జీలు.. ఇతర రుణగ్రహీతలకు విధించే దాని కంటే ఎక్కువగా ఉండకూడదు. జరిమానా మొత్తం, విధించడానికి గల కారణాలను ఆయా బ్యాంకులు, సంస్థలు స్పష్టంగా వెల్లడించాలి. సురక్షిత రుణ విధానాలకు సంబంధించిన కొత్త నిబంధనలు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే, ఇవి క్రెడిట్ కార్డ్‌లు, బాహ్య వాణిజ్య రుణాలు, వాణిజ్య క్రెడిట్లు, స్ట్రక్చర్డ్ ఆబ్లిగేషన్లకు వర్తించవు. ఇదీ చదవండి: Search of Unclaimed deposits: బ్యాంకుల్లో మిగిలిపోయిన డిపాజిట్లు.. మీవీ ఉన్నాయా? ఆర్బీఐ పోర్టల్‌లో చెక్ చేయండి.. -
ఇక అప్పు పుట్టడం కష్టమే! సీసీఎస్ దివాలా.. ఆర్టీసీ కార్మికులకు కష్టాలు
‘ఆర్టీసీ ఉద్యోగులు రుణం కోసం అందించే దరఖాస్తులను మీరు బ్యాంకులకు, రుణాలు అందించే ఆర్థిక సంస్థలకు ఫార్వర్డ్ చేయొద్దు.. ఉద్యోగుల వేతన బిల్లుల నుంచి రుణ రికవరీలకు వీలు కల్పించవద్దు’ – ఇటీవల యూనిట్ అధికారులకు ఆర్టీసీ జారీ చేసిన ఆదేశం ఇది. ఆర్టీసీ కార్మికులకు రుణం పుట్టడం కష్టంగా ఉన్న సమయంలో ఈ ఆదేశం ఉద్యోగులకు అశనిపాతంగా మారింది. వాస్తవానికి ఇది కొత్త సర్క్యులర్ కాదు. 2003లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు పెద్దగా అమలు కాలేదు. పాత సర్క్యులర్‌ను కోట్ చేస్తూ దాన్ని ఇప్పుడు కచ్చితంగా అమలు చేసేలా తాజాగా మరో సర్క్యులర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులు జారీ చేశారు. కాగా, ఇప్పుడు నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఈ ఆదేశాలు తమపై తీవ్ర ప్రభావం చూపుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకీ ఆదేశం.. ఏమిటా విపత్కర పరిస్థితి.. ఆర్టీసీ ఉద్యోగులు గతంలో స్వేచ్ఛగా బ్యాంకుల నుంచి రుణం పొందేవారు. కొంతకాలం క్రితం వరకు వేతనాల ఖాతాలున్న బ్యాంకు వారికి రుణాలు ఇచ్చే విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించేది. ఇటీవలే వేతనాల ఖాతాలు మరో బ్యాంకుకు మార్చారు. రుణాలిచ్చే విషయంలో కొత్త బ్యాంకు రకరకాల కొర్రీలు, కఠిన నిబంధనలు పెడుతోందని, దీంతో రుణాలకు ఇబ్బందిగా మారిందని కార్మికులు పేర్కొంటున్నారు. దీంతో వేరే బ్యాంకుల నుంచి రుణాలు పొందేవారు. సాధారణంగా ఆర్టీసీ అధికారుల ద్వారా రుణ దరఖాస్తు వస్తే బ్యాంకులు సులభంగా రుణమిస్తాయి. ఒకవేళ కార్మికులు తిరిగి చెల్లించకున్నా, ఆర్టీసీ పూచీగా ఉంటుందన్న ధీమా బ్యాంకులకు ఉంటుంది. ఇప్పుడు రుణాలకు సిఫారసు చేయొద్దని, వేతనాల నుంచి రికవరీకి బ్యాంకులకు అవకాశం ఇవ్వవద్దని పేర్కొంటూ పాత ఆదేశాలను తిరిగి తెరపైకి తేవడం విశేషం. సీసీఎస్ దివాలాతో.. గతంలో ఆర్టీసీ కార్మికులకు బ్యాంకు రుణాల అంశం పెద్ద సమస్యగా ఉండేది కాదు. ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) సుభిక్షంగా ఉండటంతో దాని ద్వారానే కావాల్సిన రుణాలు పొందేవారు. కొంతకాలంగా దాని నిల్వ నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకుని, దాదాపు వేయి కోట్లకుపైగా బకాయి (వడ్డీతో సహా) పడటం, నెలనెలా దానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవటంతో సీసీఎస్ దాదాపు దివాలా దశకు చేరిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి నుంచి రుణాలు నిలిచిపోవడం కార్మికులకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు బ్యాంకుల నుంచి సులభంగా రుణం పొందే వీలు లేకపోవటంతో వారికి ప్రైవేటు వడ్డీ వ్యాపారులే దిక్కయ్యారు. గతంలో బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సమయానికి చెల్లించిన రికార్డు ఉన్న వారు పాత పరిచయాలతో రుణాలు పొందగలుగుతున్నా... మిగతా వారికి మాత్రం ఆర్టీసీ నుంచి సిఫారసు లేకుండా రుణం రాని పరిస్థితి నెలకొంది. ‘ఇదేం ఘోరం’ అటు సీసీఎస్‌ను నిర్విర్యం చేసి రుణాలు అందని పరిస్థితి తెచ్చి, ఇటు బ్యాంకుల నుంచి రుణ సిఫారసులు లేకుండా చేసి కార్మికులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సరికాదని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఎస్‌ను పునరుద్ధరించే దాకా బ్యాంకుల నుంచి స్వేచ్ఛగా రుణాలు పొందే వీలు కల్పించాలని, తాజా సర్క్యులర్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆలస్యంగా వస్తే అనుమతి లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. 9.30 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన ఎవరినీ అనుమతించబోమన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సర్క్యులర్ విడుదల చేశారు. www.bse.ap.gov.in లో పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్‌ను చూడొచ్చన్నారు. అన్ని పరీక్షలను నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులకు సూచనలు.. ♦ హాల్‌టికెట్లు పొందాక విద్యార్థులంతా తమ పేరు, పుట్టిన తేదీ, ఫొటో వంటి అన్ని వివరాలను సరిచూసుకోవాలి. వాటిలో పొరపాట్లు గమనిస్తే పాఠశాల హెడ్మాస్టర్/ప్రిన్సిపాల్‌ని సంప్రదించాలి. ♦ విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లను తమతో పాటు పరీక్షకు తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ లేకపోతే పరీక్షకు అనుమతించరు. ♦ పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్, కెమెరాలు, ఇయర్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు. ఎవరైనా వాటిని లోపలకు తీసుకువెళ్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ♦ విద్యార్థులు ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ ప్రశ్నలను వేర్వేరు సమాధాన పత్రాల్లో రాయాలి. ఈ రెండింటి కోసం వేర్వేరుగా 12 పేజీల సమాధానాల బుక్లెట్లు ఇస్తారు. ♦ విద్యార్థులను అత్యవసర పరిస్థితుల్లో మినహా 12:45 గంటల వరకు పరీక్ష హాల్ నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు. ♦ ప్రశ్నపత్రాల లీక్ అని తప్పుడు, నిరాధారమైన పుకార్లకు పాల్పడకూడదు. వదంతులను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ♦ పరీక్ష సమయంలో అక్రమాలకు పాల్పడేవారిపై, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు ఉంటాయి. అలాంటివారిని తదుపరి పరీక్షలు రాయనీయరు. ♦ విద్యార్థి పేరు, రోల్ నంబర్, ఇతర వివరాలను 24 పేజీల జవాబు బుక్లెట్, మ్యాప్ లేదా గ్రాఫ్ షీట్‌లోని ఏ పేజీలోనూ రాయకూడదు. ♦ కాగా పరీక్షలు జరిగే రోజుల్లో ఎంఈవోలు, హెచ్ఎంలు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ల విధులపైనా సూచనలు జారీ చేశారు. -
ఐటీ సర్క్యులర్ వచ్చిందోచ్.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?
డిసెంబర్ 7వ తేదీన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇలా విడుదల చేస్తారు. ఇది కేవలం ఉద్యోగస్తులకు సంబంధించినది అని చెప్పవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి చట్టంలోని అంశాలు, రూల్సు, అవసరమైన ఫారాలు, వివరణలు, వివిధ రిఫరెన్సులు, సులువుగా అర్థమయ్యే పది ఉదాహరణలతో ఈ సర్క్యులర్ వచ్చింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇందులో అంశాలు మీకోసం క్రోడీకరించి ఒకే చోట విశదీకరించారు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమి ఉంటాయి అంటే.. ► జీతం అంటే ఏమిటి.. పెర్క్స్ అంటే ఏమిటి, జీతంలో కలిసే ఇతర అంశాల నిర్వచనాలు ► శ్లాబులు, రేట్లు, రిబేట్లు మొదలైనవి ► టీడీఎస్ ఎలా లెక్కించాలి ► ఇద్దరు యజమానులుంటే ఎలా చేయాలి ► ఎరియర్స్ జీతం, అడ్వాన్స్ జీతం లెక్కింపు ► జీతం మీద ఆదాయం కాకుండా ఇతర ఏదైనా ఆదాయం ఎలా తెలియజేయాలి ► ఇంటి లోన్ మీద వడ్డీ, షరతులు ► విదేశాల నుంచి వచ్చే జీతం ► టీడీఎస్ రేట్లు, ఎలా రికవరీ చేయాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, రిటర్నులు ఎలా దాఖలు చేయాలి, టీడీఎస్ సర్టిఫికెట్ ఫారం 16 ఎలా జారీ చేయాలి, ఎప్పుడు దాఖలు చేయాలి ► పైవన్నీ సకాలంలో చేయకపోతే, వడ్డీ, పెనాల్టీల వివరాలు ► ఏయే మినహాయింపులు ఉన్నాయి ► ఏయే కాగితాలు, రుజువులు ఇవ్వాలి. ఇలా ఎన్నో.. ► ఫారాలు 12బీఏ, 12బీబీ, 16.. ఇతర రిటర్నులు .. 10బీఏ.. ఇలా పది ఉన్నాయి ► సంబంధిత సర్క్యులర్లు, రిఫరెన్సులు, పద్ధతులు, నోటిఫికేషన్లు ► డ్రాయింగ్ ఆఫీసర్లు చేయాల్సిన విధులు ► పలు ఉదాహరణలు. ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని, ఏయే సందర్భాలుంటాయి, ఆ సందర్భాలను.. ఆ కేసులను తీసుకుని.. నిజమైన కేస్ స్టడీలాగా రూపొందించి ఉదాహరణలను తయారు చేశారు. అవి చదువుతుంటే మీ కేసునే తీసుకుని తయారు చేశారా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది. ఒక సజీవ కేసు.. ఒక నిజమైన లెక్కింపు.. ఒక ప్రాక్టికల్ ప్రోబ్లెమ్కి రెడీమేడ్ సొల్యూషన్.. రెడీ రిఫరెన్స్.. రెడీ రెకనార్ . చదవండి.. చదివించండి. అర్థం చేసుకుంటే మీరే నిపుణులు. -
SBI: దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకు
ఉమెన్ కమిషన్ నోటీసుల దెబ్బకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ దిగొచ్చింది. గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆఘమేఘాల మీద ప్రకటించింది. ప్రెగ్నెంట్ ఉమెన్ క్యాండిడేట్స్‌ల విషయంలో.. మూడు నెలలు దాటిన గర్భిణి అభ్యర్థులు విధుల్లో చేరడానికి తాతాల్కికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఇండియా సర్క్యులర్ జారీ చేయడం, ఆపై విమర్శలు చెలరేగడం తెలిసిందే. పైగా బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలలలోపు చేరొచ్చంటూ పోయినేడాది డిసెంబర్ 31న రిలీజ్ చేసిన ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే ఈ చర్య వివక్షతో కూడుకున్నదని, రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేదిగా ఉందని, పైగా కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 ప్రకారం చెల్లదని అని పేర్కొంటూ ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ విషయమై లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. SBI మునుపటి నిబంధనల ప్రకారం, గర్భిణీ స్త్రీల అభ్యర్థులు గర్భం దాల్చిన ఆరు నెలల వరకు బ్యాంకులో నియమించబడటానికి అర్హులు. దానిని మారుస్తూ బ్యాంక్ సర్క్యులర్ తేవడడమే తాజా విమర్శలకు కారణమైంది. ఇక సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్ ప్రకటించినప్పటికీ.. బ్యాంక్ చైర్మన్ ఉమెన్ కమిషన్ ముందు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. -
గల్ఫ్ కార్మికులకు అన్యాయం... పత్తాలేని కొత్త సర్క్యులర్
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల గల్ఫ్ కార్మికుల కష్టాలు ఇంకా తీరలేదు. వేతనాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా సర్క్యులర్‌ను క్షేత్రస్థాయికి చేరలేదు. దీంతో వలస జీవులు ఇంకా శ్రమ దోపిడికి గురవుతూనే ఉన్నారు. వేతనాలు తగ్గిస్తూ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను (మినిమం రెఫరల్ వేజెస్) ను 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ లో రెండు సర్క్యులర్లను జారీ చేసింది. అయితే ఈ రెండు సర్క్యులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కార్మికులు, గల్ఫ్ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పాత జీతమే ఇవ్వాలంటూ.. నలువైపుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, కోర్టు కేసుల నేపథ్యంలో పాత వేతనాల కొనసాగింపు డిమాండును కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు జులై 22, 29 తేదీలలో రాజ్య సభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ప్రకటించారు. కనీస వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్ లో జారీ చేసిన సర్క్యులర్లను ఉపసంహరించుకుంటున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయిస్తూ... జులై 15న ఉత్తర్వులను జారీ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది జులై 28న తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. సమస్య పరిష్కారం అయినందున మంద భీంరెడ్డి వేసిన 'పిల్' ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జరగని న్యాయం పాత వేతనాలే కొనసాగించాలంటూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ కనీసం ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్లో కూడా కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు లిఖిత పూర్వకంగా కనిపించకపోవడం కార్మికులకు శాపంగా మారగా కంపెనీలకు వరమైంది. గతంలో వేతనాలు తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌నే చూపెడుడుతూ తక్కువ జీతం చెల్లిస్తూ శ్రమ దోపిడి చేస్తున్నాయి. ఎంబసీకి విజ్ఞప్తి పాత వేతనాలను కొనసాగించే ఆ సర్క్యులర్ని ఇ-మైగ్రేట్ పోర్టల్, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్, గల్ఫ్ దేశాలలోని ఇండియన్ ఎంబసీ వెబ్ సైట్ లలో అందుబాటులో ఉంచలేదని, వెంటనే ఈ సర్క్యులర్ ప్రజలు అందుబాటులో ఉంచాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ అధ్యక్షులు మంద భీంరెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి ఇ-మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. -
ఆయనేమైనా రాజా? దేవుడా?.. ఇంత అతి చేస్తున్నారు
‘ఐదు గంటలపాటు కిటికీలు మూసేయండి. మూడురోజుల పాటు మీ వ్యాపారాలు బంద్ చేయండి’ ఈ ఆదేశాలు జారీ చేసింది అహ్మదాబాద్ పోలీసులు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అహ్మదాబాద్ రెండు రోజుల పర్యటన సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా కారణాలు చూపిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే ఆర్టీఐ యాక్టివిస్ట్ ఒకరు అభ్యంతరం చెప్పడంతో పోలీసుల అత్యుత్సాహం వెలుగులోకి వచ్చింది. గాంధీనగర్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆది, సోమవారాల్లో అహ్మదాబాద్ పర్యటించారు. అయితే ఆయన పర్యటనకు ముందు వెజల్పూర్ పోలీసులు ఎస్సై ఒడెదర పేరుతో ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఆదివారం ఉదయం ఓ కమ్యూనిటీ హాల్ ప్రారంభానికి మంత్రి షా వస్తున్నారని, కాబట్టి, ఆ దగ్గర్లోని 300 ఇళ్ల కిటికీలన్నింటిని మూసేయాలని పోలీసులు అందులో పేర్కొన్నారు. జె కేటగిరీ సెక్యూరిటీ నేపథ్యంలోనే తాము ఆ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. జులై 10న ఆ నోటీసులను ఐదు అపార్ట్మెంట్లకు, చుట్టుపక్కల ఇళ్లకు అంటించి తప్పనిసరిగా పాటించాలని మైకులో అనౌన్స్ చేశారు కూడా. అయితే వెజల్పూర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న పంక్తి జోగ్(44) అనే ఆవిడ అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉందని, కాబట్టి కిటికీలు తెరిచే ఉంచుతానని ఆమె స్టేషన్‌కు వెళ్లి మరీ పోలీసులకు స్పష్టం చేసింది. అంతేకాదు తనలాంటి వాళ్లు ఎందరో ఇబ్బందులు పడతారని, కాబట్టి ఆ సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆమె పోలీసులతో వాదించింది. నిజానికి ఆమె అభ్యంతరం అదొక్కటే ఒక్కటే కాదు. పంక్తి ఓ ఆర్టీఐ ఉద్యమకారిణి. షా పర్యటన నేపథ్యంలో పోలీసులు నిజంగానే అత్యుత్సాహం ప్రదర్శించారనేది ఆమె పాయింట్. మూడు రోజుల పాటు చిరువ్యాపారులను వ్యాపారాలు మూసేయాలని ఆదేశించారని, అలాగే మళ్లింపు పేరుతో వాహనదారులను సైతం ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. ఆమె ఆరోపణలకు స్థానికులు కొందరు సైతం తోడవ్వడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఎస్సైపై చర్యలు? ‘మనం ప్రజాస్వామ్య బద్ధమైన దేశంలోనే ఉన్నామా? వీళ్లు మంత్రులా? రాజులా?. ఆయనేమైనా రాజా? దేవుడా? ఇంత అతి చేస్తున్నారు. కాదు కదా. జనాలు ఓట్లేస్తే గెలిచిన మంత్రి.. వాళ్లను ఇబ్బంది పెట్టడం ఏంటి?. స్వేచ్ఛగా బతకడానికి రాజ్యాంగం సామాన్యులకు హక్కులు ఇచ్చింది’ అని ఆమె పోలీసుల ఎదుట వాదించింది. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లోనూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది. అయితే పోలీసులు మాత్రం తాము ప్రజల్ని బలవంతం చేయలేదని, ఆమె ఆరోపణల్లో నిజం లేదని చెబుతూనే సర్క్యులర్ గురించి మాట్లాడేందుకు ఎస్సై ఒడెదర నిరాకరించారు. ఇక ఈ వ్యవహారం మీడియా ద్వారా ఫోకస్‌లోకి రావడంతో అహ్మదాబాద్ కమిషన్ సంజయ్ వాస్తవ స్పందించారు. ఇలాంటి ఆదేశాలను చర్యలను ఉపేక్షించమని, దర్యాప్తు జరిపించి ఎస్సైపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు అహ్మదాబాద్ పోలీసులకు తమ నుంచి అలాంటి ఆదేశాలు ఏం జారీ కాలేదని కేంద హోం మంత్రి అమిత్ షా భద్రతా విభాగం వెల్లడించింది. -
మొండిబాకీలపై 23లోగా ఆర్బీఐ కొత్త సర్క్యులర్
న్యూఢిల్లీ, ముంబై: మొండిబాకీలకు సంబంధించి సవరించిన సర్క్యులర్‌ను రిజర్వ్ బ్యాంక్ మే 23 లోగానే విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ తుది దశలో ఉందని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే తేదీకి ముందే సర్క్యులర్ విడుదల కావొచ్చని పేర్కొన్నాయి. రూ. 2,000 కోట్లకు మించిన మొండిబాకీలపై ఆర్బీఐ గతంలో విడుదల చేసిన ఫిబ్రవరి 12 సర్క్యులర్‌ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ సవరించిన మార్గదర్శకాలను ప్రకటించాల్సి వస్తోంది. అయితే, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికలకు సంబంధించిన నైతిక నియమావళి అడ్డంకిగా ఉండొచ్చన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. కానీ ఆర్బీఐ సర్క్యులర్‌కు ఇది సమస్య కాబోదని, మే 23 (ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే తేది) లోగానే సవరించిన సర్క్యులర్‌ను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘నైతిక నియమావళి నుంచి ఆర్బీఐ పరపతి విధానానికి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ ఆర్బీఐ గానీ సవరించిన సర్క్యులర్ విడుదల చేస్తే దానిపై నియమావళి ప్రభావం ఉండబోదు‘ అని వివరించాయి. పాత సర్క్యులర్‌ను పూర్తిగా తిరగరాయకుండా.. కొంత మేర సవరించే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. మొండిబాకీ వర్గీకరణకు 90 రోజుల వ్యవధిని యథాతథంగా ఉంచినప్పటికీ.. దివాలా ప్రక్రియ ప్రారంభించేందుకు అదనంగా మరో 30–60 రోజులు సమయం ఇవ్వొచ్చని తెలుస్తోంది. దీనితో రుణాల చెల్లింపునకు కొంత అదనపు సమయం దొరికితే చిన్న, మధ్య తరహా సంస్థలకు కాస్త ఊరట లభించవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఈ నెల తొలినాళ్లలో సుప్రీం కోర్టు మొండిబాకీలపై సర్క్యులర్‌ను కొట్టివేసింది. ఫలితంగానే ఆర్బీఐ కొత్తగా సవరించిన నిబంధనలు ప్రకటించాల్సి వస్తోంది. బ్యాంకులతో పాటు విద్యుత్ రంగ సంస్థలు మొదలైన పరిశ్రమ వర్గాలన్నింటి అభిప్రాయాలను సేకరించి ఆర్బీఐ వీటిని రూపొందిస్తోంది. -
ఇక ఆఫీస్‌కు నో జీన్స్-టీ షర్ట్
జైపూర్ : రాజస్థాన్ లేబర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఇక మీదట ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చే సమయంలో జీన్స్, టీ షర్ట్ వంటి అభ్యంతరకరమైన దుస్తులు ధరించ కూడదని సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నెల 21న లేబర్ కమిషనర్ గిర్రియాజ్ సింగ్ కుష్వాహా ఈ సర్క్యులర్‌ను జారీ చేశారు. ఈ విషయం గురించి గిర్రియాజ్ ‘కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు జీన్స్, టీ షర్ట్ లాంటి అభ్యంతరకర దుస్తులు ధరించి వస్తున్నారు. ఇలాంటి దుస్తులు ధరించి విధులకు హాజరవ్వడం అంటే వారు తమ ఉద్యోగానికి, ఆఫీస్‌కు మర్యాద ఇవ్వనట్లే. ఈ పరిస్థితిని మార్చడం కోసం ఈ నోటీస్‌ను జారీ చేయాల్సి వచ్చింది. ఇక మీదట ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు ప్యాంట్, షర్ట్ మాత్రమే ధరించే రావాలి’ అన్నారు. అయితే ఈ నోటీస్ గురించి ఇంతవరకూ ఉద్యోగుల నుంచి తనకు ఎటువంటి ఫీడ్‌బ్యాక్ అందలేదని తెలిపారు. ఈ విషయం గురించి ‘ఆల్ రాజస్థాన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ ప్రెసిడెంట్ గజేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ నోటీస్‌ను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. జీన్స్, టీ షర్ట్ ధరించడం అభ్యంతకరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి సర్వీస్ రూల్స్ రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఈ నోటీస్‌ను విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా కమిషన్‌ను కోరాతామని చెప్పారు. -
సాక్షి ఎఫెక్ట్: దిగొచ్చిన టీటీడి
-
మళ్లీ 8,400 పైకి నిఫ్టీ...
స్టాక్ మార్కెట్‌కు స్వల్ప లాభాలు విదేశీ ఇన్వెస్టర్లపై పన్నుకు సంబంధించిన సర్క్యులర్‌ను నిలిపేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ మళ్లీ 8,400 పాయింట్లపైకి ఎగబాకింది. బీఎస్ఈ సెన్సెక్స్ 22 పాయింట్లు లాభపడి 27.258 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 8,417 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, మైనింగ్ బ్యాంక్ షేర్లు పెరగ్గా.. టెలికం షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల షేర్ల పరోక్ష బదిలీపై పన్నులను పెంచడానికి సబంధించిన సర్క్యులర్‌ను ప్రభుత్వం నిలిపేయడం కలసివచ్చింది. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విధానాలపై అనిశ్చితి, లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ మార్కెట్ స్వల్పంగా లాభపడింది. రూపాయి క్షీణించినా, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో తొలిసారి మంగళవారం నికర కొనుగోళ్లు జరపారన్న సమాచారం సానుకూల ప్రభావం చూపింది. విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను అంశాన్ని కేంద్రం సస్పెన్షన్‌లో ఉంచడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభమైందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. -
అధికార ‘యాత్ర’
నంద్యాల: జనచైతన్య యాత్రలో అధికారులు, సిబ్బంది పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ విజయభాస్కరనాయుడు పరోక్షంగా హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి షెడ్యూల్ ప్రకారం రోజూ వార్డు పర్యటనలో పాల్గొనాలని ఆదేశించారు. కానీ ఈ సర్కు్యలర్ వివాదాస్పదమవుతుందని భావించి చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నారు. సర్కూలర్ జారీ చేసిన విషయం వాస్తవమేనని, ఎమ్మెల్యే భూమా కార్యాలయం నుంచి సరైన సమాచారం రాకపోవడంతో పొరపాటు జరిగిందని విజయభాస్కరనాయుడు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 25 వరకు టీడీపీ జనచైతన్య యాత్రలను చేపట్టింది. పట్టణంలో ఈ షెడ్యూల్ ప్రకారమే జనచైతన్య యాత్రలు జరుగుతున్నాయి. కమిషనర్ విజయభాస్కరనాయుడు ఈ జనచైతన్య యాత్రలకు అనుకూలంగా గత నెల 30న సర్కు్యలర్ను జారీ చేశారు. ఎమ్మెల్యే భూమా నవంబర్ 1 నుంచి 25 వరకు వార్డు పర్యటనలో పాల్గొంటారని, సర్కు్యలర్తో పాటు పర్యటన తేదీలు, వార్డుల వివరాలను జతపరుస్తున్నామని ఆయన సర్కు్యలర్ను తయారు చేశారు. ఈ జాబితా ప్రకారం సిబ్బంది పర్యటనలో పాల్గొనాలని ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే వార్డు పర్యటన పేరిట జనచైతన్య యాత్రలో పాల్గొనాలని ఆయన పరోక్షంగా ఆదేశించినట్లు తెలిసింది. జనచైతన్య యాత్ర నిర్వహించే తేదీలు, కమిషనర్ జారీ చేసిన తేదీలు, ప్రస్తుతం ఎమ్మెల్యే భూమా నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రల షెడ్యూల్, వార్డు పర్యటనల పేరిట కమిషనర్ జారీ చేసిన షెడ్యూల్ కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఈ సర్కు్యలర్ సిబ్బందికి, కౌన్సిలర్లకు అందకముందే వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే భూమా, చైర్పర్సన్ దేశం సులోచన వేర్వేరు వర్గాలుగా జనచైతన్య యాత్రలను నిర్వహిస్తున్నారు. కమిషనర్ పరోక్షంగా భూమా వర్గానికి అనుకూలంగా సర్కు్యలర్ జారీ చేయడం విమర్శలకు దారి తీసింది. దీంతో సర్కు్యలర్ పంపిణీ గాక మునుపే వెనక్కి తీసుకున్నారు. కమిషనర్ విజయభాస్కరనాయుడు భూమా వర్గానికి అనుకూలంగా జారీ చేసిన సర్కు్యలర్ టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి వర్గం ఆగ్రహానికి గురి చేసింది. కానీ కమిషనర్ విజయభాస్కరనాయుడు జారీ చేసిన సర్కు్యలర్ సిబ్బంది పట్టించుకున్నట్లు లేదురు. జనచైతన్య యాత్రలో ఎవరూ పాల్గొనకపోవడంమే అందుకు నిదర్శనం. సరైన సమాచారం లేకనే: విజయభాస్కరనాయుడు, కమిషనర్ ఎమ్మెల్యే భూమా కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు వార్డు పర్యటనలుగా భావించి సర్కు్యలర్ను జారీ చేశాం. అయితే ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమమని తెలుసుకొని రద్దు చేశాం -
పాఠశాలల్లో జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం
దేశ రాజధాని ఢిల్లీ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండే జంక్ ఫుడ్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. శరీరంలో కొవ్వును పెంచే ఆహార పదార్థాలపై నిబంధనలు విధించింది. విద్యార్థులకు అనారోగ్యాన్ని కలిగించే అత్యధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే పదార్థాలను పాఠశాల క్యాంటీన్లలో అమ్మరాదంటూ రాజధాని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోని పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అత్యధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగించే దుష్ఫలితాలపై ఉదయం అసెంబ్లీ, పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్, పేరెంట్ టీచర్ సమావేశాల ద్వారా అవగాహన కల్పించాలని, డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థానిక పాఠశాలలకు ఓ సర్క్యులర్ పంపింది. అటువంటి ఆహార పదార్థాలను క్యాంటీన్లలో అమ్మే పద్ధతిని పాఠశాల యాజమాన్యాలు కూడా నివారించాలని తెలిపింది. కొవ్వు తక్కువగా ఉండే ఆరోగ్యకరమైన, పోషకాలు కలిగిన ఆహారం అందేలా ప్రోత్సహించాలని సూచించింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన హెచ్ఎఫ్ఎస్ఎస్ ఆహార పదార్థాల జాబితాను నోటీసుబోర్డులో అతికించాలని, ప్రభుత్వ సూచనల మేరకు డ్రాయింగ్, పెయింటింగ్, స్లోగన్లు, డిబేట్ల వంటి కార్యక్రమాలతో ప్రతి విద్యార్థికి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలపై అవగాహన కలిగించడంలో పాఠశాల యాజమాన్యం శ్రద్ధ వహించాలని తెలిపింది. ఆరోగ్యకర ప్రపంచాన్ని సృష్టించేదుకు కూరగాయలతో తయారయ్యే శాండ్విచ్, పళ్ళు, పనీర్ కట్లెట్లు, ఖాండ్వీ, పోహా, తక్కువ కొవ్వు కలిగిన పాల లాంటి ఆరోగ్యకర ఆహారాన్ని విద్యార్థులు తీసుకునేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల పిల్లల్లో జంక్ ఫుడ్ నింయంత్రణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా పాఠశాల ప్రాంగణంలోనూ, చుట్టుపక్కల చిప్స్, వేయించిన ఆహారాలు, శీతల పానీయాలు, కొవ్వు, ఉప్పు , చక్కెర కలిగిన పదార్థాల అమ్మకంపై నియంత్రణ విధించారు. -
వాహనాల విడుదలను వ్యతిరేకించమనండి
♦ అన్ని కోర్టుల పీపీలు, ఏపీపీలను ఆదేశించండి ♦ ఢిల్లీ సర్కార్ తరహాలో సర్క్యులర్ ఇవ్వండి ♦ ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు స్పష్టీకరణ.. విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: జంతువుల అక్రమ రవాణా అరికట్టే విషయంలో కీలక ఆదేశాల జారీకి హైకోర్టు నిర్ణయించింది. జంతువులను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహన యజమానులు వాటి విడుదలకు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తే, వాటిని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అదనపు, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ సర్కార్ మాదిరిగానే ఓ సర్క్యులర్ జారీ చేయాలని సూచించింది. జంతువులతో సహా వాహనాల విడుదలకు పిటిషన్లు దాఖలైనప్పుడు, యథావిధిగావాటి విడుదల కోసం ఉత్తర్వులు జారీ చేయకుండా కిందిస్థాయి న్యాయాధికారులకు తగిన మార్గనిర్దేశం చేస్తామని తెలిపింది. ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పిఠాపురం మునిసిపాలిటీలోని పశువుల మార్కెట్లో జంతువులను హింసిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, జంతు హింస నిరోధానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేలా అధికారులను ఆదేశించాలంటూ జంతు రక్షణ సంఘం, గో సంరక్షణ ఫెడరేషన్, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.ఎస్.మూర్తి వాదనలు వినిపిస్తూ, జంతు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను విడుదల చేయించేందుకు వాటి యజమానులు కింది కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారని, కోర్టులు జంతువులతో సహా ఆ వాహనాలను విడుదల చేస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా, వాహనాల విడుదలకు ఎలా పిటిషన్లు దాఖలు చేస్తారని, వాటి విడుదలకు ఎలా ఉత్తర్వులు పొందుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ వాదనలు వినిపిస్తూ అక్రమ కట్టడాల విషయంలో ఎలాంటి ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేయరాదని కింది కోర్టులకు గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అదేవిధంగా జంతు అక్రమ రవాణా విషయంలో ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. -
బ్యాంకు అధికారులే బాధ్యులు
రుణ విముక్తిలో పొరపాట్లపై సర్కారు సర్క్యులర్ ‘‘రుణం విషయంలో గానీ, ప్రభుత్వం విధించిన షరతుల విషయంలో గానీ, రుణ విముక్తికి అర్హత పొందిన మొత్తంలో గానీ ఎటువంటి తేడాలు జరిగినా, తప్పులు దొర్లినా ఆయా బ్యాంకు ఆఫీసర్లే బాధ్యత వహించాలి. అర్హత లేని రైతుల ఖాతాలకు గానీ లేదా అర్హత పొందిన సొమ్ముకు మించి గానీ జమ చేసిన పక్షంలో వెంటనే ఆ సొమ్మును ఆయా రైతుల ఖాతాల నుంచి ఉపసంహరించాలి.’’ సాక్షి, హైదరాబాద్: రైతుల రుణ విముక్తిలో ఏవైనా తప్పులు జరిగితే సంబంధిత బ్యాంకు ఆఫీసర్లను బాధ్యులను చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకర్లకు ఆర్థికశాఖ మరో సర్క్యులర్ జారీ చేసింది. రుణ విముక్తిలో రైతులు తీసుకున్న రుణం విషయంలో గానీ, ప్రభుత్వం విధించిన షరతుల విషయంలో గానీ, రుణ విముక్తికి అర్హత పొందిన మొత్తం లో గానీ ఎటువంటి తేడాలు జరిగినా, ఆయా బ్యాంకు ఆఫీసర్లే బాధ్యత వహించాలని ఈ సర్క్యులర్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యాంకు ఆఫీసర్లు రుణ విముక్తి వివరాలను మరోసారి తనిఖీ చేయాలని, అన్నీ సవ్యంగా ఉన్నట్లు సంతృప్తి చెందితేనే ఆయా రైతుల ఖాతాలకు నిధులు జమ చేయాలని నిర్దేశించింది. పొరపాటు జరిగి అర్హత లేని రైతుల ఖాతాలకు గానీ లేదా అర్హత పొందిన సొమ్ముకు మించి గానీ జమ చేస్తే వెంటనే ఆ సొమ్మును ఆయా రైతుల ఖాతాల నుంచి ఉపసంహరించడంతో పాటు ఆ విషయాన్ని తమకు తెలపాలని ప్రభుత్వం పేర్కొంది. అర్హత పత్రాలను బాగా పరిశీలించాలి అలాగే రైతుల దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకుని.. వారు విముక్తికి అర్హత పొందిన సొమ్మును వారి వారి ఖాతాలకు జమ చేయాలని సర్క్యులర్‌లో సూచించారు. రైతులు ఏదైనా కారణంతో అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకున్నా అర్హత పొందిన సొమ్మును ఆ రైతుల ఖాతాలకు జమ చేయడంతో పాటు బ్యాంకు అధికారి ఆ రైతులకు సమాచారం పంపించాలని చెప్పారు. ఆ రైతుల ఖాతాలకు ఎంత మొత్తం జమ అయిందో బ్యాంకు అధికారులు ధృవీకరణ పత్రం ఇవ్వాలన్నారు. ఏదైనా నిబంధన కారణంగా రైతుల ఖాతాల రుణ విముక్తి పెండిం గ్లో ఉంచితే.. ఆయా రైతులు ఆ నిబంధనకు సంబంధించిన పత్రాలను తీసుకొస్తే పరిశీ లించి అర్హత గల సొమ్మును వారి ఖాతాలకు జమ చేయడంతో పాటు రైతులకు సమాచారమివ్వాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. సగానికి కోసి.. ఐదో వంతు జమ.. అధికారంలోకి వస్తే తొలి సంతకంతోనే రాష్ట్రం లోని వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందిచ్చిన హామీ. ఏపీలో వ్యవసాయ రుణాలు తీసుకున్న మొత్తం కోటి మందికి పైగా రైతు ఖాతాలకు సంబంధించి 87,612 కోట్ల రూపాయల రుణాలున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడున్నర నెలలు దాటుతుండగా ఇప్పటివరకు చంద్రబాబు చెల్లించింది ఎంత అంటే.. కేవలం రూ. 1,900 కోట్ల రూపాయలే. ఈ మొత్తమంతా రైతుల రుణాల వడ్డీకి కూడా సరిపోలేదు. తొలి దశలో రుణ విముక్తికి అర్హులుగా తేల్చిన రైతుల ఖాతాల రుణాలు మొత్తం రూ. 24,001 కోట్లుండగా.. ప్రభుత్వం అనేక షరతుల ద్వారా దానిని రూ. 14,320 కోట్లకు కుదించింది. అందులోనూ ఈ ఏడాది తీర్చేది (20 శాతం) కేవలం రూ.4,663 కోట్లే. ఇందులో ఇప్పటివరకు రూ.1,900 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేశారు. ప్రభుత్వం ఒకసారి రైతుల ఖాతాలను వడపోసిన తరువాత కూడా బ్యాంకులను బాధ్యులను చేస్తూ మళ్లీ పరిశీలించాలని ఆదేశించడంతో బ్యాంకు అధికారులు ఒకటికి రెండుసార్లు వివరాలను పరిశీలిస్తుండటంతో తొలి దశ 20 శాతం రుణ విముక్తి నిధుల జమ నత్తనడకన సాగుతోంది. -
ఇంట్లోనే సంజయ్‌దత్
ముంబై: రెండు వారాల ఫర్లాగ్(తాత్కాలిక సెలవులాంటిది) బుధవారంతో ముగిసినప్పటికీ, సెలవు పొడిగింపుపై పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉండడంతో బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ ఇంట్లోనే ఉండిపోయాడు. 14రోజుల ఫర్లాగ్ తీసుకున్న వ్యక్తి పై 29వ రోజు వరకూ ఎలాంటి చర్యా తీసుకోలేమని జైళ్లశాఖ విడుదల చేసిన సర్క్యులర్ ద్వారా తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే ఆయనకు మరో 14 రోజుల సెలవు అదనంగా వచ్చినట్లయింది. ఈ కారణంగానే సం జయ్‌పై ఎలాంటి చర్యా తీసుకోవడానికి వీలులేదని, సెలవు అభ్యర్థన తిరస్కరిస్తే 24గంటల్లోపు సంజయ్ లొంగిపోతారని ఆయన న్యాయవాది తెలిపారు. సంజయ్ సెలవు పొడగిం పు అభ్యర్థనను పరిష్కరించడం లో జరుగుతున్న జాప్యంపై విమర్శలు రావడంతో ఈ విషయంలో చట్టప్రకారం వెళ్తామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ శుక్రవారం గాంధీనగర్‌లో వ్యాఖ్యానించారు. -
కారుణ్య నియామకాలకు ఆర్టీసీ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కారుణ్య నియామకాల కోసం ఆర్టీసీ యాజమాన్యం శనివారం సర్క్యూలర్ జారీ చేసింది. ఈ సర్క్యూలర్‌తో గతంలో ఉద్యోగాలు పొందిన 1120మంది సహా అదనంగా మరో 1000 మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు అమలు చేయాలన్న ఆర్టీసీ సిబ్బంది దీర్ఘకాల డిమాండును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ సిబ్బందిలో ఎవరైనా మరణించినట్లైతే వారి కుటుంబంలో అర్హులైన వారిలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తారు. దాదాపు 1998 నుంచి ఆగిపోయిన ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలన్న డిమాండ్ ఆర్టీసీలో చాలా కాలంగా ఉంది. సుమారు 1120 మందికి మాత్రమే ప్రయోజనం కలిగేలా, 2010 డిసెంబర్ చివరి వరకు మాత్రమే వర్తించేలా పరిమితిని విధిస్తూ గతేడాది జనవరిలో విడుదలైన ఉత్తర్వులను కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఆర్టీసీలో కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేయటంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.