అధికార ‘యాత్ర’
అధికార ‘యాత్ర’
Published Tue, Nov 8 2016 11:13 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
నంద్యాల: జనచైతన్య యాత్రలో అధికారులు, సిబ్బంది పాల్గొనాలని మున్సిపల్ కమిషనర్ విజయభాస్కరనాయుడు పరోక్షంగా హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి షెడ్యూల్ ప్రకారం రోజూ వార్డు పర్యటనలో పాల్గొనాలని ఆదేశించారు. కానీ ఈ సర్కు‍్యలర్ వివాదాస్పదమవుతుందని భావించి చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నారు. సర్కూలర్ జారీ చేసిన విషయం వాస్తవమేనని, ఎమ్మెల్యే భూమా కార్యాలయం నుంచి సరైన సమాచారం రాకపోవడంతో పొరపాటు జరిగిందని విజయభాస్కరనాయుడు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 25 వరకు టీడీపీ జనచైతన్య యాత్రలను చేపట్టింది. పట్టణంలో ఈ షెడ్యూల్ ప్రకారమే జనచైతన్య యాత్రలు జరుగుతున్నాయి. కమిషనర్ విజయభాస్కరనాయుడు ఈ జనచైతన్య యాత్రలకు అనుకూలంగా గత నెల 30న సర్కు‍్యలర్‌ను జారీ చేశారు. ఎమ్మెల్యే భూమా నవంబర్ 1 నుంచి 25 వరకు వార్డు పర్యటనలో పాల్గొంటారని, సర్కు‍్యలర్‌తో పాటు పర్యటన తేదీలు, వార్డుల వివరాలను జతపరుస్తున్నామని ఆయన సర్కు‍్యలర్‌ను తయారు చేశారు. ఈ జాబితా ప్రకారం సిబ్బంది పర్యటనలో పాల్గొనాలని ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే వార్డు పర్యటన పేరిట జనచైతన్య యాత్రలో పాల్గొనాలని ఆయన పరోక్షంగా ఆదేశించినట్లు తెలిసింది. జనచైతన్య యాత్ర నిర్వహించే తేదీలు, కమిషనర్ జారీ చేసిన తేదీలు, ప్రస్తుతం ఎమ్మెల్యే భూమా నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రల షెడ్యూల్, వార్డు పర్యటనల పేరిట కమిషనర్ జారీ చేసిన షెడ్యూల్ కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఈ సర్కు‍్యలర్ సిబ్బందికి, కౌన్సిలర్లకు అందకముందే వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే భూమా, చైర్‌పర్సన్ దేశం సులోచన వేర్వేరు వర్గాలుగా జనచైతన్య యాత్రలను నిర్వహిస్తున్నారు. కమిషనర్ పరోక్షంగా భూమా వర్గానికి అనుకూలంగా సర్కు‍్యలర్ జారీ చేయడం విమర్శలకు దారి తీసింది. దీంతో సర్కు‍్యలర్ పంపిణీ గాక మునుపే వెనక్కి తీసుకున్నారు. కమిషనర్ విజయభాస్కరనాయుడు భూమా వర్గానికి అనుకూలంగా జారీ చేసిన సర్కు‍్యలర్ టీడీపీ ఇన్‌చార్జి శిల్పామోహన్‌రెడ్డి వర్గం ఆగ్రహానికి గురి చేసింది. కానీ కమిషనర్ విజయభాస్కరనాయుడు జారీ చేసిన సర్కు‍్యలర్ సిబ్బంది పట్టించుకున్నట్లు లేదురు. జనచైతన్య యాత్రలో ఎవరూ పాల్గొనకపోవడంమే అందుకు నిదర్శనం.
సరైన సమాచారం లేకనే: విజయభాస్కరనాయుడు, కమిషనర్
ఎమ్మెల్యే భూమా కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు వార్డు పర్యటనలుగా భావించి సర్కు‍్యలర్‌ను జారీ చేశాం. అయితే ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమమని తెలుసుకొని రద్దు చేశాం
Advertisement
Advertisement